Akshaya Gold Assets
-
వేలం ఆస్తులను కోర్టు ముందుంచిన సీఐడీ
జాబితాలో పది అగ్రిగోల్డ్ , 5 అక్షయ గోల్డ్ ఆస్తులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఈ పోర్టల్ ద్వారా వేలం వేసేందుకు గుర్తించిన అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలను ఏపీ సీఐడీ అధికారులు మంగళవారం హైకోర్టు ముందుంచారు. ఇందులో 10 అగ్రిగోల్డ్ ఆస్తులు, 5 అక్షయ గోల్డ్ ఆస్తులు ఉన్నాయి. అగ్రిగోల్డ్ యాజమాన్యం సైతం 35 ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించింది. వీటిలో విశాఖపట్నంలో రూ.360 కోట్ల విలువైన ఆస్తులు, నెల్లూరులో రూ.360 కోట్ల ఆస్తులు ఉన్నాయి. తదుపరి విచారణ సమయంలో ఈ ఆస్తుల వేలానికి ఆటంకాలు ఉండవని భావిస్తున్నామన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఆ రోజున వేలం విధివిధానాలు, ప్రచారం తదితర విషయాలపై ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. కాగా తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ అగ్రిగోల్డ్ పూర్వ డైరెక్టర్ అవ్వా సీతారామారావు వేసిన పిటిషన్లపై మంగళవారం వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణ తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
వెంటనే అమ్ముడుపోయే ఆస్తుల వివరాలివ్వండి
అక్షయగోల్డ్ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తక్షణ విక్రయం కోసం అక్షయగోల్డ్ ఆస్తులు, వాటి విలువ తదితర వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం ఏపీ సీఐడీ అధికారులను, పిటిషనర్లను ఆదేశించింది. అగ్రిగోల్డ్ తరహాలోనే ఈ ఆస్తుల విక్రయానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వారుుదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి దాదాపు 600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి వాటిని చెల్లించకుండా అక్షయగోల్డ్ ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అక్షయగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. -
‘అక్షయ గోల్డ్’ ఆస్తుల స్వాధీనానికి ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల స్కీముల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడి, రూ.కోట్లలో దండుకున్న అక్షయ గోల్డ్ ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా సంస్థ ఆస్తుల స్వాధీనానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 26 మందికి చెందిన, సంస్థ/వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10.15 కోట్ల నగదుతో పాటు 2,354 ఎకరాల స్థలాలను సైతం స్వాధీనం చేసుకోనున్నారు.