చెవులకు దుద్దుల్లా పెట్టుకోనక్కర్లేదు... బుట్టల్లా బరువును మోయక్కర్లేదు హుక్‌ని తగిలించుకుంటే చాలు... చెవిని మొత్తం కప్పుతూ... హ్యాంగింగ్‌లా మెరుస్తూ జూకాలా జిగేల్మంటూ... మదిని దోచుకుంటున్నాయి. ‘బంగారమైనా సరే అలా చెవిని మొత్తం కప్పేస్తే ఎలా వినపడుతుందంటావూ...’ అనే గుసగుసలు మానేసి అంతా కళ్లప్పగించి చూడాల్సిందే!
గిరిజనుల ఆభరణాలు ఫ్యాషన్ జువెల్రీలో ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ బంగారు ఆభరణాలనూ హత్తుకుని కనువిందు చేస్తుంది. చెవికి నిండుదనాన్ని తీసుకువచ్చే ఈ ఆభరణాలలో జూకాల నుంచి ఎన్నో వైవిధ్యమైన డిజైన్లు వస్తున్నాయి. రంగు రంగు రత్నాభరణాలతో చేసిన లేయర్డ్ హ్యాంగింగ్ కఫ్స్ కూడా ఇండోవెస్ట్రన్ స్టైల్‌లో మెరిపిస్తుంటే.. చెవిని పూర్తిగా కప్పినట్టుగా ఉండే ఈ గోల్డ్ కఫ్స్ సంప్రదాయ వేడుకలలో ఆకర్షణగా నిలుస్తున్నాయి.
►కింది బుట్ట, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్‌తో ఉంటాయి.
►వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్‌తో తగిలించుకుంటే చాలు.
►వీటిలో నెమిలి, పువ్వులు–లతలు, దేవతామూర్తుల డిజైన్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment