డబ్బులిస్తాం.. వస్తావా అని అడుగుతున్నారు..! People are offering me money to sleep with them, says Alisa Kkhan | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తాం.. వస్తావా అని అడుగుతున్నారు..!

Published Thu, Jun 16 2016 4:52 PM

డబ్బులిస్తాం.. వస్తావా అని అడుగుతున్నారు..! - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్ రొమాంటిక్ నటుడు ఇమ్రాన్ హష్మీ హీరోయిన్ అలిసా ఖాన్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ఆమె దేశ రాజధాని న్యూఢిల్లీ వీధులలో  జీవనం సాగిస్తోంది. బిచ్చుమెత్తుకుంటుందని, ఆమె చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నట్లు భిన్న కథనాలు వచ్చాయి. ఇది చూసిన నెటిజన్స్ ఊరకనే ఉంటారు. పుండు మీద కారం చల్లినట్లుగా ప్రవర్తిస్తున్నారు. నీకు డబ్బులిస్తాం.. నాతో ఓ రాత్రి గుడుపుతావా అంటూ సోషల్ మీడియాలో తనపై కామెంట్లు వస్తున్నాయని నటి విచారం వ్యక్తం చేస్తోంది. అయితే ఇలాంటి వాటికి తాను బెదిరిపోయే ప్రస్తక్తేలేదని తేల్చి చెప్పింది.

మా ముత్తాత చక్రవర్తి, ఆయన రక్తమే తనలో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలని ఎదురు ప్రశ్నిస్తోంది. టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కదా. అమెలా తాను సూసైడ్ చేసుకోనని, తన సమస్యపై పోరాటం కొనసాగిస్తానని చెప్పింది. కో స్టార్ ఇమ్రాన్ హష్మీతో డబ్బులు తీసుకోవచ్చు కదా అని మీడియా ప్రశ్నించగా.. 'నేను సెలబ్రిటీని. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. ఇమ్రాన్ హష్మీ నుంచి డబ్బులు తీసుకోను. ఎవరి వద్ద నేను బిచ్చమెత్తను. పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉంటాను' అని అలిసా అంటోంది. మొబైల్, బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులను అమ్మేశాను. ఆ నగదుతోనే రోజులు గడిచిపోతున్నాయని పేర్కొంది. అయితే కొందరు మాత్రం తన పరిస్థితి దారుణంగా ఉందని తెలసుకుని, ఒక్క రాత్రికి వస్తావా అని కామెంట్ చేస్తున్నారంటూ తన బాధల్ని చెప్పుకుంది.

వాస్తవానికి 2013లో 'మై హస్బెండ్స్ వైఫ్' అనే మూవీలో అవకాశం రావడంతో ఇమ్రాన్ హష్మీకి జోడీగా నటించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమో షూటింగ్ కోసం న్యూఢిల్లీకి వచ్చింది. బాయ్ ఫ్రెండ్ సమీర్ తన వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేశాడు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి అలిసాతో పాటు ఆమె ఫ్యామిలీకి తెలిసింది. ఈ వీడియోలు చూసిన ఫ్యామిలీ అలిసాను ఇంటి నుంచి గెంటేసింది. అక్కడి నుంచి ఆమె కష్టాలు మొదలయ్యాయి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement