Amrita Prakash
-
మే 12న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అమృతా ప్రకాశ్ (బాలీవుడ్ నటి), స్మృతి మెహ్రా (గోల్ఫ్ క్రీడాకారిణి) ఈ రోజున పుట్టినవారు ఈ సంవత్సరమంతా తమ మాటకు తిరుగులేదన్నట్లుగా చలామణి అవుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహ యోగం. సంగీతం, జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునేవారి కల నెరవేరుతుంది. పిత్రార్జితమైన ఆస్తి లభిస్తుంది. ఇప్పటికే వారసత్వంగా లభించినవారు దానిని బాగా అభివృద్ధి చేస్తారు. విద్యార్థులకు ముఖ్యంగా వైద్యవిద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పాత స్నేహితులు తిరిగి కలుస్తారు.కొత్త స్నేహాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. ధనలాభం కలుగుతుంది. లక్కీ నంబర్స్: 1,3,7,9, లక్కీ డేస్: సోమ, బుధ, గురు వారాలు లక్కీ కలర్స్: ఎల్లో, క్రీమ్, గ్రే, సిల్వర్. గురువులను గౌరవించడం, సన్మానించడం, పేద విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వడం, కేతుజపం, దక్షిణామూర్తి ఆరాధన కలిసి వస్తాయి. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నాణ్యత పెరిగింది
టీవీ షోలలో నాణ్యత పెరిగిందని బాలీవుడ్ నటి అమృత ప్రకాశ్ చెప్పింది. బుల్లితెరలో నటించడం కూడా తనకు ఇష్టమేనని ‘వివాహ్’ సినిమాలో అమృతారావుకు సోదరిగా నటించిన అమృత తన మనసులో మాట బయటపెట్టింది. బుల్లి తెర కథలు ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంటాయంది. ‘1990 నాటి మాదిరిగానే బుల్లితెర ప్రయోగాల దశలో నడుస్తోంది. అప్పట్లో ‘రిస్తే’, స్టార్ బెస్ట్ సెల్లర్స్’ వంటి లఘుచిత్రాలు కూడా వచ్చాయి. గంటలోనే సిరీస్ మొత్తం పూర్తయ్యేది’ అని తెలిపింది. కాగా ‘స్మృతి’, ‘సాత్ ఫేరే’, ‘యే మేరే లైఫ్ హై’ సాత్ ఫేరే’ వంటి హిట్ ధారావాహికల్లో అమృత నటించింది. ప్రస్తుతం ‘సావధాన్ ఇండియా, ‘ఏ హై ఆషిఖి’, ‘గుమ్రాహ్’ తదితర ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమాల్లో నటిస్తోంది. ‘ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమాలు బాగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. వీటికి డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. లఘుచిత్రాలు కూడా టీవీల్లో ప్రవాహం మాదిరిగా వస్తున్నాయి. వీటి స్క్రిప్టులు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. కథలు గొప్పగా ఉంటున్నాయి’ అని అంది. కాగా 27 ఏళ్ల ఈ సుందరి సినిమాల్లోకి బాలనటిగా అడుగిడింది. ‘తుమ్ బిన్’, కోయీ మేరా దిల్ మే హై’ వివాహ్ వంటి హిట్ సినిమాల్లో నటించింది. 2010లో ‘వుయ్ ఆర్ ఫ్యామిలీ’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది. అందులో అతిథి పాత్ర పోషించింది. మరి సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారంటూ మీడియా ప్రశ్నించగా ఒకే రకమైన పాత్రలున్న సినిమాల్లో నటించానంది. ఇదే పరంపర కొనసాగుతుందేమోననే భయంతో ఆ తర్వాత అనేక అవకాశాలొచ్చినా తిరస్కరించానని తెలిపింది. అయితే అది సరైన నిర్ణయమా? కాదా ?అనే విషయం తనకు తెలియదంది.