బజరంగ్ దళ్ ఆయుధ శిక్షణ
అయోధ్య: హిందూ మత సంస్థ బజరంగ్ దళ్ తమ కార్యకర్తలకు ఉత్తరప్రదేశ్ లో ఆయుధ శిక్షణ నిస్తోంది. ఆత్మరక్షణ కోసం ఈ విద్యలు నేర్పుతోంది. హిందువులు తమను తాము కాపాడుకోవడానికి తుపాకీ వినియోగం, కత్తి యుద్ధం, కర్రసాములో శిక్షణ ఇస్తోంది. ఇటీవలే అయోధ్యలో శిక్షణ శిబిరం నిర్వహించింది.
సుల్తాన్ పూర్, గోరఖ్ పూర్, పిలిభిత్, నోయిడా, ఫతేపూర్ లో కూడా ఇటువంటి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. జూన్ 5 వరకు ఇవి కొనసాగుతాయి. విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్ మత సామరస్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. గో పరిరక్షణ కార్యక్రమాలు కూడా బజరంగ్ దళ్ నిర్వహిస్తోంది.