చిల్డ్రన్ ఫ్యాంటసీ కథతో ‘ఆనందరావు అడ్వెంచర్స్’
‘సుహాస్ హీరోగా రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆనందరావు అడ్వెంచర్స్’. ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ కోతింటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభమైంది. ‘ఆనందరావు అడ్వెంచర్స్’ టైటిల్, ఫస్ట్ లుక్‌ని హీరో రానా రిలీజ్ చేయగా, దర్శకుడు క్రిష్ స్క్రిప్ట్‌ను టీమ్‌కి అందించారు. ‘‘చిల్డ్రన్ ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అన్నారు రామ్ పసుపులేటి. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: రాకేష్ ఎస్. నారాయణ్, సహ నిర్మాతలు: సుహాసిని రాహుల్, మురళీ జంపన.