akshinthalu
-
Lok sabha elections 2024: ఇస్తినమ్మా తాంబూలం.. వస్తినమ్మా ఓటింగ్‌కు!
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమాలెన్నో జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బలరామ్‌పూర్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలు చేసిన ‘సంప్రదాయ’ కృషి వీటన్నింట్లో ఎంతో ఆసక్తికరం. మూడో దశలో భాగంగా ఈ నెల 7న రాష్ట్రంలో ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. బలరామ్‌పూర్ జిల్లాలోని సర్గూజా లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు చింతాకులు, అక్షితలు అందించారు. తప్పకుండా ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సంప్రదాయాలను ఇలా వినూత్నంగా వాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. ‘చింతాకులు, అక్షితలు అందించడం మా సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లకు, మా సంఘం కార్యక్రమానికి ఇలాగే ఆహా్వనిస్తాం. అదే పద్ధతిలో విధిగా ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాం. దీనికి స్పందన కూడా చాలా బాగా వచి్చంది’’ అని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యురాలు విమలా సింగ్ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు జిల్లా నోడల్ అధికారి రైనా జమీల్ పేర్కొన్నారు. ఓటర్లను ఇలా వినూత్నంగా పోలింగ్ బూత్‌లకు తరలాల్సిందిగా కోరిన తీరు పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశాలను కూడా ఆకట్టుకుంది. ఆ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం మే 13న నాలుగు విడతలో మొదలై జూన్ 1న ఏడో విడత దాకా కొనసాగనుంది. అక్కడ కూడా ఇలా ఓటర్లను సంప్రదాయ పద్ధతిలో ఓటేసేందుకు ఆహా్వనించాలని పలు జిల్లాల ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట!– సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్ చేరుకున్న అయోధ్య శ్రీరామ అక్షింతలు
-
అక్షింతల కోసం తోపులాట
కర్రలకు.. కాగడాలకు పని చెప్పిన పోలీసులు అమలాపురం / సఖినేటిపల్లి : పదే..పదే..అదే సీను. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కళ్యాణం పూర్తయిన వెంటనే కళ్యాణ తలంబ్రాల కోసం భక్తులు ఎగబడడం.. తోపులాట చోటు చేసుకోవడం.. నిలువరించలేక పోలీసులు చేతులు ఎత్తివేయడం అనవాయితీగా మారింది. ఈసారీ అంతే.. కాకపోతే భక్తులను అదుపు చేయడానికి కర్రలు, కాగడాలకు పనిచెప్పాల్సి వచ్చింది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మంగళవారం తెల్లవారు జామున 1.30 గంటలకు ముగిసింది. తలంబ్రాల అక్షింతల కోసం భక్తుల కళ్యాణ వేదిక వద్దకు చొచ్చుకు వచ్చారు. కళ్యాణ నిర్వాహకులు భక్తుల కోసం పెద్ద ఎత్తున అక్షింతలు సిద్ధం చేయడంతో పాటు భక్తుల కూర్చున్న బాక్సుల వద్దకు వచ్చి పోలీసులు, సిబ్బంది అందిస్తారని పదేపదే చెప్పినా భక్తజనం లెక్కచేయలేదు. ఒక్క ఉదుటన కళ్యాణ వేదిక వద్దకు నెట్టుకుంటూ వచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. వేదిక మీద ఉన్న పోలీసు అధికారులు, రక్షణగా ఉన్న సిబ్బంది అత్యుత్సాహానికి పోయిన వేదిక వద్దనే అక్షింతల పంపిణీ ఆరంభించారు. వాటిని అందిపుచ్చుకోవాలని భక్తులు ఆతృత చూపడడంతో తోపులాట పెరిగింది. ఒకానొక సమయంలో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడడంతో భక్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. వేదిక వద్ద అక్షింతలు పంపిణీ చేయవద్దని పదేపదే మైకులో నిర్వాహకులు చెప్పినా అక్కడున్న పోలీసులు పట్టించుకోలేదు. కింద ఉన్న పోలీసులు భక్తులను అదుపు చేయలేక బారికేడ్ల కట్టేందుకు ఉపయోగించిన కర్రలను, స్వామివారి పల్లకి కూడా వచ్చే కాగడాల మంటలతో భక్తులు వెనక్కు నెట్టేందుకు ప్రయత్నించారు. కొంత మంది పోలీసులు కర్రలతో భక్తులపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. సుమారు గంటల పాటు కళ్యాణ వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్షింతలు అవసరం లేదని భక్తులు బయటకు వెళ్లిపోదామన్నా నలువైపులా దారులు మూసుకుపోవడంతో అష్టకష్టాలు పడి బయటకు వచ్చారు. ఆలయంలో స్వామి వారి దర్శనానికి వెళ్లేటప్పుడు అక్షింతలు ఇస్తామనడంతో పరిస్థితి సద్దుమణిగింది. అక్షింతల సమయంలో తోపులాట జరగడం పరిపాటిగా మారిన పోలీసులు ముందస్తు చర్చలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.