Aradugula Bullet
-
ఓటీటీలో గోపీచంద్-నయన్ చిత్రం?
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగాన్ని కూడా కుదిపేసింది. చాలా విరామం తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతున్నాయి. అయితే థియేటర్లు తెరుచుకునే విషయంలో ఇప్పటికీ సందిగ్దత కొనసాగుతూనే ఉంది. దీంతో విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలను ఓటీటీ (ఓవర్ ది టాప్ మీడియా సర్వీసెస్)లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా విడుదల అయ్యాయి. అమృతరామమ్‌తో పాటు కీర్తి సురేష్, జ్యోతిక, అమితాబ్‌ల చిత్రాలు ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక షూటింగ్ పూర్తి చేసుకొని పలు కారణాలతో విడుదలకు నోచుకోని చిత్రాలు సైతం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. (ఆగస్ట్‌లో కబడ్డీ కబడ్డీ) తాజాగా గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం కూడా డిజిటల్ బాట పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల క్రితం గోపీచంద్, నయనతార జంటగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన సినిమా 'ఆరడుగుల బుల్లెట్'. షూటింగ్ పూర్తయినా.. చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు మొదలు పెట్టారంటా. గోపిచంద్ క్రేజ్, నయనతరా గ్లామర్, గోపాల్ ఇమేజ్ కలగలపి ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓటీటీ నిర్వాహకులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే గుడ్ న్యూస్ రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఓటీటీలో విడుదల అవుతున్న గోపీచంద్-నయనతార చిత్రం ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. (ఐ వాన్న అన్‌ఫాలో యు) -
గోపీచంద్ టైటిల్ బలం కాదు బుల్లెట్..?
మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ జనరేషన్ యాక్షన్ హీరో గోపీచంద్. ఇటీవల స్టైలిష్ క్యారెక్టర్లతో ఆకట్టుకుంటున్న ఈ మ్యాన్లీ స్టార్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న స్టైలిష్ ఎంటర్టైనర్తో పాటు, ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆక్సిజన్ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బి గోపాల్ చిత్రాన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో రమేష్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న చిత్ర యూనిట్ టైటిల్ వేటలో బిజీగా ఉంది. ముందుగా బలం అనే టైటిల్ ఫిక్స్ చేసినా.. ప్రస్తుతం బుల్లెట్ లేదా ఆరడుగుల బుల్లెట్ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే టైటిల్‌ను ఫైనల్ చేసి దీపావళికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
గవర్నర్ నోట 'ఆరడుగుల బుల్లెట్'
18వ అంతర్జాతీయ బాలల చలన చిత్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా 'ఆరడుగుల బుల్లెట్' అంటూ పవన్ కళ్యాణ్ గురించి గవర్నర్ నరసింహన్ అనడం వేదికపైనే కాక పెద్దల నుంచే కాకుండా, పిల్లల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తనకు వచ్చిరాని తెలుగులో అత్తారింటికి దారేది చిత్రంలోని పాటలోని కొన్ని లైన్లను చదువుతూ గవర్నర్ అందర్ని ఆకట్టుకున్నారు. ఆరడుగుల బుల్లెట్.. ధైర్యం విసిరిన రాకెట్.. గవర్నర్ అంటున్నపుడు పవన్ కళ్యాణ్ సిగ్గు పడుతూ, ముసి ముసి నవ్వులు నవ్వారు. అత్తారింటికి దారేది ద్వారా పవన్ కళ్యాణ్ పవర్ చూపించారు.. అయితే ఇంట్లో పవన్ కళ్యాణ్ లా మాత్రమే ఉండాలని గవర్నర్ సూచించారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ముగింపు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు హైదరాబాద్ శాశ్వత వేదికగా మారడం ఆనందంగా ఉంది. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లోని లలిత కళాతోరణం లో జరిగిన ముగింపు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరై ప్రధాన ఆకర్షణగా నిలిచారు.