ముంబై : బీజేపీపై శివసేన మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. జమ్మూకశ్మీర్‌లో అరాచకత్వాన్ని, హింసను వ్యాప్తి చేసి అధికారం నుంచి తప్పుకుందని విమర్శించింది. కశ్మీర్‌లో శాంతిని నెలక్పొడంలో బీజేపీ విఫలమైందని దుయ్యబట్టింది. తమ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో బీజేపీని బ్రిటీష్ పరిపాలకులతో పోల్చింది.
బ్రిటీష్ ప్రభుత్వం ఇండియా నుంచి తరలిపోయినట్లుగానే బీజేపీ కశ్మీర్‌లో హింసను పెంచి అధికారం నుంచి తప్పుకుందని ఆరోపించింది. దేశాన్ని పాలించడం అంటే చిన్న పిల్లల ఆట కాదని ఎద్దేవా చేసింది. దురాశ కలిగిన బీజేపీని చరిత్ర మరిచిపోయిందని ధ్వజమెత్తింది.
కశ్మీర్‌లో ఎన్నడూలేని విధంగా వేల మంది జవాన్లు, సామాన్యులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కశ్మీర్‌లో రక్తపుటేరులు పారుతున్నాయని, దీనికి కారణం బీజేపీయే అని ఆరోపించింది. కానీ అందంతా మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తిపై వేసి ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment