రాష్ట్రావ్యాప్తంగా వాహనాలు తనిఖీ: శిద్దా రాఘవరావు | Check School and College Buses, Ordered by Andhra Pradesh Transport minister | Sakshi
Sakshi News home page

రాష్ట్రావ్యాప్తంగా వాహనాలు తనిఖీ: శిద్దా రాఘవరావు

Published Fri, Jul 25 2014 1:59 PM | Last Updated on Sat, Jun 2 2018 7:01 PM

Check School and College Buses, Ordered by Andhra Pradesh Transport minister

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీ, స్కూల్ బస్సులను తనిఖీ చేసి... రేపటి సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని 13 జిల్లాల ఆర్డీవోలను ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో శిద్ధా రఘవరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో రోడ్ల పరిస్థితి బాగోలేదన్ని తెలిపారు. రోడ్ల పరిస్థితిపై కూడా నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

నష్టాలలో ఉన్న అర్టీసీ గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అందులోభాగంగా అర్టీసీ సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలాలు గుర్తించి... వాటిని లీజు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జేఎన్ఎన్యూఆర్ఎమ్ కింద 500 బస్సులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. 1000 పల్లె వెలుగు బస్సులు కొనుగోలు చేస్తామని శిద్దా రాఘవరావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement