Andhra Pradesh Transport
-
ఏపీ ట్రాన్స్‌కో కొత్త సబ్ స్టేషన్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఐదు నూతన సబ్ స్టేషన్లను ప్రారంభించడంతో పాటు, 14 సబ్ స్టేషన్లు, లైన్లకు సీఎం చంద్రబాబు ఈ నెల 7న భూమి పూజ చేయనున్నారని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్ కో సీఎండీ కె.విజయానంద్ వెల్లడించారు. సీఆర్డీఏ పరిధిలో 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్(జీఐఎస్) ప్రారంభానికి సంబంధించి తాళ్లాయపాలెంలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లను విజయానంద్ మంగళవారం పరిశీలించి విద్యుత్ శాఖ అధికారులకు తగు సూచనలు చేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మిగతా నాలుగు సబ్ స్టేషన్లను తాళ్లాయపాలెం నుంచి వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే మొత్తం 14 సబ్ స్టేషన్లు , లైన్ల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజ కూడా చేస్తారని చెప్పారు. రూ.5407 కోట్లతో ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల పరిధిలోని 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, వివిధ సామర్థ్యాలతో సబ్ స్టేషన్లు, లైన్లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు విజయానంద్ వివరించారు. -
అధిక ధరలకు టికెట్లమ్మితే భారీ జరిమానా
సాక్షి, అమరావతి: దసరా పండగ దృష్ట్యా ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకునే ప్రైవేట్ ట్రావెల్స్‌కు ముకుతాడు వేసేందుకు రవాణా శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రవాణశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ల రేటు పెంచినా.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. పండగ వేళల్లో ప్రైవేట్ ట్రావెల్స్ గతంలోనూ అధికంగా రేట్లు పెంచి ప్రయాణికుల నుంచి భారీగా దండుకున్నాయి. టీఎస్‌ఆరీ్టసీ సమ్మె దృష్ట్యా హైదరాబాద్, తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులను ట్రావెల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పెడతారనే సమాచారంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. టికెట్ల ధర ఎంత వసూలు చేస్తే..అంతకు రశీదులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండగ సీజన్లో పది రోజుల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నిరంతర తనిఖీలతో అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలందాయి. ఎక్కడైనా ట్రావెల్స్ నిర్వాహకులు టికెట్ల ధర భారీగా వసూలు, ఒకే పరి్మట్‌తో రెండు వైపులా బస్సుల్ని తిప్పితే.. ఒకసారికి రూ.25 వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే మొదటి జరిమానాకు ఐదు రెట్లు అధికంగా జరిమానా విధించేలా ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలందాయి. వాట్సాప్ నంబరుకు ఫిర్యాదులు.. ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలుకు, నిబంధనల ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వాలంటే వాట్సాప్ నంబరు 9542800800కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు. -
లెక్క... తేలేదెలా?
-
లెక్క... తేలేదెలా?
నల్లగొండ అర్బన్: తెలంగాణ రాష్ట్రంలో తిరిగే ఆంధ్రప్రదేశ్ వాహనాలకు త్రైమాసిక పన్ను వసూలు మొదలైంది. జిల్లాలో వాడపల్లి, కోదాడ, నాగార్జునసాగర్ వద్ద ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టుల వద్ద పన్ను బాదుడు మొదలుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చెల్లించిన వాహన పన్ను ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తిరిగేందుకు ఉన్న వెసులుబాటుకు మంగళవారం అర్ధరాత్రితో గడువు పూర్తయ్యింది. తెలంగాణలో ప్రవేశించే వాహనాల నుంచి ఎంట్రీ టాక్స్‌ను వసూలు చేసేందుకు ప్రభుత్వం జీఓ 15 ఇప్పటికే విడుదల చేసింది. అమలు చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పన్ను వసూళ్ల కోసం డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ స్వయంగా చెక్‌పోస్టుల వద్ద పర్యవేక్షిస్తున్నారు. జిల్లా సరిహద్దుల నుంచి వెళ్లే టూరిస్టు వాహనాలు, స్టేజి క్యారేజీలు, ఇతర వాహనాలు, గూడ్సు వెహికిల్స్ నుంచి పన్నులు వసూలు చేసేందుకు సిబ్బంది కసరత్తు పూర్తి చేశారు. వాహనాల గుర్తింపు కష్టమే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాహనాలను గుర్తించడంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంపై ఇంకా డోలాయామాన పరిస్థితులే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వాహనాలన్నీ ఇటీవల వరకు ఏపీ రిజిస్ట్రేషన్‌తోనే ఉన్నాయి. ఆయా వాహనాల యజమాని స్థానికతను గుర్తించి తెలంగాణేతర వాహనమైతే పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తే తప్ప ఏ వాహనం ఏ ప్రాంతానికి చెందిందని ధ్రువీకరించడం సాధ్యపడదు. జిల్లా మీదుగా నిత్యం వెయ్యికిపైగా వాణిజ్య వాహనాలు సంచరిస్తుంటాయి. వీటిల్లో మూడు నాలుగు వందలు తెలంగాణ ప్రాంతానివైతే మిగతా ఆంధ్రా ప్రాంతానికి చెందినవై ఉంటాయి. కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొందరు ఆంధ్రప్రాంత యజమానులు తెలంగాణ చిరునామాలతో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాంటి వాహనాల నుంచి పన్ను ఎలా వసూలు చేయాలనే విషయంపై స్పష్టత రావాల్సివుంది. ట్రావెల్స్ వాహనాల ద్వారా త్రైమాసిక పన్ను రూపంలో సగటున రూ.2 కోట్ల ఆదాయం రావడానికి అవకాశాలున్నాయి. కానీ వాటిల్లో తెలంగాణ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు మినహాయింపు ఉండే పక్షంలో రాబడిలో ఏ మేరకు కోత పడుతుందనేది కాలం గడిస్తే తప్ప తెలియదు. అంతేకాకుండా ఈ నెలలో త్రైమాసిక పన్ను చెల్లిస్తే మళ్లీ మూడు నెలల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండకపోవడంతో ఆదాయం రాబడిలో ఒక్కో నెల ఒక్కో మాదిరిగా ఉండే అవకాశాలున్నాయి. మోటారు క్యాబ్‌లు, ఇతర వాహనాలు వారం రోజుల పర్మిట్‌తో పని పూర్తి చేసుకుంటే ఈ వారంలో వచ్చే రాబడి భవిష్యత్తులో ఉండకపోవచ్చు. మరోవైపు ఆంధ్రా ప్రాంతం వాహనాలను ఎన్ఓసీపై తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉండడంతో రవాణా శాఖకు రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయంపై ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. -
కేసీఆర్.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
ఏపీ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధించటం సరికాదు: వై.ఎస్.జగన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెరిగేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కోరారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డిలతో కలసి వై.ఎస్.జగన్ మంగళవారం సాయంత్రం ఆర్థికమంత్రి జైట్లీని ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఆయన కార్యాలయంలో కలిశారు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించేందుకు వీలుగా భారీగా నిధులు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అమలుచే సి రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించిన 8 పేజీల వినతిపత్రాన్ని జైట్లీకి కూడా అందించారు. అనంతరం జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నిన్న (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చెప్పిన అంశాలను అరుణ్‌జైట్లీకి కూడా నివేదించాం. రాష్ట్రానికి మంచి చేయాలని కోరాం. ఆయన సానుకూలంగా విన్నారు. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం...’’ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారు... ‘పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నిధుల దుర్వినియోగంపై ఏమైనా చెప్పారా?’ అని మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘పట్టిసీమ గురించి ఆర్థికమంత్రికి కూడా చెప్పాం. 21.9 శాతం ఎక్సెస్‌కు కోట్ చేయడం, టెండర్లు వేసిన తరువాత ఎక్సెస్‌ను బోనస్‌గా మార్చడం, టెండరు పిలవకముందు బోనస్ అనే క్లాజ్ లేకపోవడం, కోట్ చేసిన తరువాత ఎక్సెస్‌లో 16.9 శాతం బోనస్‌గా ప్రకటించడం వంటి అంశాలన్నీ తెలియజేశాం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని నిబంధనలు ఏవిధంగా ప్రభావితం చేయనున్నాయో వివరించాం...’’ అని పేర్కొన్నారు. ‘గోదావరి ప్రజలు పట్టిసీమ వద్దని అంటున్నారు. వారిని కూడగడతారా?’ అని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘‘మేం పట్టిసీమపై మొదటి నుంచీ స్పష్టంగా ఉన్నాం. జరుగుతున్నది అన్యాయం. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగానే.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని 7(ఇ) క్లాజ్ ప్రకారం 35 టీఎంసీల నీళ్లు వెళ్లిపోతాయి. ఇప్పుడు పట్టిసీమ పనులు మొదలుపెట్టగానే 7(ఎఫ్) క్లాజ్ వల్ల మరో 35 టీఎంసీలు వెళ్లిపోతాయేమోనన్న భయం మాలో చాలా ఎక్కువగా ఉంది. ప్రాజెక్టులు మొదలుపెట్టగానే.. కృష్ణాకు వచ్చే 70 టీఎంసీల నీళ్లు దూరమవుతాయేమోనన్న భయం ఉంది. ఎటువంటి స్టోరేజీ కెపాసిటీ నిర్మాణం లేకుండా కేవలం డబ్బులు సంపాదించుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో ఈమాదిరిగా రాష్ట్రాన్ని పణంగా పెట్టడం తప్పు అని స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి దీనిని ప్రతి వేదికపైనా కచ్చితంగా వ్యతిరేకిస్తాం...’’ అని బదులిచ్చారు. కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి... తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వాహనాలపై పన్ను విధించడాన్ని ఎలా చూస్తారని ఇంకో విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా ‘‘పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు చేయనప్పుడు.. ఒకే భాష మాట్లాడుకుంటున్న మనం చేయడమన్నది సరికాదని మేం మొదటి నుంచీ చెప్తున్నాం. ఒకే భాష మాట్లాడుతాం. మనుషులమంతా కలిసే ఉంటాం. మనం మనం పెరగాలనే చూడాలి తప్ప.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే కరెక్టు.. కేసీఆర్ కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకుని ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెంచాలి...’’ అని జగన్ స్పందించారు. జైట్లీకి వినతిపత్రం సారాంశమిదీ... ూ విభజన తర్వాత ఏపీకి ఐదేళ్ల పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తామన్న నాటి ప్రధాని హామీని సత్వరం నెరవేర్చాలి. ఇచ్చిన హామీ మేరకు ఏపీ వాస్తవిక రెవెన్యూ లోటును రీయింబర్స్ చేయాలి. ూ ప్రకాశం జిల్లా వంటి తక్కువ తలసరి ఆదాయమున్న ఇతర జిల్లాలకూ ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాలి. ఆచరణ సాధ్యం కాని పట్టిసీమ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి డీగ్రేడెడ్ అటవీ భూములను డీనోటిఫై చేస్తానని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల డీగ్రేడెడ్ అటవీ భూములు ఉన్నా.. బహుళ పంటలు సాగయ్యే 30 వేల ఎకరాలను భూములను భూ సమీకరణ పేరుతో సేకరించటాన్ని రైతులతో పాటు, ప్రతిపక్షంగా మేమూ వ్యతిరేకిస్తున్నాం. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం 2015-16 బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర రాజధాని కోసం భారీ మొత్తంలో నిధులు కేటాయించాలి. హిమాచల్‌ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పారిశ్రామిక వృద్ధి కోసం ఇచ్చిన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్‌కూ ప్రకటించాలి. పన్ను ప్రోత్సాహకాలను మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ప్రకటించాలి. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖల్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ, విజయవాడ మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, చిత్తూరు జిల్లాలో ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ మన్నవరం ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలి. రెండు రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాల్సిన విద్యాసంస్థలు, వైద్య సంస్థలకు ఇతోధికంగా నిధులు కేటాయించి సత్వర నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలి. సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, తదితర రైల్వే రంగ హామీలన్నీ నెరవేర్చాలి. ూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ త్వరగా నెరవేర్చాలి. ప్రాణహిత - చేవెళ్ల, దుమ్మగూడెం - నాగార్జునసాగర్ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలి. తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. జగ్గంపేట, విశాఖకు నేడు జగన్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటకు ఆయన వెళతారు. అక్కడ ఆయన వైఎస్సార్సీ శాసనసభాపక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ సోదరుడి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. నెహ్రూ సోదరుడు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. అక్కడ పరామర్శించిన తరువాత జగన్మోహన్రెడ్డి విశాఖపట్నానికి బయల్దేరి వెళతారు. గోకులపాడులో జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబీకులను జగన్ ఓదారుస్తారు. -
రాష్ట్రావ్యాప్తంగా వాహనాలు తనిఖీ: శిద్దా రాఘవరావు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీ, స్కూల్ బస్సులను తనిఖీ చేసి... రేపటి సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని 13 జిల్లాల ఆర్డీవోలను ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో శిద్ధా రఘవరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో రోడ్ల పరిస్థితి బాగోలేదన్ని తెలిపారు. రోడ్ల పరిస్థితిపై కూడా నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నష్టాలలో ఉన్న అర్టీసీ గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అందులోభాగంగా అర్టీసీ సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలాలు గుర్తించి... వాటిని లీజు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జేఎన్ఎన్యూఆర్ఎమ్ కింద 500 బస్సులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. 1000 పల్లె వెలుగు బస్సులు కొనుగోలు చేస్తామని శిద్దా రాఘవరావు చెప్పారు. -
ఆర్టీసీ ప్రయాణాలిక మరింత భారం
-
ఇంకా ‘ఏపీఎస్ఆర్టీసీ’యే..!
-
ఇంకా ‘ఏపీఎస్ఆర్టీసీ’యే..!
విభజనకు ‘ఉవ్ముడి ఆస్తుల’ రెడ్ సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల విభజన కసరత్తు కొలిక్కివచ్చినా ఆర్టీసీలో మాత్రం పరిస్థితి వూత్రం అందుకు భిన్నం గా ఉంది. ‘ఉవ్ముడి’ ఆస్తుల విషయుంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విభజన కసరత్తు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసే రోజున మహంతి ఆదేశించడంతో ఆర్టీసీలో విభజన పనులు ఆగి పోయాయి. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ ఆర్టీసీ ఇప్పటికీ ‘సమైక్యం‘గానే విధులు నిర్వహిస్తోంది. తెలంగా ణలోని ప్రధాన విభాగాలకు అధిపతులను నియుమించినా, ఆర్టీసీని అందులోనుంచి మినహారుుంచింది. వాస్తవానికి గత నెల 25నే ఆర్టీసీ విభజన కసరత్తు దాదాపు పూర్తయింది. సంస్థ ప్రధాన పరిపాలన భవనం అయిన బస్‌భవన్‌ను రెండుగా విభజించి ‘ఏ’ వింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థకు, ప్రస్తుతం ఎండీ తదిత ర ఉన్నతాధికారులు ఉంటున్న ‘బి’ వింగ్‌ను తెలంగాణ రవాణా సంస్థకు కేటాయించారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, ట్రాన్స్‌పోర్టు అకాడమీ, బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపం, బ్యాంకు, ఏటీఎంలను ఉమ్మడి ఆస్తులుగా పరిగణిస్తూ రెండుగా విభజించినట్టు నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. ఇక రెండుగా విభజించే వీలులేని ఉమ్మడి ఆస్తులుగా ఆసుపత్రి రేడియాలజీ విభాగం, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్, మియాపూర్‌లోని బస్‌బాడీ ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాపు, ప్రింటింగ్‌ప్రెస్, ఓపీఆర్ఎస్, సీఐఎస్, వీటీఎస్ ఐటీ సేవల వ్యవస్థలను, అనంతపూర్‌లోని విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను ఉమ్మడిగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఇక్కడే సమస్య మొదలైంది. హైదరాబాద్‌లోని ఆస్తుల్లో బస్‌భవన్ మినహా మిగతావన్నీ పూర్తిగా తమకే చెందాలని డివూండ్ చేస్తూ సమ్మెకు సిద్ధపడడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఇదే విషయాన్ని ఆర్టీసీ ఎండీ గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి నివేదించడంతో కొత్త ప్రభుత్వాలు పరస్పరం చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో విభజన పనిని నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాక దీనిపై చర్చించి తీసుకునే నిర్ణయం ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అప్పట్లో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొలువుదీరకపోవడంతో ఆర్టీసీని ‘సమైక్యం’గానే కొనసాగిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తరువాతే ఆర్టీసీ విభజనకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది. -
రెండు రోజులపాటు వెబ్సైట్లకు అంతరాయం
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలకు అంతరాయం ఏర్పడనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో రవాణా శాఖ వెబ్సైట్లో మార్పులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక వెబ్సైట్లను రూపొందిస్తోంది. దాంతో మార్పుల కారణంగా రేపు, ఎల్లుండి ఆ శాఖ వెబ్సైట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు వెబ్సైట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాఏ మీసేవా వెబ్సైట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది.