
టాలీవుడ్‌లో పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందీ బాలీవుడ్ నటి.. సయీ మంజ్రేకర్. ‘గని’తో తెలుగు తెర మీద మెరిసింది. మేజర్‌తో మురిపించింది. ఆమె తండ్రి అటు నార్త్.. ఇటు సౌత్‌లో మంచి నటుడు, దర్శకుడు.. మహేశ్ మంజ్రేకర్. ఆయన నీడలో కాకుండా తన ప్రతిభతో ప్రయణం సాగించాలనుకుంటోంది. ఆమె స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఆమె అటైర్‌లో ప్రతిఫలింపచేస్తున్న బ్రాండ్స్ ఇవే..
జరియా ది లేబుల్
సంప్రదాయ భారతీయ హస్తకళలను సంరక్షించడానికి కృషిచేస్తున్న ‘కళా రక్షణ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలసి పనిచేస్తున్న ఫ్యాషన్ బ్రాండే జరియా ది లేబుల్. వ్యవస్థాపకురాలు సుప్రియా జైన్. దేశీ ఫ్యాబ్రిక్, పాశ్చాత్య డిజైన్స్ .. ఈ రెండిటి సమ్మేళనమే ఈ బ్రాండ్. అజ్రఖ్‌పూర్, కశ్మీర్ వంటి ప్రాంతాల ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ, అప్లిక్ వర్క్ వంటి కళానైపుణ్యాలే జరియా లేబుల్‌కి వాల్యూ. అంతా హ్యాండ్ మేడే. ధరలూ ఆ స్థాయిలోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లో లభ్యం.
బ్రాండ్ వాల్యూ:
డ్రెస్: అన్కార్కలీ సెట్
బ్రాండ్: జరియా ది లేబుల్
ధర: రూ. 46,325
సంగీతా బూచ్రా
రాజస్థాన్ సంప్రదాయ నగల స్ఫూర్తితో ఏర్పడిన బ్రాండే సంగీతా బూచ్రా జ్యుయెల్స్. వెండి నగలు ఈ బ్రాండ్ ప్రత్యేకం. అందుబాటులోనే ధరలు.. ఆన్‌లైన్‌లో నగలు.
జ్యూయెలరీ
ఇయర్ రింగ్స్
బ్రాండ్: సంగీతా బూచ్రా
ధర: రూ. 14,000
ఈట్.. ప్రే.. లవ్.. నా ఫిలాసఫీ. ఆత్మపరిశీలన నాకు చేతకాదు. అదే నా బలహీనత. నా చుట్టూ ఉండేవాళ్లను మాత్రం సరదాగా.. సంతోషంగా ఉంచుతా. అది నా బలం.
– సయీ మంజ్రేకర్
∙దీపిక కొండి
చదవండి: Beach Jewellery: అలంకరణకు కొన్ని గవ్వలు .. ధర రూ.100 నుంచి వెయ్యి వరకు!
Comments
Please login to add a commentAdd a comment