సారూ.. మా ఊరిని వదిలేయండి
కానిస్టేబుల్ కాలు పట్టుకున్న ‘భోగాపురం’ వృద్ధురాలు
భోగాపురం: ‘సారూ.. నీ తల్లిలాంటి దాన్ని.. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఊళ్లోనే ఉన్నాం.. ఇక్కడే చస్తాం... దయచేసి మా నుంచి మా ఊరిని, భూముల్ని వేరు చేయొద్దు’ అంటూ బమ్మిడిపేటకు చెందిన ఓ వృద్ధురాలు సర్వే సిబ్బందికి రక్షణగా వచ్చిన రామ్నివాస్ అనే కానిస్టేబుల్ కాలు పట్టుకుని వేడుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మించనున్న ఎయిర్పోర్టు కోసం బుధవారం ైబెరైడ్డిపాలెం పంచాయతీ బమ్మిడి పేట వద్ద సర్వే నిర్వహించారు. ఆ సమయంలో అప్పయ్యమ్మ అనే వృద్ధురాలు ఇలా ఆవేదన చెందింది.