కూటమి నుంచి బయటకి పోము: శివసేన | Shiv Sena Hits Out At Ally BJP, Says It Is Spreading Falsehood And Rumours | Sakshi
Sakshi News home page

కూటమి నుంచి బయటకి పోము: శివసేన

Published Mon, Jun 27 2016 6:18 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

Shiv Sena Hits Out At Ally BJP, Says It Is Spreading Falsehood And Rumours

ముంబై: బీజేపీతో కయ్యాల కాపురం చేస్తున్న శివసేన  ఎన్ డీఏ కూటమి నుంచి విడిపోయే ఆలోచనలేదని స్పష్టం చేసింది. తమపై పుకార్లను, అబద్ధాలను ప్రచారం చేస్తూ ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వరకు తమ గొంతునొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని సామ్నాలో ఆరోపించింది. సామ్నా ప్రతులను బీజేపీ కార్యకర్తలు కాల్చడంపై ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను, నరేంద్ర మోదీ ఆదర్శాలను బూడిద చేశారని విమర్శించింది.

రాజకీయాలు చీకటి మయంగా మారాయని, ప్రతీ ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని, నిజం మాట్లాడినందుకే తమపై దాడి చేస్తున్నారని ఘాటుగా  విమర్శించింది.  తమపై ఇలానే ఆరోపణలు కొనసాగితే మోదీ చెబుతున్న స్మాట్ సిటీ ప్రాజెక్టులో ఒక్కొక్క నగరంలో ఐదు నుంచి పది పిచ్చాసుపత్రులు నిర్మించాల్సిన అవసరం ఉందని సామ్నాలో పేర్కొంది. గత కొంత కాలంగా కూటమి నుంచి సేన బయటకు వెళ్లాలని బీజేపీ నేతలు  డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement