Andhra Pradesh Photo Journalists Association
-
మహిళా ఫొటో జర్నలిస్టులకు భద్రత కల్పించాలి: దేవులపల్లి అమర్
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహిళా ఫొటో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. మహిళలపై లై ంగిక దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ జగ్జ్జీవన్రామ్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ముంబైలో వార్తల సేకరణకు వెళ్లిన మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై దుండగులు లైంగికదాడికి పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దోషులకు వెంటనే శిక్ష పడే లా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత విధులు నిర్వహించే మహిళా ఫొటో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, కార్యదర్శి కె.ఎన్.హరి ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో హెచ్‌యూజే నాయకులు సురేశ్, రవీందర్‌రెడ్డి, మహేశ్, వెంకట్రావ్, ఎం.రవికుమార్, ఆర్.ఎస్.జె. థామస్ పాల్గొన్నారు. -
కలుషితం లేని వార్తే ఛాయా చిత్రం: జస్టిస్ ఎన్వీ రమణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: కలుషితం లేని వార్తగా నిలిచేది ఛాయా చిత్రం ఒక్కటేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 174వ ప్రపంచ ఛాయా చిత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఛాయా చిత్ర పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో అనేక న్యూస్ చానళ్లు ఉన్నప్పటికీ దిన పత్రికలు చదవడం తప్పనిసరి అవుతోందన్నారు. పత్రికల్లో చదివే వార్తా కథనం శీర్షికకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో ఫొటోకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. విలేకరి రాసిన వార్త కొంత కలుషితం అయ్యేందుకు వీలుంటుందని, పత్రికలో ప్రచురితమైన ఛాయాచిత్రంలో కలుషితం ఉండదని చెప్పారు. విషయాన్ని, భావాన్ని స్పష్టంగా చెప్పగలిగేది చిత్రమేనని, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఫొటోగ్రఫీయేనని తెలిపారు. తాను కూడా కొంత కాలం జర్నలిస్టుగా పని చేశానని జస్టిస్ రమణ చెప్పారు. ఫొటో జర్నలిస్టుల సాహసాలకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్‌కు రూ. 25 వేల విరాళాన్ని ఆయన ప్రకటించారు. ‘సాక్షి’కి మొదటి బహుమతి ఈ సందర్భంగా నిర్వహించిన ఛాయా చిత్రాల పోటీలో మొదటి బహుమతి ఏ సతీష్(సాక్షి), ద్వితీయ బహుమతి కె.రమేష్ (హిందూ), తృతీయ బహుమతి ఎన్ శివకుమార్(పోస్ట్‌నూన్) గెలుచుకున్నారు. 15 మంది ఫొటోగ్రాఫర్లు కన్సొలేషన్ బహుమతులకు ఎంపికయ్యారు. కరువు సమస్యలపై ఏర్పాటు చేసిన పోటీలో మొదటి బహుమతి డీ హుస్సేన్(సాక్షి), ద్వితీయ బహుమతి జీ వెంకన్న(నమస్తే తెలంగాణ), తృతీయ బహుమతి బీ నర్సింహులు(ఆంధ్రజ్యోతి) గెలుపొందారు. వీరితో పాటు నలుగురు కన్సొలేషన్ బహుమతులకు ఎంపికయ్యారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, సాక్షి క్వాలిటీసెల్ ఇన్చార్జ్ టీ కే లక్ష్మణ్‌రావు, ది హిందూ రెసిడెంట్ ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సభలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి, సిలికాన్ రబ్బర్ ఎండీ కపిల్ అగర్వాల్‌తో పాటు ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు కె.రవికాంత్ రెడ్డి, కార్యదర్శి కేఎన్ హరి, పత్రికల ఫొటో గ్రాఫర్లు పాల్గొన్నారు. -
సాక్షి ఫొటోజర్నలిస్టుకు ప్రథమ బహుమతి
సాక్షి; హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం(ఏపీపీజేఏ) నిర్వహించిన రాష్ట్ర స్థాయి ‘న్యూస్ ఫొటో కాంపిటీషన్-2013’ పోటీల్లో సాక్షి ఫొటో జర్నలిస్టు ఎ.సతీష్ ప్రథమ బహుమతి గెలుపొందారు. ‘ది హిందూ’ ఆంగ్ల పత్రిక ఫొటో జర్నలిస్టు కె.రమేష్‌బాబుకు ద్వితీయ, ‘పోస్ట్‌నూన్’కు చెందిన ఎన్.శివకుమార్‌కు తృతీయ బహుమతి లభించింది. ఫలితాల్ని ఫొటో జర్నలిస్టుల సంఘం శుక్రవారం వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 15 మందికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్టు తెలిపింది. పోటీలకు న్యాయనిర్ణేతలుగా ‘ది హిందూ’ రెసిడెంట్ ఎడిటర్ కె.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ కార్యదర్శి దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు ఎ.లక్ష్మణరావు వ్యవహరించారు. మరోవైపు విద్యుత్ కోత, కరువుపై ఏపీపీజేఏ నిర్వహించిన ఫొటో కాంపిటిషన్లో సాక్షి-కర్నూలు ఫొటో జర్నలిస్టు డి.హుసేన్‌కు ప్రథమ బహుమతి వచ్చింది. 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున హైదరాబాద్‌లోని దేశోద్ధారకభవన్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు ఏపీ ఫొటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కె.రవికాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.నరహరి శుక్రవారం తెలిపారు. ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు ఎ.సతీష్‌కు ప్రథమ బహుమతి వచ్చింది ఈ చిత్రానికే. కేదార్నాథ్ వరద బీభత్సానికి తార్కాణంగా నిలిచిన ఈ చిత్రం గౌరీకుంద్ సీతాపూర్ వద్ద తీసింది. వరదల్లో కొట్టుకొచ్చి రాళ్ల మధ్య చిక్కుకుపోయిన ఈ మృతదేహం ఓ పదేళ్ల బాలుడిది. విద్యుత్ కోత, కరువుపై నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్లో సాక్షి-కర్నూలు ఫొటో జర్నలిస్టు డి.హుసేన్‌కు ప్రథమ బహుమతి తెచ్చిన చిత్రమిది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం ఆమడగుంట్ల బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కొవ్వొత్తులతో చదువుకుంటున్న విద్యార్థుల కష్టాలను కళ్లకు కట్టేలా ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో తీసింది.