annapurana studios
-
శ్రీదేవి, రేఖలకు ఏఎన్ఆర్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభ చూపిన వారికి అందించే ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కారాలను గురువారం కమిటీ ప్రకటించింది. 2018-19కి గానూ దివంగత నటి శ్రీదేవి బోనీకపూర్‌తో పాటు, మరో సీనియర్ హీరోయిన్ రేఖ.. ఏఎన్ఆర్ అవార్డులను అందుకోనున్నారు. కాగా 2013లో ఏఎన్ఆర్ అవార్డును అందుకున్న అలనాటి అందాల నటి శ్రీదేవి మరోసారి ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. నవంబరు 17న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించే ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డులను అందించనున్నారని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీకపూర్ ఈ పురస్కారాన్నిస్వీకరించనున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా (ఏసీఎఫ్ఎం) తృతీయ కాన్వకేషన్ (స్నాతకోత్సవం)ను కూడా నిర్వహించనున్నట్టు తెలిపింది. కాగా ఏఎన్ఆర్ తొలి జాతీయ అవార్డును బాలీవుడ్ హీరో దేవానంద్, 2017లో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. అలనాటి మేటి నటి అంజలీదేవి (2007), నర్తకి, నటి వైజయంతిమాల (2008), నేపథ్య గాయని లతా మంగేష్కర్ (2009), దర్శకుడు కె. బాలచందర్ (2010), దర్శకురాలు హేమమాలిని (2011), రచయిత దర్శకుడు శ్యామ్ బెనగల్ (2012), బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ (2014), సూపర్‌స్టార్ కృష్ణ(2015) ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖులు. -
హీరోగా మరో వారసుడి ఎంట్రీ
తెలుగు చిత్ర పరిశ్రమకు మరో నట వారసుడు పరిచయం కాబోతున్నాడు. ఎంతమంది వచ్చినా మరొకరికి అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌కు మరో హీరో కొడుకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో వెండితెరకు పరిచయమై తరువాత విలన్ గా అనంతరం హీరోగా మారిన నటుడు శ్రీకాంత్. ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ చబ్బీ హీరో కొద్ది రోజులుగా హీరో క్యారెక్టర్స్‌తో పాటు సపోర్టింగ్ రోల్స్‌లోనూ అలరిస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న శ్రీకాంత్... ప్రజెంట్ తన నట వారసుడు రోషన్‌ను పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. త్వరలో అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కింగ్ నాగార్జున... స్వయంగా శ్రీకాంత్ తనయుడు హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నాడు. ఇప్పటికే కథ కూడా ఓకె అయిన ఈ సినిమాకు 'నిర్మలా కాన్వెంట్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావటానికి నాగ్‌తో గెస్ట్ రోల్ చేయించడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. రిలీజ్ కు రెడీ అవుతున్న రుద్రమదేవి సినిమాలో చాళుక్య వీరభద్రుడిగా నటించిన రోషన్ త్వరలో సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే పలు సినిమా ఫంక్షన్లకు హాజరై రోషన్ ...ఎట్రాక్టివ్ లుక్‌తో పలువురిని ఆకర్షించాడు కూడా. హీరో కావటానికి అన్ని క్వాలిటీస్ ఉండటంతో రోషన్ ...కోసం పలువురు శ్రీకాంత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న రోషన్ తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.