![Earrings Fashion Jewellery - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/30/ear-rings.jpg.webp?itok=iiT3soJx)
ఆభరణాల ఎంపికలోనూ, ధరించడంలోనూ ఈ తరం చాలా అధునాతనంగా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనలను అందిపుచ్చుకుంటూ అధునాతన డిజైన్స్ వైపు దృష్టి పెడుతూనే సంప్రదాయ డిజైన్స్‌నూ మిళితం చేస్తున్నారు. ప్రఖ్యాత ఫ్యాషన్ అండ్ జువెల్రీ డిజైనర్ రోహిత్‌బాల్‌తో కలిసి రెండేళ్ల పాటు వర్క్ చేశాను. వజ్రాభరణాల డిజైన్స్‌లోని శిల్పకళను అర్ధం చేసుకున్నాను. ఇప్పుడు యంగర్ జనరేషన్ కాలేజీ, ఆఫీస్, ఫంక్షన్ ఇలా వేటికవి సందర్భానుసారం వజ్రాభరణాలను ధరించడంలో ఆసక్తి చూపుతోంది. వారి ఆలోచనలకు తగ్గట్టు వన్ టచ్ ఝుమ్ కా కలెక్షన్‌ని తీసుకువచ్చాం. వజ్రం ఖరీదులోనే కాదు కానుకల్లోనూ విలువైనది. అలాంటి వజ్రాభరణాలను ఎంపిక చేసుకోవాలంటే అవి తరతరాలకూ నచ్చేలా ఉండాలి. అలా ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచేపోయే డిజైన్స్ ఇవి.
♦ మ్యాంగో మోటిఫ్ జుంకీలది భారతీయ సంప్రదాయ డిజైన్. ఎన్నాళ్లైనా, తరతరాలకూ ఈ డిజైన్ మారదు.
♦ ఆకు మోటిఫ్, బెల్ షేప్డ్ డిజైన్ జూకాలు. ప్రాచీన కళ ఉట్టిపడే ఈ ఎప్పటికీ ఆకట్టుకుంటుంది .
♦ చంద్రుడు, నక్షత్రాలను పోలి ఉండేవి అచిరకాలం నిలిచే డిజైన్.
♦ కలువ పువ్వును పోలిన మోటిఫ్స్. ప్రతీ వేడుకలోనూ వైవిధ్యంగా వెలిగిపోతాయి.– సీమా మెహతా, ఆభరణాల నిపుణులు, కీర్తిలాల్స్
Comments
Please login to add a commentAdd a comment