arms licence
-
సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్.. పోలీసుల నిర్ణయం
Salman Khan Gets Arms License After His Request Citing Death Threats: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు తాజాగా తుపాకీ లైసెన్స్ మంజూరైంది. ఇటీవల సల్లూ భాయ్‌ని, అతని తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన విషయం తెలిసిందే. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే పడుతుందని సల్లూ భాయ్‌కు వచ్చిన లేఖ నేపథ్యంలో ముంబయి పోలీసులను సల్మాన్ ఆశ్రయించాడు. తనకు, తన కుటుంబానికి వస్తున్న చావు బెదిరింపుల కారణంగా తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేయాలని పోలీసులకు సల్మాన్ ఖాన్ విన్నవించుకున్నాడు. ఈ విషయంపై విచారించిన తర్వాత సల్మాన్‌కు తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ ముంబయి కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే సల్లూ భాయ్‌కు తుపాకీ లైసెన్స్ జారీ చేసిన ఆతను ఎలాంటి తుపాకీ కొంటారనేది పేర్కొనలేదు. ఆయన రక్షణ కోసం 32 కాలిబర్ రివాల్వర్ లేదా పిస్టల్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ఆయుధ నిపుణులు సూచించినట్లు సమాచారం. కాగా బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌కు ముంబయి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. ఇటీవల తెలుగు సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్ పార్క్ హయత్ హోటల్లో బస చేయడంతో భారీ బందోబస్తు ఉంచారు. హోటల్లోని ఒక ఫ్లోర్ మొత్తాన్ని సల్మాన్‌కు కేటాయించారు. షూటింగ్‌ల కోసం నగరాల్లో తిరిగేందుకు సల్మాన్ కారుకు ముందు వెనుక ఎస్కార్టు ఏర్పాటు చేశారు. అలాగే సల్మాన్ ఖాన్ ముందు జాగ్రత్తగా తన ల్యాండ్ క్రూయిజర్‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించారు. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా.. -
ఆన్లైన్లో తుపాకీ లెసైన్స్
కేకే నగర్(చెన్నై): ఆన్లైన్ ద్వారా తుపాకీ లెసైన్సు పొందడం, రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా పుదుచ్చేరిలో ప్రవేశపెట్టారు. దేశంలోని అన్నిరకాల ఆయుధాలను పర్యవేక్షించేందుకు వీలుగా ఆన్లైన్లో లెసైన్సులివ్వాలని కేంద్ర హోం శాఖ గతంలో ఆదేశించింది. దీనిపై చర్చించేందుకు పోలీసు, న్యాయ శాఖల అధికారులు, న్యాయమూర్తులు శనివారం పుదుచ్చేరి సచివాలయంలో సమావేశమయ్యారు. అక్కడే సచివాలయ కార్యదర్శి మనోజ్ పరిదా ఆన్లైన్లో లెసైన్సలిచ్చే పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఎక్కడైనా నేరాలు జరిగినచోట తుపాకీ దొరికితే, దానికి కేటాయించిన ప్రత్యేక సంఖ్య ద్వారా తుపాకీ ఎవ రిదో ఆన్లైన్లో సులువుగా తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో డీజీపీ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.