Amrita Vishwa Vidyapeetham
-
ఆ విద్యార్థులకు టీసీఎస్ ప్రైజ్ మనీ, జాబ్ ఆఫర్
ముంబై : ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ నిర్వహించిన ప్రీమియర్ ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఛాలెంజ్, ఇంజనీరింగ్ ఫర్ ది నెక్ట్స్ జనరేషన్ ఆరో ఎడిషన్‌లో అమ్రిత విశ్వ విద్యాపీఠం విద్యార్థులు విజయ కెరటం ఎగరవేశారు. ముంబైలోని థానే ఒలంపిక్ సెంటర్లో జరిగిన గ్రాండ్ ఫినాలెలో కోయంబత్తూర్‌కు చెందిన అమ్రిత విశ్వ విద్యాపీఠం విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. దీని కింద విన్నర్లకు రూ.5 లక్షల ప్రైజ్ మనీ అందించింది టీసీఎస్. తొలి రన్నరప్‌గా నిలిచిన కోయంబత్తూర్ పీసీజీ ఐటీఈసీహెచ్ విద్యార్థులకు రూ.2.5 లక్షలను, రెండో రన్నరప్‌లైన నేతాజీ సుభాస్ ఇంజనీరింగ్ కాలేజీ, కోల్కత్తా విద్యార్థులకు లక్ష రూపాయలను ప్రదానం చేసింది. ఈ విద్యార్థులంతా తమ తమ ఇంజనీరింగ్ డిగ్రీలు అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా టీసీఎస్‌లో చేరేలా ప్రొవిజనల్ ఆఫర్లను కూడా అందజేసింది. ఈ ఏడాది ‘డిజిటల్ ట్విన్’ అనే అంశంపై ఈ పోటీలు నిర్వహించారు. టీసీఎస్ ఇంజనీరింగ్ ఫర్ ది నెక్ట్స్ జనరేషన్ ప్రతి ఎడిషన్‌లోనూ కొత్త కొత్త టెక్నాలజీలను వెలికితీస్తామని, ఈ సారి డిజిటల్ ట్విన్ అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినట్టు టీసీఎస్ ఐఓటీ, ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ రేఘు అయ్యస్వామి తెలిపారు. ఈ ఏడాది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 1600 ఇన్స్టిట్యూట్ల నుంచి 75వేల మంది విద్యార్థులు ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్వాలిఫైయింగ్ రౌండ్లో మొత్తం 8500 టీమ్‌లు పాల్గొన్నాయి. ఎంపికైన టీమ్‌లు స్మార్ట్ మానుఫ్రాక్ట్ర్చరింగ్, స్మార్ట్ ఎకో సిస్టమ్స్, స్మార్ట్ మొబిలిటీ, స్మార్ట్ మిషన్స్, స్మార్ట్ హెల్త్ వంటి ఏరియాల్లో డిజిటల్ ట్విన్ ఉపయోగాన్ని ప్రతిపాదించాల్సి ఉంది. ఈ కంటెస్ట్ ఎమర్జింగ్ ఏరియాల్లో విద్యార్థుల పోటీతత్వాన్ని, ప్రతిభను నిరూపించుకునేందుకు సహకరిస్తుందని రేఘు చెప్పారు. -
చీరలు ఇస్తామని కార్యక్రమానికి తీసుకొచ్చి..
-
అమృత యూనివర్సిటీకి శంకుస్థాపన
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కూరగల్లులో అమృత విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం భూమిపూజ చేశారు. 200 ఎకరాల్లో దశల వారీగా 2వేల కోట్లతో విద్యాసంస్థలు నిర్మాణం జరగనుంది. తొలుత ఇంజినీరింగ్ విభాగానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి అమృత స్వరూపానంద పూరీ, మంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ....‘ విలువలతో కూడిన అమృత విశ్వవిద్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయడం అభినందనీయం. మాతా అమృతానందమయి ట్రస్ట్ సమాజం కోసం ఎనలేని సేవలు చేస్తోంది. సునామీ కబళించిన సందర్భంలో ఈ ట్రస్ట్ చేసిన సేవలు విలువ కట్టలేం. ప్రపంచంలో అమృత విశ్వవిద్యా పీఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అమరావతిలో కూడా కొనసాగాలి. ఈ విశ్వవిద్యాలయం వల్ల అమరావతికి శోభ వస్తుంది. సైన్స్, ఇంజినీరింగ్, ఇన్నోవేషన్, సోషల్ సైన్స్, గ్లోబల్ పీస్ వంటి అనేక టెక్నాలజీలతో కూడిన శిక్షణ తరగతులు అందుబాటులోకి వస్తాయి.’ అని సీఎం పేర్కొన్నారు. అలాగే రాజధానిలో తొమ్మిది నగరాలు వస్తున్నాయని, చరిత్రలో లేనివిధంగా రైతులు వేల ఎకరాలు ఇచ్చారన్నారు. రాబోయేవి ఆషామాషీ నగరాలు కావంటూ.. ప్రపంచస్థాయి నగరాలకు ధీటుగా అమరావతిని హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎన్నిక కష్టాలు వచ్చినా సరే సంకల్పంతతో ముందుకు వెళుతున్నామన్నారు. ఇక కృష్ణానదిపై అయిదు రిజర్వాయర్లు రాబోతున్నాయని, విజయవాడ..గుంటూరు నగరాలను మెగా సిటీలుగా రూపురేఖలు మార్చుతామని తెలిపారు. మోసం చేశారని మండిపడ్డ మహిళలు అమృత యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు డ్వాక్రా బృందాలతో భారీగా మహిళల్ని తరలించారు. అయితే సభకు వచ్చినవారికి చీరలు ఇస్తామని చెప్పి నిర్వాహకులు టోకెన్లు ఇచ్చి, చీరలు పంచకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు వస్తే చీరలు ఇచ్చి భోజనం పెడతామని తమను తీసుకు వచ్చి మోసం చేశారని మహిళలు మండిపడ్డారు.