రోడ్డు ప్రమాదంలో ఆంధ్రబ్యాంక్ చైర్మన్కు తీవ్రగాయాలు
హైదరాబాద్ నగర శివారుల్లోని హయత్నగర్లో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రబ్యాంక్ చైర్మన్ ప్రభాకర్తో పాటు ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రభాకర్ దంపతులను నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.