Army Captain
-
కెప్టెన్ అన్షుమన్ భార్యపై అసభ్యకర కామెంట్లు.. పాక్ వ్యక్తి పనే!
న్యూఢిల్లీ: కీర్తిచక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ సతీమణిపై సోషల్‌మీడియాలో పలువురు చేస్తున్న వివాదాస్పద కామెంట్లపై దుమారం రేగుతోంది. అసభ్యకర కామెంట్లు చేసిన వారిలో ఒకరిపై మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా మొదలు పెట్టారు. అయితే అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తి భారతీయుడు కాదని, పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తని తెలుస్తోంది.‘అది చాలా దిగజారిన కామెంట్. సోషల్ మీడియాలో ఆ కామెంట్ చూడగానే సుమోటోగా తీసుకున్నాం. పోలీసులు దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కామెంట్ పెట్టిన వ్యక్తి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి అని తెలిసింది’అని మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ చెప్పారు.కాగా, గతేడాది సియాచిన్‌లో ఆర్మీలో విధులు నిర్వహిస్తుండగా జరిగిన అగ్నిప్రమాదంలో కెప్టెన్ అన్షుమన్ ప్రాణాలు కోల్పోయారు. అయితే తాను చనిపోయే ముందు ఈ ప్రమాదం నుంచి తన సహచరులను ప్రమాదం నుంచి అన్షుమన్ కాపాడారు. ఇందుకుగాను భారత ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక కీర్తిచక్ర అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఇటీవల జులై5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్ భార్య స్మృతిసింగ్,మాతృమూర్తులకు అందించారు. -
ఆర్మీ ఆఫీసర్ అన్నాడు.. అడ్డంగా బుక్కయ్యాడు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో మహిళలను ఆకర్షించడానికి తనను ఆర్మీ ఆఫీసర్‌గా పరిచయం చేసుకుంటున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రేటర్ కైలాష్ 1 పాంతానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో మహిళలను ఆకర్షించడానికి ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ శేఖర్‌గా నాటకం ఆడుతున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆర్మీ యూనిఫాం ధరించిన నిందితుడిని పట్టుకున్నారు. నింధితుడిని నగర పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మోహన్ గార్డెన్ నివాసి దిలీప్ కుమార్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడు వివిధ అంతర్జాతీయ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతనికి ఏవైనా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయా.. అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక మరో ఘటనలో, 100 మందికి పైగా మహిళలకు అశ్లీల సందేశాలు, వీడియోలు పంపినందుకు ఓ జిమ్ ట్రైనర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తన ఫేస్బుక్ మెసెంజర్లో అశ్లీల సందేశాలు, వీడియోలు పంపుతున్నాడని పేర్కొంటూ ఓ మహిళ ఇటీవల సాగర్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, ఫేస్బుక్ నుంచి సమాచారం సేకరించి, నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఫేస్బుక్లో వివిధ నకిలీ ఖాతాలను సృష్టించి అతడు మహిళలకు ఈ సందేశాలను పంపినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఈ భూమిపై మాకింత చోటేది? -
50 మంది సైనికులపై వలపు వల
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి సంబంధించిన కీలక వివరాలను సేకరించేందుకు పాకిస్తానీ మహిళ 50 మంది జవాన్లపై వల వేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. సున్నితమైన సమాచారాన్ని ఆమెతో పంచుకోవడంతో సోమ్‌వీర్ సింగ్ అనే సిపాయిని ఆర్మీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఫేస్బుక్లో అనికా చోప్రా పేరుతో ఖాతా తెరిచి, ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న ఫొటోను ప్రొఫైల్‌కు పెట్టి సదరు మహిళ జవాన్లకు వలపు వల విసిరింది. మిలిటరీ నర్సింగ్ విభాగంలో ఆర్మీ కెప్టెన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకుంది. సోమ్‌వీర్‌ను అరెస్టు చేయడంతోపాటు మిగతా జవాన్లను కూడా ఆర్మీ ప్రస్తుతం విచారిస్తోంది. రాజస్తాన్‌లోని జైçసల్మేర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సోమ్‌వీర్‌కు 2016లో ఈ మహిళ స్నేహ అభ్యర్థనను పంపి సంభాషించడం మొదలుపెట్టింది. త్వరలోనే వారి మాటలు హద్దులు దాటాయి. ఓ దశలో సోమ్‌వీర్ తన భార్యకు విడాకులివ్వాలని కూడా నిర్ణయించుకున్నాడు. అయితే, ఐదు నెలలుగా జమ్మూ నుంచి సోమ్‌వీర్‌కు ఎక్కువగా ఫోన్‌కాల్స్ వస్తుండటంతో ఆర్మీకి అనుమానం వచ్చి అతని సామాజిక మాధ్యమ ఖాతాలపై ఓ కన్నేసింది. ఫేస్బుక్లో సదరు మహిళతో అతని చాటింగ్‌ను ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఆమె పాకిస్తాన్ నుంచి ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లుగా నిర్ధారించుకుంది. సంభాషణల్లో తొలుత నీ పోస్టింగ్ ఎక్కడ లాంటి ప్రశ్నలతో మొదలుపెట్టి ట్యాంక్ ఫొటోలు పంపించమని ఆమె అడిగిందనీ, ఇది ఆమె పన్నిన వల అని తెలియని సోమ్‌వీర్ కొన్ని వివరాలు ఆమెకు తెలిపాడని అధికారులు చెప్పారు. అనంతరం ఆమె సోమ్‌వీర్‌ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందనీ, ఆ తర్వాత సమాచారం ఇచ్చినందుకు బదులుగా సోమ్‌వీర్ డబ్బు తీసుకుంటున్నాడని తెలిపారు. ఇలా మొత్తం 50 మంది జవాన్లపై పాక్ మహిళ ఫేస్బుక్ ద్వారా వల వేసింది. ఒక్కో జవాన్‌కు ఒక్కో సమయాన్ని కేటాయించి, ఆ సమయంలోనే ఆమె మాట్లాడేదని దర్యాప్తులో వెల్లడయింది. -
ఫుట్‌పాత్‌పై మాజీ కెప్టెన్.. దారుణ హత్య
పుణే : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌పై జీవిస్తున్న ఆర్మీ మాజీ కెప్టెన్ ఒకరు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కిరాతకంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. లష్కర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... సైన్యంలో విధులు నిర్వహించి రిటైర్ అయిన కెప్టెన్ రవీంద్ర బాలి(67) చాలా కాలం క్రితమే కుటుంబాన్ని వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నారు. పుణే కంటోన్మెంట్ ఏరియాలోని ఫుట్‌పాత్‌పై ఆయన ఓ చిన్న గుడారం వేసుకుని నివసిస్తున్నారు. గురువారం రాత్రి ఇద్దరు ఆగంతకులు ఆయనపై దాడి చేసి కిరాతకంగా హతమార్చారు. పక్కనే ఉన్న ఓ బంగ్లా వాచ్మెన్ అదంతా చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అధికారులు అక్కడికి చేరుకునే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించటంతో వారొచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆగంతకులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు లష్కర్ ఎస్సై వెల్లడించారు. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడే ఆయన్ని తొలుత చాలా మంది మతిభ్రమించిన వ్యక్తిగా భావించేవారు. కానీ, ఆయన ఓ ఆర్మీ మాజీ అధికారి అన్న విషయం హత్యకు గురైన తర్వాతే స్థానికులకు తెలిసింది. భారీ భద్రత ఉండే కంటోన్మెంట్ ఏరియాలో ఇలాంటి ఘటన జరగటం కలకలం రేపింది. -
హ్యారీకి 100 కోట్ల వారసత్వ సంపద
తల్లి వీలునామా కింద అందుకోనున్న యువరాజు లండన్: బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ ఈ నెల 15న తన 30వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద మొత్తంలో సంపదను అందుకోనున్నారు. 1997లో పారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణంపాలైన తన తల్లి ప్రిన్సెస్ డయానా నుంచి వారసత్వంగా సుమారు రూ. 100 కోట్ల సంపదను స్వీకరించనున్నారు. వీలునామాలో డయానా తన సంపదలో కొంత వాటాను ఇద్దరు కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలకు 25 ఏళ్లు నిండాక పంచాలని పేర్కొన్నారు. అయితే వీలునామా అమలుదారులు మాత్రం ఆ వయసును 30కి పెంచారు. దీంతో ఇప్పటివరకూ ఆ సంపదపై వడ్డీని పొందుతూ వచ్చిన హ్యారీ ఇక ఆ సంపదను కూడా పొందనున్నారు. ప్రిన్స్ హ్యారీ ప్రస్తుతం ఆర్మీ కెప్టెన్‌గా పనిచేస్తూ ఏటా దాదాపు రూ. 40 లక్షల వేతనం అందుకుంటున్నారు. 2012లో 30వ ఏట అడుగుపెట్టిన హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియమ్స్ ఇప్పటికే అతని వాటా సంపదను పొందాడు. ఈ వివరాలను ‘ద సండే టైమ్స్’ వెల్లడించింది.