Allyans
-
భారత్ అగ్రరాజ్యానికి మిత్ర పక్షం కాదు..వైట్‌హౌస్ అధికారి షాకింగ్ వ్యాఖ్యలు
భారత్ అగ్రరాజ్యానికి మిత్రపక్షంగా ఉండబోదంటూ వైట్‌హౌస్ ఉన్నతాధికారి కర్ట్ క్యాంప్‌బెల్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా..భారత్ గురించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు విశిష్ట వ్యూహాత్మక స్వభావాన్ని కలిగి ఉన్న భారత్, అమెరికాకు మిత్రపక్షంగా ఉండదని, ఒక గొప్ప శక్తిగా ఉంటుందని అన్నారు. గత 20 ఏళ్లో భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలోపేతంగా వేగంగా ఏర్పడ్డాయని అన్నారు. అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధం అని కూడా చెప్పారు. అలాగే అమెరికా తన సామర్ధ్యానికి అనుగుణంగా ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, సాంకేతికంగా ఇతర సమస్యలపై కలిసి పనిచేయడం ద్వారా ప్రజలతో సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అదీగాక ఇరు దేశాల్లోని కేంద్రీకృత ప్రభుత్వ విధానాల్లో పలు సవాళ్లు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఇరు దేశాలు కలిసి పనిచేసే అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా అంతరిక్షం, విద్య, వాతావరణం, సాంకేతికత తదితర వాటిల్లో ఇరు దేశాలు సమన్వయంగా ముందుకు సాగాలని చెప్పారు. అలాగే భారత్ అమెరికా సంబంధాలు కేవలం చైనా చుట్టూ ఉన్న ఆందోళనలతో ఏర్పడలేదని నొక్కి చెప్పారు. వనరులు అధికంగా ఉన్న బీజింగ్ దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు ఏర్పరచి సైనిక స్థావరాలను నిర్మించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా క్యాంప్‌బెల్ ప్రస్తావించారు. ఈ విషయంలో తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాం తదితర దేశాలు చైనాను తప్పుపట్టాయన్నారు. చైనాకు జపాన్‌తో కూడా ప్రాదేశిక వివాదాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయం గురించి మోదీతో చర్చించినప్పుడూ చైనా తన ప్రయోజనాల కోసం నిర్మించుకున్నారంటూ... కొట్టిపారేశారని చెప్పారు. కాగా, బైడెన్ తన పరిపాలను క్వాడ్ లీడర్ స్థాయికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నట్లు కూడా తెలిపారు. ఈ మేరకు ఆయన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి (ఆంథోనీ) అల్బనీస్ 2023లో ఒక ప్రధాన క్వాడ్ సమావేశానికి అమెరికాను ఆహ్వానించిన సంగతిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ క్వాడ్ సమావేశం నాలుగు కీలక దేశాల మధ్య సమన్వయ సహకారాన్ని చాలా స్ట్రాంగ్‌గా బలోపేతం చేస్తోందని క్యాంప్‌బెల్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన జీన్ పియర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...భారత్, యునైటెడ్ స్టేల్స్‌ల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. జీ20లో భారత్ నాయకత్వం వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడమే గాక భారత్‌తో మరింత సన్నిహితంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా, లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని భారతదేశంలోని యుఎస్ రాయబారిగా నియమించాలని బైడెన్ పరిపాలన చూస్తున్నట్లు కూడా జీన్ పియర్ తెలిపారు. (చదవండి: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు గుడ్‌న్యూస్) -
పుతిన్ మిత్రుడు గుండెపోటుతో ఆకస్మిక మృతి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత సన్నిహిత మిత్రుడు వ్లాదిమిర్ సుంగోర్కిన్ నికోలెవిచ్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన ఖబరోవ్స్క్ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతను మృతి చెందే సమయంలో తన సహచరుడు లియోనిడ్ జఖారోవ్తో కలిసి ఉన్నట్లు సమాచారం. రష్యన్ అన్వేషకుడు, ఫార్ ఈస్ట్ పుస్తక రచయిత అయిన వ్లాదిమిర్ అర్సెనీవ్కి సంబంధించిన ఒక పుస్తకాన్ని సేకరించడం కోసం ఖబరోవ్స్క్ పర్యటిస్తున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసకుంది. సుంగోర్కిన్ రష్యన్ ప్రభుత్వ పత్రిక ప్రావ్దా ఎడిటర్ ఇన్ చీఫ్. ఈ మేరకు సుంగోర్కిన్ మిత్రుడు జఖారోవ్ మాట్లాడుతూ...ఆ రోజు భోజనం చేద్దాం అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా సుంగోర్కిన్ అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడుతుంటే...గాలిలోకి తీసువెళ్లాం. కానీ కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తాము హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. ఐతే డాక్టర్లు సుంగోర్కిన్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఆయన మరణం రష్యన్ జర్నలిజానికి తీరని లోటు అని అన్నారు. సంగోర్కిన్ తన వృత్తిపరమైన నీతికి, విధేయతకు కట్టుబడి ఉన్న గొప్ప వ్యక్తి అని కన్నీటి పర్యంతమయ్యారు. సుంగోర్కిన్1997 నుంచి ఎడిటర్ ఇన్ చీఫ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఇటీవలే రష్యన్ వ్యాపరవేత్త, ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ ఇవాన్ పెచోరిన్ అనుమానస్పద స్థితిలో మరణించిన కొద్దిరోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పుతిన్ పై హత్య ప్రయోగం జరిగిందంటూ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇలా ప్రముఖులు వరుసగా హఠాత్తుగా మృతి చెందడం బాధాకరం. -
కూటమి నుంచి బయటకి పోము: శివసేన
ముంబై: బీజేపీతో కయ్యాల కాపురం చేస్తున్న శివసేన ఎన్ డీఏ కూటమి నుంచి విడిపోయే ఆలోచనలేదని స్పష్టం చేసింది. తమపై పుకార్లను, అబద్ధాలను ప్రచారం చేస్తూ ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వరకు తమ గొంతునొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని సామ్నాలో ఆరోపించింది. సామ్నా ప్రతులను బీజేపీ కార్యకర్తలు కాల్చడంపై ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను, నరేంద్ర మోదీ ఆదర్శాలను బూడిద చేశారని విమర్శించింది. రాజకీయాలు చీకటి మయంగా మారాయని, ప్రతీ ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని, నిజం మాట్లాడినందుకే తమపై దాడి చేస్తున్నారని ఘాటుగా విమర్శించింది. తమపై ఇలానే ఆరోపణలు కొనసాగితే మోదీ చెబుతున్న స్మాట్ సిటీ ప్రాజెక్టులో ఒక్కొక్క నగరంలో ఐదు నుంచి పది పిచ్చాసుపత్రులు నిర్మించాల్సిన అవసరం ఉందని సామ్నాలో పేర్కొంది. గత కొంత కాలంగా కూటమి నుంచి సేన బయటకు వెళ్లాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.