ఇరాక్ లో మరో ప్రధాన నగరం సున్నీల వశం!
బాగ్గాద్: ఇరాక్ లో సున్నీ మిలిటెంట్ల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఎలాంటి తీవ్ర ప్రతిఘటన లేకుండానే ప్రధాన స్థావరాలన్ని సున్నీల వశమవుతున్నట్టు సమాచారం. తాజాగా అంబర్ ప్రాంతంలోని ప్రధాన పట్టణాన్ని సున్నీలు ఆక్రమించుకున్నారని వాయువ్య బాగ్దాద్ మేయర్ తెలిపారు.
స్థానిక సైన్యాన్ని, పోలీస్ బలగాలను ఆధిపత్యం కొనసాగించి.. సున్నీ మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తెచ్చకున్నారని మేయర్ తెలిపారు. అంబర్ లోని ప్రభుత్వ కార్యాలయాలను, 275 కిలోమీటర్ల యూఫరేట్స్ నదిని మిలిటెంట్లు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది.