gun licence
-
US: పాఠశాలలో కాల్పుల కలకలం
న్యూయార్క్: అమెరికాలోని అయోవాలో పాఠశాలలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులతో సహా పాఠశాల నిర్వహకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. శీతాకాలం సెలవుల తర్వాత పాఠశాలలు మొదటిరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 7:30కి పిల్లలు బ్రేక్ ఫాస్ట్ కోసం తరగతి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ పిల్లాడు కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో సహా పాఠశాల నిర్వహకుడు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. కాల్పులు జరిపిన విద్యార్థిని డైలాన్ బట్లర్(17 )గా అధికారులు గుర్తించారు. బట్లర్ కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాల్పుల శబ్దం విన్న వెంటనే తరగతి గదిలోకి పారిపోయామని స్థానిక విద్యార్థులు తెలిపారు. అందరూ బయటకి రండి అని పిలుపు విన్న తర్వాతే బయటకు వచ్చానని ఓ విద్యార్థి పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణంలో నేలంతా రక్తసిక్తమైందని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. అమెరికా గన్ కల్చర్ రోజురోజుకీ ఎక్కువవుతోంది. పాఠశాలల్లో కాల్పుల ఘటన ఈ ఏడాది రెండోది. వర్జీనియాలో స్కూల్ బయటే ఓ కాల్పులకు పాల్పడిన ఘటన తర్వాత రోజు ఇది జరిగింది. మొత్తంగా 2018 నుంచి అమెరికా స్కూళ్లలో కాల్పుల ఘటనల సంఖ్య 182కు చేరింది. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
రివాల్వర్‌తో అత్తపై కాల్పులు జరిపిన అల్లుడు.. ఒక్కసారిగా కలకలం!
హనమకొండ: గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెండో డివిజన్ గుండ్లసింగారంలో గురువారం కాల్పులు కలకలం రేపాయి. అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వనందుకు ఓ కానిస్టేబుల్ (రైటర్) పోలీస్ సర్వీస్ రివాల్వర్‌తో అత్తపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఒక్కసారిగా తూటా శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రివాల్వర్ ఎత్తుకొచ్చాడు.. నగరంలోని కీర్తినగర్‌కు చెందిన అడ్డె ప్రసాద్‌కు గుండ్లసింగారానికి చెందిన రమాదేవితో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ప్రసాద్‌తోపాటు అత్త కుటుంబసభ్యులు గుండ్లసింగారంలో వేర్వేరు ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధి లోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్(రైటర్)గా విధులు నిర్వహిస్తున్నాడు. నెలకోసారి, రెండు సార్లు ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. కొంతకాలం క్రితం ప్రసాద్ తన అత్త కమలాదేవి(58)కి రూ.4లక్షల అప్పుగా ఇవ్వగా.. తిరిగి ఆమె ఇవ్వలేదు. దీంతోపాటు అతడి కాపురంలోనూ విబేధాలు వచ్చాయి. ఈనేపథ్యంలో వారిపై కోపం పెంచుకున్న ప్రసాద్ అత్తతోపాటు భార్య, బావమరిది టార్గెట్ చేశాడు. మొదట అత్తను చంపి ఆ తర్వాత ఇంట్లోనే ఉన్న బావమరిదిని.. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్యను తుదముట్టించాలనుకున్నాడు. వరుసగా ముగ్గురిని చంపాలంటే తుపాకీ అవసరమని భావించాడు. బుధవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ తన రివాల్వర్ని క్లీన్ చేసి భద్రపర్చమని ప్రసాద్‌కు చెప్పాడు. కానీ ప్రసాద్ ఆ రివాల్వర్‌ను భద్రపరిచి ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా తీసుకున్నాడు. అనంతరం గుండ్లసింగారం వచ్చాడు. గురువారం ఉదయం స్టేషన్‌కు వచ్చిన స్టేషన్‌హౌస్ ఆఫీసర్ రివాల్వర్ తీసుకునేందుకు వెళ్లగా కనిపించలేదు. దీంతో స్టేషన్‌లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. రివాల్వర్‌ను ప్రసాద్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత అక్కడి పోలీసులు ప్రసాద్‌కు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదని సమాచారం. కోటపల్లి నుంచి గురువారం ఉదయం గుండ్లసింగారం చేరుకున్న ప్రసాద్ నేరుగా అత్త కమలాదేవి ఇంటికి వచ్చి ఆమెను కాల్చాడు. అప్పటికే స్థానికులు గుమిగూడడంతోపాటు కుటుంబ సభ్యులు రావడం.. అతడిపై దాడి చేయడంతో ముందుగా అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. తూటా శబ్దంతో కలకలం! కమలాదేవిపై రివాల్వర్‌తో ఒక రౌండ్ కాల్పులు జరపడంతో ఆమె ఇంటి నుంచి రోడ్డుమీదికి రక్తమోడుతూ వచ్చి కింద పడింది. రక్తం కూడా గేటునుంచి పది అడుగుల దూరం పడి ఉంది. ఒక్కసారిగా పెద్దశబ్దం రావడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళనకు గురయ్యారు. కొద్దిదూరంలో ఉన్న ప్రసాద్భార్య రమాదేవితోపాటు ఆమె కూతుళ్లు, సోదరుడు హుటాహుటిన వచ్చి చూసేసరికి తల్లి చనిపోయి కనిపించడంతో బోరున విలపించారు. ఓవైపు తల్లి మృతదేహం.. మరో వైపు ప్రసాద్ దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండడంతో ఆగ్రహానికి గురయ్యారు. అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతడి తల, శరీరంపై తీవ్రగాయాలై రక్తంతో తడిసిపోయాడు. ఆధారాల సేకరణ.. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.ఏ బారి, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఇరుగుపొరుగు వారిని, కమలాదేవి కూతురు రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. రక్త నమూనాలు సేకరించారు. కాల్చిన బుల్లెట్ షెల్ కోసం పోలీసులు గాలించారు. దాదాపు గంటరన్న పాటు వెతికారు. అయినప్పటికీ లభ్యం కాలేదు. కొంతకాలంగా వేర్వేరుగా.. కొంతకాలంగా ప్రసాద్, రమాదేవి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. దీంతో దూరంగానే ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం తనను వేధింపులకు గురి చేస్తున్నాడని రమాదేవి నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాన్ని ప్రసాద్ అవమానకరంగా భావించినట్లు చర్చ జరుగుతోంది. దీనంతటికీ భార్యతోపాటు అత్త, బావమరిది కారణమని కోపం పెంచుకున్న అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సమగ్ర దర్యాప్తు : ఎంఏ బారి, డీసీపీ హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి తెలిపారు. ఈ హత్యకు ఆర్థిక, ఇతరత్రా కారణాలు ఉన్నాయనే అంశంపై విచారణ చేపడతామన్నారు. గుండ్లసింగారంతోపాటు కీర్తినగర్‌లోని నిందితుడి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మృతురాలి కూతురు రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Nupur Sharma: నూపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ
ఢిల్లీ: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన నూపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. కిందటి ఏడాది ఓ టీవీ డిబేట్లో ఆమె ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాదు.. యావత్ ప్రపంచంలోనూ మంట పుట్టించాయి. ఆపై ఆమెను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కూడా. అయితే.. తనకు ప్రాణ హాని ఉందని, తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆమె ఎప్పటి నుంచో పోలీసులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ కోరారామె. ఈ నేపథ్యంలోనే ఆమెకు గన్ లైసెన్స్ జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ లైసెన్స్ ఆధారంగా ఆమె ఆత్మ రక్షణ కోసం తుపాకీని వెంట పెట్టుకునే అవకాశం లభిస్తుంది. మరోవైపు.. సుప్రీం కోర్టు సైతం ఆమె భద్రత కారణాల దృష్ట్యా.. దేశంలో ఆమెపై దాఖలైన(దాఖలు అవుతున్న కూడా) ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదలాయించాలని ఆదేశించి ఆమెకు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు కొన్నినెలల ముందు.. నూపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమె తక్షణ క్షమాపణలు చెప్పాల్సిందని అభిప్రాయపడింది. బాధ్యత గల న్యాయవాది వృత్తిలో అనుభవం ఉండి.. సోయి లేకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు దేశంలో విద్వేషాలకు దారి తీసిందని, పరిణామాలకు ఆమె ఒక్కతే బాధ్యత వహించాలంటూ కూడా అభిప్రాయపడింది. ఇక నూపుర్‌కు మద్దతు వ్యాఖ్యలు చేసినందుకే.. రెండు హత్యలు జరగడం దేశాన్ని కుదిపేసింది కూడా. రాజస్థాన్ ఉదయ్‌పూర్ ఓ టైలర్‌ను, ఆపై మహారాష్ట్ర అమరావతిలో ఓ ఫార్మసిస్ట్‌ను దారుణంగా హతమార్చారు. మరోవైపు ఆమెను హతమారుస్తామంటూ కొందరు వీడియోల ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డంతో ఆమె కొన్నాళ్లూ అజ్ఞాతంలోనూ గడిపారు. -
ఏం జరిగిందని ప్రశ్నించారని..పోలీసులపైకి గన్ గురిపెట్టి...
సాక్షి, పంజాగుట్ట: పోలీసులపైకి గన్ చూపించిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి లైసెన్స్డ్ గన్, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...చిత్తూరు జిల్లాకు చెందిన వెంకట నాగేంద్ర రెడ్డి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారు జామున 3:30 ప్రాంతంలో అమీర్‌పేట బిగ్‌బజార్ వీధిలో ట్రాన్స్‌జెండర్స్‌తో గొడవ పడుతున్నాడు. గమనించిన పెట్రోలింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ సాయికుమార్, హోంగార్డు రవీంద్రబాబులు వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించారు. దీంతో వెంకట నాగేంద్ర రెడ్డి తనవద్ద ఉన్న గన్ను పోలీసులకు గురిపెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా అతడ్ని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అతని వద్ద ఉన్న గన్, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ దాని గడువు అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గన్ గురిచూపినా బెదరకుండా చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ సాయికుమార్, హోం గార్డు రవీంద్రబాబులను నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ అభినందించారు. వారికి ఒక్కొక్కరికీ 2500 క్యాష్ రివార్డు, జ్ఞాపికను అందించారు. (చదవండి: ‘డర్టీ పిక్చర్’లో కొత్త కోణం! మహిళ ప్రమేయం లేకుండానే ఫొటో వైరల్ ) -
సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్.. పోలీసుల నిర్ణయం
Salman Khan Gets Arms License After His Request Citing Death Threats: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు తాజాగా తుపాకీ లైసెన్స్ మంజూరైంది. ఇటీవల సల్లూ భాయ్‌ని, అతని తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన విషయం తెలిసిందే. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే పడుతుందని సల్లూ భాయ్‌కు వచ్చిన లేఖ నేపథ్యంలో ముంబయి పోలీసులను సల్మాన్ ఆశ్రయించాడు. తనకు, తన కుటుంబానికి వస్తున్న చావు బెదిరింపుల కారణంగా తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేయాలని పోలీసులకు సల్మాన్ ఖాన్ విన్నవించుకున్నాడు. ఈ విషయంపై విచారించిన తర్వాత సల్మాన్‌కు తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ ముంబయి కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే సల్లూ భాయ్‌కు తుపాకీ లైసెన్స్ జారీ చేసిన ఆతను ఎలాంటి తుపాకీ కొంటారనేది పేర్కొనలేదు. ఆయన రక్షణ కోసం 32 కాలిబర్ రివాల్వర్ లేదా పిస్టల్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ఆయుధ నిపుణులు సూచించినట్లు సమాచారం. కాగా బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌కు ముంబయి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. ఇటీవల తెలుగు సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్ పార్క్ హయత్ హోటల్లో బస చేయడంతో భారీ బందోబస్తు ఉంచారు. హోటల్లోని ఒక ఫ్లోర్ మొత్తాన్ని సల్మాన్‌కు కేటాయించారు. షూటింగ్‌ల కోసం నగరాల్లో తిరిగేందుకు సల్మాన్ కారుకు ముందు వెనుక ఎస్కార్టు ఏర్పాటు చేశారు. అలాగే సల్మాన్ ఖాన్ ముందు జాగ్రత్తగా తన ల్యాండ్ క్రూయిజర్‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించారు. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా.. -
బంపర్ ఆఫర్.. తుపాకీ వాడకంపై పోలీసులే శిక్షణ ఇస్తారంటా..
మీకు తుపాకీ వాడటం ఇష్టమా.. కానీ, అది ఎలా వాడాలో తెలియదా..?. మీ సేఫ్టీ కోసం తుపాకీ వాడాలనుకుంటున్నారా.? అయితే, తుపాకీని ఎలా ఉపయోగించాలో సామాన్య పౌరులకు పోలీసులు శిక్షణ ఇవ్వబోతున్నారు. అదేంటి పోలీసులు శిక్షణ ఇవ్వడమేంటీ అనుకుంటాన్నారా.. మీరు విన్నది నిజమే. కేరళ పోలీసులు.. పౌరులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేరళ డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. తుపాకీ వినియోగంపై పౌరులకు శిక్షణ ఇవ్వనున్నట్టు కేరళ డీజీపీ అనిల్‌కాంత్ చెప్పారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. అయితే, ఇప్పటికే తుపాకీ వినియోగించడానికి లైసెన్స్ ఉన్నవారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. తుపాకీని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా అనుభవం లేనివారికి రూ.5,000.. అలా కాకుండా కాస్త అవగాహన ఉన్నవారు, ఫైన్-ట్యూనింగ్ అవసరం ఉన్నవారు రూ.1000కే శిక్షణ పొందవచ్చు. ఇదిలా ఉండగా.. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎంపిక కారని డీజీపీ స్పష్టం చేశారు. వారి ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంటుందని.. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంపిక జరుగుతుందని అన్నారు. ఈ సెలక్షన్ ట్రయల్‌లో ఉత్తీర్ణులైన వారికే శిక్షణ ఉంటుందన్నారు. కాగా, ఇటీవల ఓ వ్యక్తి తుపాకీ వినియోగంపై కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా న్యాయస్థానం తుపాకీ లైసెన్స్ ఉన్న వారికి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో డీజీపీ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. The venerated gun culture, existed only in Malayalam flicks, is getting a mainstream treatment with Kerala Police pushing a "practical weapon training"https://t.co/5rtkQRDoVi — VM Abijeet (@poetsandgypsies) June 7, 2022 ఇది కూడా చదవండి: వాడో బచ్చా సీఐ, మూడో కన్ను తెరుస్తా.. మండిపడ్డ ఎమ్మెల్యే -
Sakshi Cartoon: అమెరికాలో మళ్లీ కాల్పులు-తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం
అమెరికాలో మళ్లీ కాల్పులు-తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం -
జూబ్లీహిల్స్: లైసెన్స్డ్ గన్‌కు పని చెప్పమంటావా..?
సాక్షి, బంజారాహిల్స్: తాము కోరుకున్న విధంగా ఆస్తి పంపకాలు చేయకపోతే అంతం చేస్తామంటూ గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్, డైరెక్టర్ డా.కంచర్ల రవీంద్రనాథ్ను బెదిరించిన వ్యవహారంలో ఆయన అల్లుడు, వియ్యంకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లో ఉంటున్న డా.రవీంద్రనాథ్‌కు ఇటీవల ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి. తన ఆస్తుల్లో సుమారు 70 శాతం గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్‌కు ఇస్తానని డాక్టర్ రవీంద్రనాథ్ చెప్పడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే కాలనీలో నివసించే అల్లుడు పొట్లపల్లి సూరజ్‌తేజ్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ రవీంద్రనాథ్ ఇంటికి వచ్చాడు. రావడంతోనే ఇద్దరి మధ్య ఆస్తుల విషయమై గొడవ జరిగింది. తాము చెప్పినట్లు ఆస్తులను సమానంగా పంచకపోతే అంతు చూస్తానని, తన వద్ద లైసెన్స్డ్ గన్ కూడా ఉందని దానికి పని చెప్పమంటావా అంటూ బెదిరించాడు. చెన్నైలో ఉంటున్న తన కుమారుడి మామ(వియ్యంకుడు) పరుచూరి రాజారావుతో చేతులు కలిపిన అల్లుడు సూరజ్‌తేజ్ కొంత కాలంగా తన ఫోన్‌ను కూడా హ్యాక్ చేసి తన కదలకలను గమనిస్తున్నాడని మూడో వ్యక్తికి తాను మాట్లాడుతున్న విషయాలను చేరవేస్తున్నారన్నాడు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ డాక్టర్ రవీంద్రనాథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని, తన అడ్డు తొలగించుకునేందుకు అల్లుడు, వియ్యంకుడు కిరాయి మనుషులను ఏర్పాటు చేశారని ఆరోపించాడు. మూడు నెలల్లోగా ఆస్తుల పంపకాలు చేయకపోతే హత్య చేసేందుకు కూడా వెనుకాడబోమని బెదిరింపులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడు సూరజ్‌తేజ్, వియ్యంకుడు రాజారావులపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చదవండి: బల్దియా చరిత్రలోనే మొదటిసారి.. ప్రతిపక్షాల విమర్శలు విచ్చలవిడిగా డ్రోన్ల వినియోగం.. హైదరబాద్కూ ముప్పు! -
లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై కాల్పులు
సాక్షి, బహదూర్‌పురా: కుటుంబ కలహాల నేపథ్యంలో లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటన కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం..కాలాపత్తర్ బిలాల్‌నగర్ ప్రాంతానికి చెందిన హబీబ్ హష్మీ (52) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసైన హబీబ్.. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఇంటి పేపర్లు ఇవ్వాలంటూ భార్య, కుమారుడితో గొడవ పడ్డాడు. పేపర్లు ఇవ్వమంటూ చెప్పడంతో ఆగ్రహించిన హబీబ్ ఇంట్లోకి వెళ్లి సాయంత్రం 5.45 గంటలకు లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై కాల్పులు జరిపాడు. తృటిలో కాల్పుల నుంచి తప్పించుకున్న కుమారుడు ఉమర్ హష్మీ వెంటనే కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు హబీబ్ హష్మీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. -
వైఎస్ఆర్ సీపీ నేతలపై ఖాకీల నిర్లక్ష్యం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసుల నిర్లక్ష వైఖరి కొనసాగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసినా ఖాకీలు కళ్లు తెరవడం లేదు. గుంతకల్లు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి తుపాకీ లైసెన్సును పునరుద్ధరించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడువుకు 25 రోజుల ముందే ఆయన దరఖాస్తు చేస్తుకున్నా స్పందించలేదు. తుపాకీ అప్పగించాలని ఆయనకు వజ్రకరూర్ పోలీసులు నోటీసు జారీ చేశారు. గడువుకు ముందే దరఖాస్తు చేసుకున్నా లైసెన్సు ఎందుకు రెన్యువల్ చేయడం లేదని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి సరికాదని పేర్కొన్నారు. తన తుపాకీ లైసెన్సును రెన్యువల్ చేయాలని కోరారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి తుపాకీ లైసెన్సు రెన్యువల్ చేయకపోవడంతో నిరాయుధిగా ఉన్న ఆయనను ప్రత్యర్థులు ఈ నెల 21 కిరాతంగా హత్య చేశారు. నారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడిని కూడా చంపేశారు. -
ఆన్లైన్లో తుపాకీ లెసైన్స్
కేకే నగర్(చెన్నై): ఆన్లైన్ ద్వారా తుపాకీ లెసైన్సు పొందడం, రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా పుదుచ్చేరిలో ప్రవేశపెట్టారు. దేశంలోని అన్నిరకాల ఆయుధాలను పర్యవేక్షించేందుకు వీలుగా ఆన్లైన్లో లెసైన్సులివ్వాలని కేంద్ర హోం శాఖ గతంలో ఆదేశించింది. దీనిపై చర్చించేందుకు పోలీసు, న్యాయ శాఖల అధికారులు, న్యాయమూర్తులు శనివారం పుదుచ్చేరి సచివాలయంలో సమావేశమయ్యారు. అక్కడే సచివాలయ కార్యదర్శి మనోజ్ పరిదా ఆన్లైన్లో లెసైన్సలిచ్చే పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఎక్కడైనా నేరాలు జరిగినచోట తుపాకీ దొరికితే, దానికి కేటాయించిన ప్రత్యేక సంఖ్య ద్వారా తుపాకీ ఎవ రిదో ఆన్లైన్లో సులువుగా తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో డీజీపీ సునీల్‌కుమార్ పాల్గొన్నారు. -
'అతడికి తుపాకీ లైసెన్స్ ఇచ్చింది మేమే'
న్యూఢిల్లీ/పట్నా: హత్య కేసులో ఇరుకున్న జేడీ(యూ) మహిళ ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్ కు తుపాకీ లైసెన్స్ ఇచ్చింది తామేనని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. 2013లో అతడికి లైసెన్స్ మంజూరు చేసామని ఢిల్లీ పోలీసు విభాగం సమాచార అధికారి శుక్రవారం తెలిపారు. అతడిపై మోపిన అభియోగాలపై బిహార్ పోలీసుల నుంచి నివేదిక రాగానే రాకీ యాదవ్ తుపాకీ లైసెన్స్ ను రద్దు చేస్తామని చెప్పారు. తన కారును దాటి వెళ్లిపోయాడనే కోపంతో నడిరోడ్డుపై ఆదిత్య సచ్ దేవా అనే యువకుడిని కాల్చి చంపాడన్న ఆరోపణలతో రాకీ యాదవ్ ను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాకీ యాదవ్ తండ్రి బిండి యాదవ్, ఎమ్మెల్సీ మనోరమా బాడీగార్డ్ రాజేశ్ కుమార్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆదిత్య సచ్ దేవా కుటుంబానికి బిహార్ పోలీసులు భద్రత కల్పించారు. -
ఇక సులువుగా గన్ లైసెన్స్
మూడు డజన్ల పేపర్లు.. రకరకాల పరీక్షలు.. నెలల తరబడి నిరీక్షణ.. ఇకపై ఇవన్నీ మర్చిపోయి గన్ లైసెన్స్ సులువుగా పొందమని కేంద్ర హోం మంత్రత్వశాఖ చెబుతోంది. ఇందుకోసం 56 ఏళ్ల నాటి ఆయుధ చట్టాల్ని కూడా సవరించింది. అప్లికేషన్ ఫాం నుంచి దాదాపు పాతిక పేపర్లను తొలిగిస్తున్నట్లు, అప్లై చేసుకున్న నెల నుంచి మూడు నెలల లోగా తుపాకి లైసెన్స్ ఇచ్చేందుకు శాఖా పరంగా సన్నద్దమైనట్లు గురువారం కేంద్ర మంత్రిత్వశాఖ ఓ ప్రకటన వెలువరించింది. కొత్త అప్లికేషన్ ఫాంలో పూరించవలసిన కాగితాలు పదికి మించి ఉండవని, పోలీస్ వెరిఫికేషన్ కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయనున్నట్లు పేర్కొంది. ఇన్నాళ్లూ ఓ సుధీర్ఘ ప్రహాసనంలా సాగిన గన్ లైసెన్సుల జారీ తాజా ఉత్తర్వులతో సులభతరం కానుంది. అయితే తుపాకి ఉపయోగించడంలో ట్రైనింగ్ లేదా ఏదేనీ షూటింగ్ క్లబ్ నుంచి గుర్తింపు పత్రం సమర్పణను తప్పనిసరి. ప్రతి లైసెన్సుకు యునీక్ ఐడెంటిటీ నంబర్ (యూఐఎన్) కేటాయిస్తామని, 2015, అక్టోబర్ 1లోగా యూఐఎన్ పొందని లైసెన్సులను అక్రమమైనవిగా పరిగణిస్తామని హోంశాఖ అధికారులు తెలిపారు.