హారికకు ఐదో స్థానం
ఖాంటీ మాన్సిస్క్: భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక సీజన్లో చివరి ‘ఫిడే’ మహిళల గ్రాండ్ ప్రి టోర్నమెంట్‌ను ఐదో స్థానంతో ముగించింది. గురువారం జరిగిన ఆఖరి, 11వ రౌండ్ మ్యాచ్‌లో హారిక... ఫ్రాన్సకు చెందిన స్క్రిప్చెంకో అల్మిరాపై విజయం సాధించింది.
12 మంది అగ్రశ్రేణి గ్రాండ్ మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో చివరి రౌండ్ విజయంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. ఈ టోర్నీలో హారిక 2 విజయాలు, 1 పరాజయంతో పాటు 8 గేమ్‌లు డ్రా చేసుకుంది. గ్రాండ్ ప్రిలో తన ప్రదర్శన పట్ల హారిక సంతృప్తి వ్యక్తం చేసింది.