కీచక టీచర్ల సస్పెన్షన్
కోరుట్ల: మండలంలోని చినమెట్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థినుల వేధించిన ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, హిందీ ఉపాధ్యాయుడు రాజేశంను డీఈవో శ్రీనివాసాచారి శనివారం సస్పెండ్ చేశారు. కొంత కాలంగా పాఠశాలలో చదువుతున్న 8, 9, 10వ తరగతి విద్యార్థినులతో ఈ ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పది రోజుల క్రితం చినమెట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జగిత్యాల డిప్యూటీ డీఈవో జగన్మోహన్రెడ్డి విచారణ జరిపారు. అనంతరం నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందించారు. నివేదిక ప్రకారం డీఈవో ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.