విశాఖపట్టణం: అఖిల భారత విప్‌ల సదస్సు విశాఖపట్టణంలోని ఓ హోటల్‌లో ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల నుంచి విప్‌లు, మంత్రులు దాదాపు 105 మంది పాల్గొన్న ఈ సదస్సును కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గోవాలో జరిగిన 16వ సదస్సులో చేసిన తీర్మానాల అమలును సమీక్షిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేతనాలను ఏమేరకు పెంచాలనే దానిపై చర్చిస్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలను మరింత ఫలప్రదంగా నిర్వహించటానికి తీసుకోవాల్సిన చర్యలపై అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎంపీల్యాడ్స్‌ను మరింత సద్వినియోగం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చిస్తారు.