All India Whips Conference
-
ఆలిండియా విప్ల సదస్సు ప్రారంభం
విశాఖపట్టణం: అఖిల భారత విప్ల సదస్సు విశాఖపట్టణంలోని ఓ హోటల్లో ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల నుంచి విప్లు, మంత్రులు దాదాపు 105 మంది పాల్గొన్న ఈ సదస్సును కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోవాలో జరిగిన 16వ సదస్సులో చేసిన తీర్మానాల అమలును సమీక్షిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేతనాలను ఏమేరకు పెంచాలనే దానిపై చర్చిస్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలను మరింత ఫలప్రదంగా నిర్వహించటానికి తీసుకోవాల్సిన చర్యలపై అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎంపీల్యాడ్స్ను మరింత సద్వినియోగం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చిస్తారు. -
ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారు?
పనాజీ: సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్ ను ఆరునెలలుగా జైలులో ఉంచడంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నొచ్చుకున్నారు. ఇంకా ఎన్నిరోజులు ఆయనను జైలులో ఉంచుతారంటూ ప్రశ్నించారు. దక్షిణ గోవా రిసార్ట్ లో జరిగిన 16వ ఆల్ ఇండియా విప్స్ కాన్ఫెరెన్స్ లో పారికార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కోర్టు ధిక్కార నేరం కింద సుబ్రతారాయ్ ను ఇన్నిరోజులు జైలులో ఉంచడం తనను బాధించిందన్నారు. 'సుబ్రత రాయ్ ను సుప్రీంకోర్టు ఇంకా ఎన్ని రోజులు జైల్లో ఉంచుతుంది. ప్రజాస్వామ్యవాదిగా ఈ విషయంలో కలత చెందా. సరైన విధానం లేకుండా ఓ వక్తిని నిర్బంధిచకూడదు. సుబ్రతారాయ్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఎందుకు మొండిపట్టుదలతో ఉందో అర్థం కావడం లేదు' అని పారికర్ వ్యాఖ్యానించారు. సుబ్రతారాయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.