
ఇంకా ‘ఏపీఎస్‌ఆర్టీసీ’యే..!
విభజనకు ‘ఉవ్ముడి ఆస్తుల’ రెడ్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల విభజన కసరత్తు కొలిక్కివచ్చినా ఆర్టీసీలో మాత్రం పరిస్థితి వూత్రం అందుకు భిన్నం గా ఉంది. ‘ఉవ్ముడి’ ఆస్తుల విషయుంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విభజన కసరత్తు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసే రోజున మహంతి ఆదేశించడంతో ఆర్టీసీలో విభజన పనులు ఆగి పోయాయి. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ ఆర్టీసీ ఇప్పటికీ ‘సమైక్యం‘గానే విధులు నిర్వహిస్తోంది. తెలంగా ణలోని ప్రధాన విభాగాలకు అధిపతులను నియుమించినా, ఆర్టీసీని అందులోనుంచి మినహారుుంచింది. వాస్తవానికి గత నెల 25నే ఆర్టీసీ విభజన కసరత్తు దాదాపు పూర్తయింది. సంస్థ ప్రధాన పరిపాలన భవనం అయిన బస్‌భవన్‌ను రెండుగా విభజించి ‘ఏ’ వింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థకు, ప్రస్తుతం ఎండీ తదిత ర ఉన్నతాధికారులు ఉంటున్న ‘బి’ వింగ్‌ను తెలంగాణ రవాణా సంస్థకు కేటాయించారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, ట్రాన్స్‌పోర్టు అకాడమీ, బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపం, బ్యాంకు, ఏటీఎంలను ఉమ్మడి ఆస్తులుగా పరిగణిస్తూ రెండుగా విభజించినట్టు నివేదికలో కమిటీ స్పష్టం చేసింది.
ఇక రెండుగా విభజించే వీలులేని ఉమ్మడి ఆస్తులుగా ఆసుపత్రి రేడియాలజీ విభాగం, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్, మియాపూర్‌లోని బస్‌బాడీ ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాపు, ప్రింటింగ్‌ప్రెస్, ఓపీఆర్‌ఎస్, సీఐఎస్, వీటీఎస్ ఐటీ సేవల వ్యవస్థలను, అనంతపూర్‌లోని విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను ఉమ్మడిగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఇక్కడే సమస్య మొదలైంది. హైదరాబాద్‌లోని ఆస్తుల్లో బస్‌భవన్ మినహా మిగతావన్నీ పూర్తిగా తమకే చెందాలని డివూండ్ చేస్తూ సమ్మెకు సిద్ధపడడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఇదే విషయాన్ని ఆర్టీసీ ఎండీ గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి నివేదించడంతో కొత్త ప్రభుత్వాలు పరస్పరం చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో విభజన పనిని నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాక దీనిపై చర్చించి తీసుకునే నిర్ణయం ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అప్పట్లో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొలువుదీరకపోవడంతో ఆర్టీసీని ‘సమైక్యం’గానే కొనసాగిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తరువాతే ఆర్టీసీ విభజనకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది.