సమంతకు లండన్‌లో చికిత్స
కథానాయికలకు అందం అభినయం ముఖ్యం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీటిని మరింత అందంగా తెరపై ప్రదర్శించాలంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. పైన చెప్పిన వాటితో పాటు అదృష్టం వదలకుండా వెంటాడుతున్న నటి సమంత. అదనంగా ఈమెను స్కిన్ ఎలర్జీ కూడా పట్టి పీడిస్తోంది. పలు మార్లు ఈ డిసీజ్ బారిన పడి చికిత్స పొందినా వదలబొమ్మాళి వదలా అన్న చందాన స్కిన్ ఎలర్జీ సమంతను ఇబ్బంది పెడుతూనే ఉంది. దీని కారణంగా ఈ ముద్దు గుమ్మ ఇంతకు ముందు శంకర్, మణిరత్నం వంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో నటించే గోల్డెన్ చాన్స్‌లు వదులుకోవాల్సి వచ్చింది.
ఆ మధ్య సూర్య సరసన అంజాన్ చిత్రంలో నటిస్తుండగా స్కిన్ ఎలర్జీ సమస్య మరో సారి పొడ చూపి ఇబ్బంది పెట్టింది. దీంతో కొన్ని రోజుల షూటింగ్ విశ్రాంతి నిచ్చి చికిత్స పొందారు. ప్రస్తుతం ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్‌తో రొమాన్స్ చేస్తున్న సమంత తెలుగులో బిజీ హీరోయిన్. దీంతో తనను వదలనంటున్న స్కిన్ ఎలర్జీ సమస్యను శాశ్వతంగా తొలగించుకోవడానికి ఈ బ్యూటీ లండన్‌లో చికిత్స పూర్తి చేసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చినట్లు సమాచారం. ఇప్పుడీ బ్యూటీ సూర్య సరసన నటిస్తున్న అంజాన్ చిత్రం తదుపరి షెడ్యూల్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు.