ప్లెయిన్ పవర్
సండే టు మండే... వారమేదైనా..
పెళ్లి.. పుట్టినరోజు.. గెట్ టు గెదర్.. పార్టీ ఏదైనా..
మొఘల్ రాచరికపు హంగులు అడుగడుగునా కనువిందు చేస్తూ
కాలాలకు అతీతంగా ఇంకా ఇంకా అందంగా ముస్తాబు అవుతూనే ఉంది అనార్కలి.
అతివల హృదయాలను దోచుకుంటూనే ఉంది అనార్కలి.
కంటికి ఆహ్లాదాన్ని పంచే లేలేత రంగుల అనార్కలి
వేసవి కాలపు వేడుకలకు ఓ ప్రత్యేక ఆకర్షణ.
పాల తరగలాంటి మేని సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేసేవి లేలేత రంగులు. గాడీగా డిజైన్ లేకుండా అందాన్ని రెట్టింపు చేస్తూ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ అనార్కలి డ్రెస్సులు అతివల పవర్‌ని హుందాగా చూపుతాయి.
అనార్కలి డ్రెస్ డిజైన్ చేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు డిజైనర్లు. అవి... డ్రెస్ స్టైల్, డిజైన్, కలర్, ఫ్యాబ్రిక్, ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీ. ముందుగా ఈ ఐదింటిని దృష్టిలో పెట్టుకోవాలి. శాటిన్, షిఫాన్, నెట్, క్రేప్స్, జార్జెట్స్, సిల్క్, బ్రొకేడ్.. ఈ ఫ్యాబ్రిక్ అనార్కలి సూట్స్ మిగతా వాటితో పోల్చితే మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
‘గ’ నెక్ అనార్కలి సూట్స్ సాధారణ ఎత్తు గలవారికి బాగా నప్పుతాయి. పొడువుగా ఉన్నవారు ఏ తరహా నెక్ స్టైల్ అయినా వేసుకోవచ్చు. హైట్ తక్కువ ఉన్నవారు ఎక్కువ ఫ్రిల్స్ (కలీ) లేని అనార్కలిని ఎంచుకోవాలి. నడుము కింది భాగం మరీ ఎక్కువ కుచ్చులతో ఉంటే, లావుగా కనిపించే అవకాశాలు ఎక్కువ. పొడవుగా ఉండేవాళ్లు ‘నీ లెంగ్త్’ అనార్కలీలకు దూరంగా ఉండాలి. మోకాలికి రెండు అంచుల కిందకు టాప్ వేసుకొని, హై హీల్స్ ధరిస్తే స్టైల్‌గా కనిపిస్తారు. అనార్కలీనే పెద్ద అలంకరణ. అందుకని వీటి మీదకు చేసుకునే అలంకరణ మరీ ఎక్కువ గాడీగా ఉండకూడదు. సంప్రదాయ తరహాకు చెందిన చెవి లోలాకులు లేదా జూకాలు ధరిస్తే చాలు అలంకరణ పూర్తయినట్టే. వివాహ వేడుకలకు ధరించే అనార్కలిని బ్రొకేడ్‌తో తీర్చిదిద్ది నెక్ విశాలంగా తీసుకుంటే మంచిది. ప్రశాంతంగా అనిపించే లేత రంగులు, లైట్ ఎంబ్రాయిడరీ సాధారణ వేడుకలకు బాగా నప్పుతాయి.
- షబ్నంషిక్కా, ఫ్యాషన్ డిజైనర్
జరీ, సీక్వెన్స్, లేస్లతో అధికంగా ఎంబ్రాయిడరీ చేసిన పెళ్లికూతుళ్లు ఎంచుకోవాలి. క్యాజువల్‌గా అనార్కలి ధరించాలనుకునేవారు ఎలాంటి జరీ వర్క్ లేనివి ఎంచుకోవాలి. అయితే థ్రెడ్ వర్క్ ఎప్పుడూ సరైన ఎంపిక.