ఆన్‌లైన్‌లో తుపాకీ లెసైన్స్
కేకే నగర్(చెన్నై): ఆన్‌లైన్ ద్వారా తుపాకీ లెసైన్సు పొందడం, రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా పుదుచ్చేరిలో ప్రవేశపెట్టారు. దేశంలోని అన్నిరకాల ఆయుధాలను పర్యవేక్షించేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో లెసైన్సులివ్వాలని కేంద్ర హోం శాఖ గతంలో ఆదేశించింది. దీనిపై చర్చించేందుకు పోలీసు, న్యాయ శాఖల అధికారులు, న్యాయమూర్తులు శనివారం పుదుచ్చేరి సచివాలయంలో సమావేశమయ్యారు.
అక్కడే సచివాలయ కార్యదర్శి మనోజ్ పరిదా ఆన్‌లైన్‌లో లెసైన్సలిచ్చే పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఎక్కడైనా నేరాలు జరిగినచోట తుపాకీ దొరికితే, దానికి కేటాయించిన ప్రత్యేక సంఖ్య ద్వారా తుపాకీ ఎవ రిదో ఆన్‌లైన్‌లో సులువుగా తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో డీజీపీ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.