allergy treatment
-
ఇది ఆడవాళ్లకు మాత్రమే.. బొట్టు తీయకుండా నిద్రపోతున్నారా?
బొట్టుబిళ్ల పెట్టుకునే ప్రదేశంలో కొన్నిసార్లు దురద, దద్దుర్లు, వాపు, మచ్చలు ఏర్పడుతుంటాయి. బొట్టుపెట్టుకునే ప్రదేశంలో చర్మం పొడిబారడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధిగమించేందుకు ఇలా చేయండి చాలు... మాయిశ్చరైజర్ : బొట్టుబిళ్ల తీయకుండా అదేపనిగా ఉంచడం వల్ల చర్మం పొడిబారి దురద వస్తుంటుంది. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసి మాయిశ్చరైజర్ రాసి మర్దన చేయాలి. ఇది పొడిబారిన చర్మానికి తేమనందించి దురదను తగ్గిస్తుంది. నూనె: రోజూ రెండు నిమిషాల పాటు కొబ్బరి లేదా నువ్వుల నూనె రాసి మర్దన చేయాలి. దీనివల్ల చర్మానికి తేమ అంది మచ్చపడకుండా ఉంటుంది. జెల్ : అలోవెరా జెల్‌ను రాసి మర్ధన చేయడం వల్ల అక్కడ ఏర్పడే దద్దుర్లు, మొటిమలు పోతాయి. అలోవెరా జెల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మాన్ని దురద, దద్దుర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. గ్లూ తక్కువగా : బొట్టు బిళ్లలను ఎంపిక చేసేటప్పుడు గ్లూ, గమ్ తక్కువగా ఉండే వాటినే ఎంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసేసి మాయిశ్చర్ రాసుకుని పడుకోవాలి. ఉదయం బొట్టు బిళ్ల పెట్టుకుంటే ఏ సమస్యా ఉండదు. -
ఇది మెడలో వేసుకుంటే అలెర్జీలకు చెక్!..ధర ఎంతంటే..
వాతావరణం మారినప్పుడు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అలర్జీ బాధలు తప్పవు. అలర్జీలు తీవ్రమైతే కొందరికి ఉబ్బసం కూడా మొదలవుతుంది. అలెర్జీలకు, ఉబ్బసానికి ఇప్పటి వరకు మందులు, ఇన్హేలర్లే గతి. అలెర్జీలకు పరిష్కారంగా ఎస్టోనియాకు చెందిన ‘రెస్పిరే’ కంపెనీ ఇటీవల మెడలో తొడుక్కునేందుకు వీలైన ‘ఏ ప్లస్ వేర్’ పేరుతో అలెర్జీ ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మెడలో తొడుక్కున్నట్లయితే, గాలిలోని అలెర్జీకి కారణమయ్యే కణాలేవీ దీనిని దాటి ముక్కులోకి చొరబడలేవు. ఇందులోని హెపా ఫిల్టర్లు అలెర్జీలకు దారితీసే సూక్షా్మతి సూక్ష్మకణాలను సైతం ఇట్టే లోపలకు పీల్చేసుకుని, గాలిని శుభ్రం చేస్తాయి. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది చార్జ్ కావడానికి గంటన్నర సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఎనిమిది గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలు (రూ.10,795). దీనిని వాడటం మొదలుపెడితే అలెర్జీల కోసం మందులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. -
Health: అలర్జీలు.. అలసత్వం వహిస్తే ప్రాణాంతకం కూడా! ఆహారంలో పీతలు, సోయా.. ఇంకా
Winter Care- Health Tips: మడిసన్నాక కాసింత కళాపోషణుండాల అనే సినిమా డైలాగ్‌లా మనిషన్నాక జీవితంలో ఏదో ఒక దశలో అలర్జీ కలగక మానదు. బాధించకుండానూ ఉండదు. ఇందుకు మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం, ప్రేమతో పెంచుకునే జంతువులు, వాడే సుగంధ ద్రవ్యాలు లేదా తీసుకునే మందులు కూడా కారణం కావచ్చు. అలర్జీ అంత ప్రమాదకరం కాకపోయినా, అలసత్వం వహిస్తే ప్రాణాంతకం కూడా కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలర్జీల విజృంభణకు శీతాకాలం అనువైన సమయం. అందువల్ల మనం సాధారణంగా ఎదుర్కొనే కొన్ని రకాల అలర్జీలు, కారణాలు, నివారణలపై అవగాహన కోసం.. అలర్జీ అంటే ఏదో పెద్ద వ్యాధి అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ, అది కరెక్ట్ ఆలోచన కాదు. అలర్జీ అంటే శరీరం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అన్నమాట. అంటే, మనం తీసుకునే ఆహారం లేదా గాలి శరీరంలోకి వెళ్లినప్పుడు, మన శరీరం స్పందించాల్సిన దానికంటే ఎక్కువగా స్పందిస్తుంది. ఈ విధంగా మోతాదు కంటే ఎక్కువగా స్పందిస్తే దాన్ని అలర్జీ లేదా హైపర్ సెన్సిటివిటీ అంటారు. దీనిమూలంగా రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఆహారపరమైన అలర్జీ మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు ఆహార సంబంధమైన అలర్జీలకు దారితీస్తాయి. సాధారణంగా ఫుడ్ అలర్జీలు గుడ్లు, పాలు, వేరుశెనగ, చేపలు, రొయ్యలు, పీతలు, సోయా, కొన్ని రకాల నట్స్ (ఆక్రోట్స్, బాదం, బ్రెజిల్ నట్స్), గోధుమ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వస్తాయి. శరీరానికి ఈ పదార్థాలు సరిపడకపోతే దురద, చర్మంపై దద్దుర్లు, వాంతులు లేదా కడుపులో అసౌకర్యం, శ్వాస సరిగా అందకపోవటం, గురక, దగ్గు, గొంతునొప్పి, పల్స్ పడిపోవడం, చర్మం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫుడ్ అలర్జీల నిర్ధారణకు చర్మ పరీక్షతోపాటు రక్త పరీక్షలు(ఐజీఈ యాంటీబాడీస్) కూడా చేయాల్సి ఉంటుంది. దుమ్మెత్తే అలర్జీ దుమ్ము, ధూళి వల్ల, వాటిలోని సూక్ష్మజీవుల వల్ల వచ్చే అలర్జీని డస్ట్ అలర్జీ అంటారు. వైద్య పరిభాషలో వీటిని డస్ట్ మైట్స్ అంటారు. శ్వాస తీసుకునే క్రమంలో ఈ డస్ట్ మైట్స్ శరీరంలోకి ప్రవేశించి శ్వాసనాళాల వ్యాకోచం లేదా వాపునకు కారణమవుతాయి. దీనివల్ల తుమ్ములు, ముక్కు కారడం, కంటిలో దురద, కళ్ళలో నుంచి జిగట నీరు, ఒళ్లంతా దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే తేమ, దుమ్ము, మురికి ఈ డస్ట్ మైట్స్‌కు ఆవాసాలు. కాబట్టి దుప్పట్లు, దిండు గలీబులు, టవల్స్, కార్పెట్లు, ఇతర సామగ్రిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. డస్ట్ అలర్జీ కారకాలను గుర్తించడానికి కొన్ని రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఫలితాలను బట్టి ఏయే పదార్థాలు మనకు సరిపడటం లేదో, ఆయా పదార్థాలకు దూరంగా ఉండమని లేదా వాటికి తగిన మందులను సూచిస్తారు వైద్యులు. డస్ట్ అలర్జీతో బాధపడేవారు 80 శాతం మంది ఆస్తమా రోగులుగా మారుతున్నారు. కంటి అలర్జీ సాధారణంగా కంటి అలర్జీలు పుప్పొడి, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల చర్మ కణాలు వంటి వాటి వల్ల సంభవిస్తాయి. వీటివల్ల కళ్లలో దురద, వాపు, మంట, జిగట నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి అంటువ్యాధులు కావు. కంటి అలర్జీలకు ప్రత్యేకమైన నిర్ధారణ పరీక్షలు ఏవీ ఉండవు. కంటి అలర్జీకి కారకాలేమిటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటమే నివారణ. అలర్జీ వస్తే ఏం చేయాలంటే..? శరీరంలో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. డాక్టర్ తో మీ ఫ్యామిలీ హిస్టరీ, జీవనశైలి, ఇతర జబ్బులకు వాడుతున్న మందులు తదితర వివరాలను తెలియజేస్తే, దానికి తగిన నిర్ధారణ పరీక్షలను సూచిస్తారు. ముందుగా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, ఎక్స్‌రే వంటి పరీక్షలు నిర్వహించి ఆ తరువాత మీ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ పరీక్షలు, ప్యాచ్ లేదా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల నివేదికల ఆధారంగా మీరు ఏరకమైన అలర్జీ లతో బాధపడుతున్నారో నిర్ధారించుకొని తగిన చికిత్సను సిఫార్సు చేస్తారు. చికిత్స ఏమిటి? అలర్జీలకు సరైన చికిత్సను నిర్ధారణ పరీక్షల ఆధారంగానే కాకుండా బాధితుడి మెడికల్ హిస్టరీ, లక్షణాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఇవ్వవలసి ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. దీన్ని ఏదో ఒక చికిత్సా విధానం ద్వారా అదుపులో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే! చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. -
నేడు, రేపు ‘జీరత్ పాత్‌ల్యాబ్స్’ అలర్జీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జీరత్ పాత్ ల్యాబ్స్ అండ్ అలర్జీ టెస్టింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 50 శాతం రాయితీతో అలర్జీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ ప్రశాంత్ జీరత్, డాక్టర్ వీపీ జీరత్, డాక్టర్ రీతా జీరత్ శుక్రవారం తెలిపారు. అంజన్ పాత్ ల్యాబ్స్ అండ్ అలర్జీ సెంటర్లున్న గుంటూరు, తెనాలి, నర్సారావుపేట, ఒంగోలు, మార్కాపూర్, చీరాల, చిలకలూరిపేట, బేగం బజారు, సికింద్రాబాద్, వనస్థలిపురం, కూకట్పల్లి, మలక్‌పేట, టోలిచౌకి, విజయనగర్ కాలనీ, శేరిలింగపల్లి, ఉప్పల్, పంజగుట్ట, సిద్దిపేట, దిల్‌సుక్‌నగర్, శంషాబాద్, చార్మినార్, జహీరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఆర్మూరు, జగిత్యాల, కోరుట్ల, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, కామారెడ్డి, హన్మ కొండ, జనగామ, జహీరాబాద్, ఏలూరు, శ్రీకాకుళం, విజ యనగరం, కోదాడ, భువనగిరి, సూర్యాపేట, భద్రాచలం, ఖమ్మం, మిర్యాలగూడ, బోధన్, మెట్పల్లి, కర్నూలు, ఆదోని, జడ్చర్ల, నాగర్‌కర్నూలు, కావలి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కొత్తగూడెం, తణుకు, పాలకొల్లు, ప్రొద్దుటూరు, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, విసన్నపేట, తిరువూరు, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, మైలారం, విశాఖపట్నం, అనంతపురం, గుంతకల్, తాడి పర్తి, గూటిలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 70–80 రకాల అలర్జీలకు పరీక్షలుంటాయని, వివరాలకు 6383873278, 6383848063ను సంప్రదించాలన్నారు. -
సమంతకు లండన్‌లో చికిత్స
కథానాయికలకు అందం అభినయం ముఖ్యం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీటిని మరింత అందంగా తెరపై ప్రదర్శించాలంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. పైన చెప్పిన వాటితో పాటు అదృష్టం వదలకుండా వెంటాడుతున్న నటి సమంత. అదనంగా ఈమెను స్కిన్ ఎలర్జీ కూడా పట్టి పీడిస్తోంది. పలు మార్లు ఈ డిసీజ్ బారిన పడి చికిత్స పొందినా వదలబొమ్మాళి వదలా అన్న చందాన స్కిన్ ఎలర్జీ సమంతను ఇబ్బంది పెడుతూనే ఉంది. దీని కారణంగా ఈ ముద్దు గుమ్మ ఇంతకు ముందు శంకర్, మణిరత్నం వంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో నటించే గోల్డెన్ చాన్స్‌లు వదులుకోవాల్సి వచ్చింది. ఆ మధ్య సూర్య సరసన అంజాన్ చిత్రంలో నటిస్తుండగా స్కిన్ ఎలర్జీ సమస్య మరో సారి పొడ చూపి ఇబ్బంది పెట్టింది. దీంతో కొన్ని రోజుల షూటింగ్ విశ్రాంతి నిచ్చి చికిత్స పొందారు. ప్రస్తుతం ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్‌తో రొమాన్స్ చేస్తున్న సమంత తెలుగులో బిజీ హీరోయిన్. దీంతో తనను వదలనంటున్న స్కిన్ ఎలర్జీ సమస్యను శాశ్వతంగా తొలగించుకోవడానికి ఈ బ్యూటీ లండన్‌లో చికిత్స పూర్తి చేసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చినట్లు సమాచారం. ఇప్పుడీ బ్యూటీ సూర్య సరసన నటిస్తున్న అంజాన్ చిత్రం తదుపరి షెడ్యూల్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు.