Alisa Khan
-
విడాకుల కోసం భర్త వేధిస్తున్నాడు: హీరోయిన్
విడాకుల కోసం భర్త తనను వేధిస్తున్నాడని బాలీవుడ్ నటి ఆలిసా ఖాన్ పోలీసులను ఆశ్రయించింది. మోడల్ నుంచి నటిగా మారిన ఆలిసా ఖాన్ ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ సరసన 'ఐనా' సినిమాలో నటించింది. ఆమె ఇటీవలే సినీ నిర్మాత లవ్ కపూర్‌ను పెళ్లాడింది. అయితే, లవ్ కపూర్ తనను వేధిస్తున్నాడని, ఓసారి తనపై దాడి చేసి కొట్టాడని ఆరోపిస్తూ ఆమె ఘజియాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హరిద్వార్ వాసి అయిన లవ్ కపూర్‌ను పెళ్లాడేందుకు ఆమె మతం కూడా మార్చుకుంది. ఘజియాబాద్ లోని ఓ అద్దె నివాసంలో ఈ జంట నివసిస్తోంది. గత శుక్రవారం ఓ హోటల్లో మద్యం మత్తులో భర్త తనపై దాడి చేశాడని, ఆ తర్వాత తనను హోటల్లో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లిపోయాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది. విడాకులు ఇవ్వాలని భర్త తనను వేధిస్తున్నాడని, అందుకు తాను ఒప్పుకోకుండా తమ వైవాహిక బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె తెలిపింది. ఆలిసా ఖాన్ ఫిర్యాదుపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఘజియాబాద్ పోలీసులు తెలిపారు. -
డబ్బులిస్తాం.. వస్తావా అని అడుగుతున్నారు..!
న్యూఢిల్లీ: బాలీవుడ్ రొమాంటిక్ నటుడు ఇమ్రాన్ హష్మీ హీరోయిన్ అలిసా ఖాన్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ఆమె దేశ రాజధాని న్యూఢిల్లీ వీధులలో జీవనం సాగిస్తోంది. బిచ్చుమెత్తుకుంటుందని, ఆమె చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నట్లు భిన్న కథనాలు వచ్చాయి. ఇది చూసిన నెటిజన్స్ ఊరకనే ఉంటారు. పుండు మీద కారం చల్లినట్లుగా ప్రవర్తిస్తున్నారు. నీకు డబ్బులిస్తాం.. నాతో ఓ రాత్రి గుడుపుతావా అంటూ సోషల్ మీడియాలో తనపై కామెంట్లు వస్తున్నాయని నటి విచారం వ్యక్తం చేస్తోంది. అయితే ఇలాంటి వాటికి తాను బెదిరిపోయే ప్రస్తక్తేలేదని తేల్చి చెప్పింది. మా ముత్తాత చక్రవర్తి, ఆయన రక్తమే తనలో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలని ఎదురు ప్రశ్నిస్తోంది. టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కదా. అమెలా తాను సూసైడ్ చేసుకోనని, తన సమస్యపై పోరాటం కొనసాగిస్తానని చెప్పింది. కో స్టార్ ఇమ్రాన్ హష్మీతో డబ్బులు తీసుకోవచ్చు కదా అని మీడియా ప్రశ్నించగా.. 'నేను సెలబ్రిటీని. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. ఇమ్రాన్ హష్మీ నుంచి డబ్బులు తీసుకోను. ఎవరి వద్ద నేను బిచ్చమెత్తను. పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉంటాను' అని అలిసా అంటోంది. మొబైల్, బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులను అమ్మేశాను. ఆ నగదుతోనే రోజులు గడిచిపోతున్నాయని పేర్కొంది. అయితే కొందరు మాత్రం తన పరిస్థితి దారుణంగా ఉందని తెలసుకుని, ఒక్క రాత్రికి వస్తావా అని కామెంట్ చేస్తున్నారంటూ తన బాధల్ని చెప్పుకుంది. వాస్తవానికి 2013లో 'మై హస్బెండ్స్ వైఫ్' అనే మూవీలో అవకాశం రావడంతో ఇమ్రాన్ హష్మీకి జోడీగా నటించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమో షూటింగ్ కోసం న్యూఢిల్లీకి వచ్చింది. బాయ్ ఫ్రెండ్ సమీర్ తన వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేశాడు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి అలిసాతో పాటు ఆమె ఫ్యామిలీకి తెలిసింది. ఈ వీడియోలు చూసిన ఫ్యామిలీ అలిసాను ఇంటి నుంచి గెంటేసింది. అక్కడి నుంచి ఆమె కష్టాలు మొదలయ్యాయి. -
వీడియోలు లీక్ చేస్తున్నాడంటూ నటి ఫిర్యాదు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ జోడీ అలిసా ఖాన్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అలిసా, ఇమ్రాన్ 'మై హస్బెండ్స్ వైఫ్' అనే మూవీలో కలిసి నటించారు. ప్రస్తుతం ఆమె దేశ రాజధాని వీధులలో జీవనం సాగిస్తోంది. ఈ విషయాన్ని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ లీక్ చేస్తున్నాడు. గ్రేటర్ కైలాశ్ వీధిలో ఆమె ప్రస్తుతం నివాసం ఉంటోంది. అలిసా తీరు, చేష్టలు నచ్చక ఇంట్లో వాళ్లు ఆమెను బయటకు పంపించేశారు. ఆమె మాజీ లవర్ ఈ విషయాలను ఓ వీడియో రూపంలో లీక్ చేశాడు. దీంతో నటి ప్రస్తుత పరిస్థితి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఆమె తన ఫ్యామిలితో సహా ఘజియాబాద్ లో ఉండేది. అయితే 2010లో 'మై హస్బెండ్స్ వైఫ్' అనే మూవీలో అవకాశం రావడంతో నటించింది. అయితే ఇప్పటివరకూ ఆ మూవీ విడుదల కాలేదు. వీడియోలతో మాజీ బాయ్ ఫ్రెండ్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అతడు లీక్ చేసిన వీడియోలు, తప్పుడు ప్రచారం వల్లే తన ఇంట్లోనే స్థానం కోల్పోయానని అలిసా చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.