arms training
-
సిరియా మిలటరీలో శిక్షణ తీసుకోనున్న హీరో
‘దేశీ ర్యాంబో’ టైగర్ ష్రాఫ్ మరోసారి తన యాక్షన్ విశ్వరూపం చూపించడానికి రెడి అయ్యాడు. బాగీ మొదటి రెండు సీక్వెల్స్‌లో యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసి, సీనియర్ యాక్షన్ హీరోలు అక్షయ్, జాన్ అబ్రహాం ప్రశంసలు పొందిన ఈ దేశీ ర్యాంబో ప్రస్తుతం ‘బాగీ 3’ కోసం రెడి అవుతున్నట్లు సమాచారం. ‘బాగీ’ చిత్ర నిర్మాత సజీద్ నదియవాలా ‘బాగీ 3’ని కూడా నిర్మిస్తానని ‘బాగీ 2’ విడుదల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభించనున్నారు. ‘బాగీ 3’లో యాక్షన్ సన్నివేశాలు గత రెండు చిత్రాలను మించేలా ఉంటాయంటున్నారు చిత్ర దర్శకుడు అహ్మద్. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం టైగర్ ష్రాఫ్ ఏకంగా సిరియా మిలటరీ క్యాంప్‌లో శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం. ‘బాగీ 3’లో యాక్షన్ సన్నివేశాల్లో అధునాతన ‘ఎమ్16’, ‘ఏటీ4’, రాకెట్ లాంచర్ వంటి ఆయుధాలను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. శిక్షణ తీసుకోవడం కోసం ఈ ఏడాది నవంబర్‌లో టైగర్ ష్రాఫ్ సిరియా మిలటరి క్యాంప్‌కు వెళ్లనున్నాడని చిత్ర దర్శకుడు అహ్మద్‌ఖాన్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా కోసం ఎంతైనా కష్టపడే మనస్తత్వం ఉన్న టైగ్ర్ ష్రఫ్ ‘బాగీ’, ‘బాగీ 2’ చిత్రాలలోని యాక్షన్ సన్నివేశాల కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. -
బజరంగ్ దళ్ ఆయుధ శిక్షణ
అయోధ్య: హిందూ మత సంస్థ బజరంగ్ దళ్ తమ కార్యకర్తలకు ఉత్తరప్రదేశ్ లో ఆయుధ శిక్షణ నిస్తోంది. ఆత్మరక్షణ కోసం ఈ విద్యలు నేర్పుతోంది. హిందువులు తమను తాము కాపాడుకోవడానికి తుపాకీ వినియోగం, కత్తి యుద్ధం, కర్రసాములో శిక్షణ ఇస్తోంది. ఇటీవలే అయోధ్యలో శిక్షణ శిబిరం నిర్వహించింది. సుల్తాన్ పూర్, గోరఖ్ పూర్, పిలిభిత్, నోయిడా, ఫతేపూర్ లో కూడా ఇటువంటి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. జూన్ 5 వరకు ఇవి కొనసాగుతాయి. విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్ మత సామరస్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. గో పరిరక్షణ కార్యక్రమాలు కూడా బజరంగ్ దళ్ నిర్వహిస్తోంది.