Paragamanjari: పుప్పొడి నేత..పరాగ మంజరి
పూల అందాలను చూసి మైమరచిపోవడం మనకు తెలిసిందే! వాటిలో దాగున్న పరాగ రేణువుల అందం చూస్తే... ప్రకృతి ఒడిలో మనకు తెలియని ఇన్ని అద్భుతాలు దాగున్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే! అత్యంత సంక్లిష్టంగా ఉండే ఆ పరాగ రేణువుల నిర్మాణపు అందాన్ని చూడటమే కాదు, వాటిని టెక్స్టైల్ డిజైన్స్‌లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ ఎమ్మెస్సీ విద్యార్థిని శివాని నేత చిలుకూరి. అత్యంత సూక్ష్మంగా కనిపించే ఈ అద్భుతాలను ‘పరాగ మంజరి’గా మనకు పరిచయం చేస్తున్నది. ‘దేశానికి గుర్తింపు తెచ్చే లక్షలాది యునిక్ డిజైన్స్‌ని పరిచయం చేయబోతున్న ఆనందంలో ఉన్నాను’ అంటున్న శివాని నేత తనప్రాజెక్ట్ విశేషాలను ఇలా మన ముందుంచింది..‘‘పరాగ అంటే పుప్పొడి – మంజరి అంటే డిజైన్. సంస్కృతం నుంచి తీసుకున్న ఈ పదాలను మాప్రాజెక్ట్కు పెట్టాం. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుని, కుదరక బోటనీ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ బోటనీ చేస్తున్నాను. నాకు డ్రాయింగ్ కూడా తెలుసు అని మా బోటనీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి సర్ నాకు ఈ డిజైనింగ్ టాపిక్ ఇచ్చారు. దానిని ఇలా మీ ముందుకు తీసుకు రాగలిగాను.లక్షలాది మోడల్స్పరాగ రేణువులను రెండు విధాలుగా మైక్రోస్కోప్ చేశాను. లైట్ మైక్రోస్కోపీలో ఫ్లవర్ స్ట్రక్చర్, సెమ్(స్కానింగ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్)లో పుప్పొడి రేణువులను స్కాన్ చేశాను. భూమిపైన లక్షలాది మొక్కలు, వాటి పువ్వులు వేటికవి భిన్నంగా ఉంటాయి. ఇక వాటిలోని పరాగ రేణువులు మరింత భిన్నంగా ఉంటాయి. మందార, వేప, తులసి, తిప్పతీగ, తుమ్మ, అర్జున, ఉల్లిపాయ, కాకర, ఆరెంజ్, జొన్న, మొక్కజొన్న, ఖర్జూరం, దోస పువ్వు... ఇలా దాదాపు 70 రకాల పుప్పొడి రేణువులను స్కాన్ చేసి, ఆ స్కెలిటిన్ నుంచి మోటిఫ్స్‌ను వెలుగులోకి తీసుకువచ్చాను. ఈ అందమైన పరాగ రేణువుల నుంచి మోటిఫ్స్ డిజైన్స్‌గా తీసుకు రావడానికి నాలుగు నెలల సమయం పట్టింది.పేటెంట్ హక్కుఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్‌లోనే టెక్స్టైల్ ΄్యాటర్న్ని తీసుకున్నాను. క్లాత్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మాది నేత కుటుంబమే. నేను చేసిన ఈ ప్రింట్స్ క్లాత్స్ మీదకు తీసుకురావచ్చని నిర్ధారణ చేసుకున్నాం. కాటన్, పట్టు, సీకో మెటీరియల్ మీదకు మోటిఫ్స్ ప్రింట్స్ చేయచ్చు. నేతలోనూ డిజైన్స్ తీసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ కూడా చేయచ్చు. మేం ముందు టీ షర్ట్ పైన ప్రింటింగ్ ప్రయత్నం చేశాం. ఇంకా మిగతా వాటి మీదకు ప్రింట్స్ చేయాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మద్దతు అవసరం అవుతుంది. బ్లాక్ ప్రింట్ చేయాలన్నా .. అందుకు తగిన వనరులన్నీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా పేటెంట్ హక్కు ΄÷ందేవరకు వెళ్లింది. దీనిని ఒక స్టార్టప్‌గా త్వరలోప్రారంభించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.టెక్స్టైల్ రంగం మద్దతుతో...ప్రకృతిలో కళ్లకు కనిపించేవి లైట్ మైక్రోస్కోపిక్ ద్వారా నలభై వరకు పిక్చర్స్ తీసుకుంటే, స్టెమ్ ద్వారా మరికొన్ని సాధించాం. కంప్యూటర్లో వియానా దేశం నుంచి పోలెన్ గ్రెయిన్స్ స్కెలిటన్ స్ట్రక్చర్ నుంచి కొన్ని తీసుకున్నాం. మన దేశానికి వేల సంవత్సరాల నుంచి అద్భుతమైన టెక్స్టైల్ డిజైనింగ్ కల్చర్ ఉంది. కలంకారీ, ఇకత్ పోచం పల్లి, గొల్లభామ, రాజస్థాన్‌లో బాందినీ, గుజరాతీలో లెహెరియా, కాశ్మీర్ ఎంబ్రాయిడరీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ‘పరాగ మంజరి’ మన దేశానికే వన్నె తెచ్చేలా తీసుకురావాలన్నది నా ప్రయత్నం. దీనిని తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ శాఖకు అందించి, వారి సపోర్ట్ తీసుకొని, ఈ వర్క్‌ను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని శివాని నేత చిలుకూరి తెలియజేశారు. లక్ష ΄్యాటర్న్స్ఒక్కో చెట్టు పువ్వుకు ఒక్కో ప్రత్యేకమైన పరాగ రేణువులు ఉంటాయి. ఈ పరాగ రేణువుల మోడల్స్ నుంచి కొన్ని లక్షల ΄్యాటర్న్స్ టెక్స్టైల్ రంగంలోకి తీసుకురావచ్చు. వీటిని పట్టు, కాటన్, సిల్క్, బెడ్ షీట్స్.. ఇలా ప్రతి క్లాత్ మీదకు తీసుకురావచ్చు. ఈప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఇలా చేశారా.. అని శోధించాను. కానీ, ఎక్కడా మాకు ఆ సమాచారం లభించలేదు. అందుకే, పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశాం. ఈ ΄్యాటర్న్స్ వస్త్ర డిజై¯Œ పరిశ్రమల్లో గణనీయమైన ప్రభావం చూపుతాయి. – డాక్టర్ అల్లం విజయ భాస్కర్‌రెడ్డి, అసోసియేట్ప్రొఫెసర్, బోటనీ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్శిటీ – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి