Anjum Parvez
-
ప్రపంచ నంబర్‌వన్ అపూర్వీ
న్యూఢిల్లీ: కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత మహిళా షూటర్ అపూర్వీ చండేలా మరో మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అపూర్వీ 1926 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన మరో రైఫిల్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ 1695 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. గత ఫిబ్రవరిలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో అపూర్వీ 252.9 పాయింట్ల స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన ఈ రాజస్తాన్ షూటర్... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం కైవసం చేసుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అపూర్వీ ఇటీవల బీజింగ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత యువ షూటర్ దివ్యాన్‡్ష సింగ్ పన్వర్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ వర్మ 16వ స్థానం నుంచి మూడో ర్యాంక్‌కు చేరుకోగా... సౌరభ్ నాలుగో ర్యాంక్ నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు. పురుషుల ట్రాప్ విభాగం ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్ 24వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
ఇక బోరునీళ్లకూ మీటర్లు!
బెంగుళూరు: ఇంటిపన్ను, కరెంటుబిల్లు, డిష్బిల్లు, కుళాయిపన్నులాంటివే ఇప్పటి వరకు మనం విన్నాం.. ఇప్పుడు బోరునీటి వినియోగం పైనా పన్ను విధించబోతున్నారు. ఈ ప్రక్రియకు బెంగుళూరులో బీజంపడింది. ఇంటి, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే బోర్లకి బెంగుళూరు వాటర్ బోర్డ్ త్వరలో మీటర్లను బిగించనుంది. భూగర్భ జల వినియోగాన్ని తెలుసుకోవాలనే ఆలోచనతో ఈ ప్రక్రియ మొదలైంది. రానున్నరోజుల్లో భూగర్భజలాలను భారీగా వినియోగించుకునే వారికి బెంగుళూరు వాటర్ బోర్డ్ పన్ను విధించనుంది. దీని మీద కర్నాటక ప్రభుత్వానికి నివేధిక సమర్పించింది. బెంగుళూరులో భూగర్భజలాలను విచక్షణ రహితంగా వాడుతున్నారని బెంగుళూరు వాటర్ బోర్డు చైర్మన్ అంజుం పర్వీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాగునీటి కుళాయిలకు మాత్రమే మీటర్లు బిగించారు. మోత్తం బెంగుళూరులో 2.16 లక్షల బోరు పంపులు ఉండగా, కొత్తగా 92,790 బోర్లు తవ్వుతామంటూ ప్రజలు దరఖాస్తు చేసుకున్నట్టు బెంగుళూరు వాటర్ బోర్డు తెలిపింది.