
మే 12న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
అమృతా ప్రకాశ్ (బాలీవుడ్ నటి), స్మృతి మెహ్రా (గోల్ఫ్ క్రీడాకారిణి)
ఈ రోజున పుట్టినవారు ఈ సంవత్సరమంతా తమ మాటకు తిరుగులేదన్నట్లుగా చలామణి అవుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహ యోగం. సంగీతం, జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునేవారి కల నెరవేరుతుంది. పిత్రార్జితమైన ఆస్తి లభిస్తుంది. ఇప్పటికే వారసత్వంగా లభించినవారు దానిని బాగా అభివృద్ధి చేస్తారు. విద్యార్థులకు ముఖ్యంగా వైద్యవిద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పాత స్నేహితులు తిరిగి కలుస్తారు.కొత్త స్నేహాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. ధనలాభం కలుగుతుంది.
లక్కీ నంబర్స్: 1,3,7,9, లక్కీ డేస్: సోమ, బుధ, గురు వారాలు లక్కీ కలర్స్: ఎల్లో, క్రీమ్, గ్రే, సిల్వర్. గురువులను గౌరవించడం, సన్మానించడం, పేద విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వడం, కేతుజపం, దక్షిణామూర్తి ఆరాధన కలిసి వస్తాయి.
- రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్