MMS
-
డబ్బులిస్తాం.. వస్తావా అని అడుగుతున్నారు..!
న్యూఢిల్లీ: బాలీవుడ్ రొమాంటిక్ నటుడు ఇమ్రాన్ హష్మీ హీరోయిన్ అలిసా ఖాన్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ఆమె దేశ రాజధాని న్యూఢిల్లీ వీధులలో జీవనం సాగిస్తోంది. బిచ్చుమెత్తుకుంటుందని, ఆమె చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నట్లు భిన్న కథనాలు వచ్చాయి. ఇది చూసిన నెటిజన్స్ ఊరకనే ఉంటారు. పుండు మీద కారం చల్లినట్లుగా ప్రవర్తిస్తున్నారు. నీకు డబ్బులిస్తాం.. నాతో ఓ రాత్రి గుడుపుతావా అంటూ సోషల్ మీడియాలో తనపై కామెంట్లు వస్తున్నాయని నటి విచారం వ్యక్తం చేస్తోంది. అయితే ఇలాంటి వాటికి తాను బెదిరిపోయే ప్రస్తక్తేలేదని తేల్చి చెప్పింది. మా ముత్తాత చక్రవర్తి, ఆయన రక్తమే తనలో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలని ఎదురు ప్రశ్నిస్తోంది. టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కదా. అమెలా తాను సూసైడ్ చేసుకోనని, తన సమస్యపై పోరాటం కొనసాగిస్తానని చెప్పింది. కో స్టార్ ఇమ్రాన్ హష్మీతో డబ్బులు తీసుకోవచ్చు కదా అని మీడియా ప్రశ్నించగా.. 'నేను సెలబ్రిటీని. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. ఇమ్రాన్ హష్మీ నుంచి డబ్బులు తీసుకోను. ఎవరి వద్ద నేను బిచ్చమెత్తను. పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉంటాను' అని అలిసా అంటోంది. మొబైల్, బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులను అమ్మేశాను. ఆ నగదుతోనే రోజులు గడిచిపోతున్నాయని పేర్కొంది. అయితే కొందరు మాత్రం తన పరిస్థితి దారుణంగా ఉందని తెలసుకుని, ఒక్క రాత్రికి వస్తావా అని కామెంట్ చేస్తున్నారంటూ తన బాధల్ని చెప్పుకుంది. వాస్తవానికి 2013లో 'మై హస్బెండ్స్ వైఫ్' అనే మూవీలో అవకాశం రావడంతో ఇమ్రాన్ హష్మీకి జోడీగా నటించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమో షూటింగ్ కోసం న్యూఢిల్లీకి వచ్చింది. బాయ్ ఫ్రెండ్ సమీర్ తన వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేశాడు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి అలిసాతో పాటు ఆమె ఫ్యామిలీకి తెలిసింది. ఈ వీడియోలు చూసిన ఫ్యామిలీ అలిసాను ఇంటి నుంచి గెంటేసింది. అక్కడి నుంచి ఆమె కష్టాలు మొదలయ్యాయి. -
అశ్లీల ఎస్ఎమ్మెస్లు పంపిస్తే జైలుకే
రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్రం ఓకే! సాక్షి,బెంగళూరు :అశ్లీల ఎస్ఎమ్మెస్లు, ఎంఎంఎస్‌లు పంపిన వారు ఇకపై జైలుకు వెళ్లడం ఖచ్చితం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టసవరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించనట్లు సమాచారం. అశ్లీల చిత్రాలను, సమాచారాన్ని మహిళలకు, చిన్నారులతో పాటు బలవంతంగా ఇతరులకు చూపించడం చట్య రీత్యా నేరం. ఇప్పటి వరకూ ముద్రణా (కాగితం) రూపంలో ఉన్న అశ్లీల చిత్రాలు, సమాచారంతో పాటు కొంత వరకూ ఎలక్ట్రానిక్ రూపంలోని అశ్లీలతకు ఈ చట్టం వర్తిస్తుంది. అయితే చట్టంలోని కొన్ని లొసుగులను వినియోగించుకుని దుండగులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. సమస్య పరిష్కారం కోసం కఠిన, నూతన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. నూతన విధానం ప్రకారం ఒక నిమిషం పాటు అశ్లీల చిత్రాలు, సమాచారాన్ని ఎస్ఎంఎస్, మెయిల్‌తో పాటు ఇతర ఏ ఎలక్ట్రానిక్ రూపంలో పంపించినా వారికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమాన విధిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం సమ్మతించినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
'ప్రియురాలికి ప్రేమ ముద్దు, పిల్లలకు బర్త్‌డే ముద్దు'
తిరువనంతపురం : ఎస్ఎంఎస్ లు మొన్నటి మాట. ఎమెమ్మెస్లు నిన్నటి మాట. మరి నేడు...? 'కిస్ఎంఎస్'లదే హవా. ముద్దులు పంపే ఈ వినూత్న మొబైల్ అప్లికేషన్ ప్రేమికుల రోజు సందర్భంగా మార్కెట్లోకి విడుదలైంది. ప్రేమికులు ముద్దులు పంపుకోవడానికి మాత్రమే కాదు... కుటుంబమంతా సంబంధాలను బట్టి ఆయా ముద్దులను పంపుకునేందుకూ ఈ కిస్ఎంఎస్ యాప్ ఉపయోగపడుతుందట. ఉదాహరణకు...ప్రియురాలికి ప్రేమ ముద్దు, పిల్లలకు బర్త్‌డే ముద్దు, అనారోగ్యంతో ఉన్నవారికి గెట్వెల్ సూన్ ముద్దు, ఇంకా గుడ్ మార్నింగ్ ముద్దు, న్యూఇయర్ ముద్దు, మిస్‌యూ ముద్దులూ... పూలబొకేలూ దీని ద్వారా పంపొచ్చు. ఫోన్లో మనకు నచ్చినవారి ఫోటోపై ఊ... ఉంటూ ముద్దు పెడుతూ ఆ ముద్దును 10 సెకన్ల ఆడియోతో సహా వారికి సెండ్ చేయొచ్చు. వోల్మాచ్ బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీ తయారు చేసిన ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లపై పనిచేస్తుంది. పాస్ కోడ్ ప్రొటెక్షన్‌తో ఈ ముద్దులకు పూర్తి రక్షణ ఉంటుందని కంపెనీవారు చెబుతున్నారు. అన్నట్టూ... అవతలివారిపై కోపం ఉందనుకోండి... వారి ముద్దులను తిరస్కరించి, కోపం తగ్గిన తర్వాత ఆ ముద్దులను స్వీకరించేందుకు కూడా ఈ యాప్‌తో వీలవుతుందట. -
గందరగోళం మధ్య ...
ఎచ్చెర్ల, న్యూస్‌లైన్: ఇటీవల వాయిదా పడిన ఎచ్చెర్ల మండల మహిళా సమాఖ్యకు తీవ్ర గందరగోళం మధ్య పాతకార్యవర్గాన్నే మార్చి వరకు కొనసాగించాలని తీర్మానించారు. ఎంఎంఎస్ అధ్యక్షురాలిగా పైడి రాజులమ్మ ఎన్నికయ్యారు. ఎచ్చెర్ల టీటీడీసీ కేంద్రంలో గురువారం ఉదయం జరిగిన ఎన్నికకు 25 వీవోల నుంచి అధ్యక్షులు హాజరయ్యారు. ఐబీ మాస్టర్ ట్రైనర్ మరయమ్మ, జిల్లా సమాఖ్య ఐబీ కమిటీ సభ్యులు ముగ్గురితో కలిసి ఎన్నికను నిర్వహించారు. టీటీడీసీ కేంద్రానికి వచ్చిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.టీటీడీసీ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి వీవో అధ్యక్షులు మల్లగుల్లాలుపడ్డారు. రెండు వర్గాలుగా చీలిపోయారు. పాత అధ్యక్షురాలు, కుశాలపురం వీవీ అధ్యక్షులు పైడి రాజులమ్మ, టీడీపీ మద్దతుదారు ఎస్ఎంపురం వీవో అధ్యక్షురాలు ఎస్.పద్మ, కాంగ్రెస్ మద్దతుదారు, కేశవరావుపేట వీవో అధ్యక్షురాలు పైడికళావతి పోటీ చేసేందుకు తముందుకొచ్చారు. రాజులమ్మకు మద్దతుగా ఒక్కరూ ముందుకు రాలేదు. కళావతి, పద్మకు చెరో 11 మంది మద్దతు తెలిపారు. రాజులమ్మ మద్దతు తెలపడంతో ఒక వోటుతేడాతో టీడీపీ మద్దతుదారైన పద్మను అధ్యక్షురాలిగా ఎన్నిక చేశారు. పద్మకు మద్దతుగా నిలిచిన ఫరీదుపేట వీవో అధ్యక్షురాలు తాను ఎవరికీ మద్దతు తెలపలేదని, తాను పోటీ చేస్తానని చెప్పడంతో కథ మొదటికొచ్చింది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ మద్దతుదారులు సద్వినియోగం చేసుకున్నారు. పాత అధ్యక్షురాలైన రాజులమ్మకు పదవి ఇస్తామని చెప్పారు. దీంతో కాంగ్రెస్ మద్దతుదారులతో పాటు ఫరీదుపేట వీవో, పాత అధ్యక్షురాలు మొత్తం 14 మంది ఒక్కటవడంతో టీడీపీ మద్దతుదారులు కంగు తిన్నారు. మళ్లీ ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు చెప్పినా అంగీకరించకుండా టీడీపీ మద్దతుదారులు ఎన్నికను బహిష్కరించి బయటకు వచ్చేశారు. అనంతరం 14 మంది వీవో అధ్యక్షులు పాతకార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తీర్మానించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుతో అధికారులను తొత్తులుగా వాడుకుంటున్నారన్నారు. ఒక సారి ఎన్నిక జరిగిందని అధ్యక్షురాలిని అధికారులు ప్రకటించారని, కానీ తర్వాత నిబంధనలను తుంగలో తొక్కారని వారు ఆరోపించారు.