మంగినపూడి బీచ్లో ఈతకెళ్లి ఇద్దరి మృతి
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో సముద్రంలో ఈతకెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. మృతులు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన ప్రవీణ్(20), అక్షిత(19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.