Arriving
-
స్టేషన్కు వచ్చి చూస్తే రైలు లేదు.. రాలేదనుకుంటా? అంతలోనే షాక్!
ముంబయి: గోవా ఎక్స్ప్రెస్ రైలు 45 మంది ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని మన్మాడ్ స్టేషన్లోకి 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. రైలును అందుకోవడానికి నిర్ణీత సమయానికి స్టేషన్కి వచ్చిన ప్రయాణికులు విషయం తెలుసుకుని తెల్లబోయారు. వాస్కోడగామ-హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్ప్రెస్ మహారాష్ట్రలోని మన్మాడ్కు ఉదయం 10.35కి రావాల్సి ఉంది. కానీ అది రూటు మార్చుకుని ఉదయం 9.05 గంటలకే స్టేషన్కు చేరుకుంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్టేషన్లో నిలిచి, వెంటనే పరుగులు తీసింది. తీరిగ్గా నిర్ణీత సమయానికి గోవా ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు ప్యాసింజర్లు స్టేషన్కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్కు గురయ్యారు. స్టేషన్ మేనేజర్ని నిలదీశారు. తమ ప్రయాణానికి మరో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. రైల్వే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి డాక్టర్ శివరాజ్ మనస్పూరే తెలిపారు. గోవా ఎక్స్ప్రెస్ ఎప్పుడూ వచ్చే బెళగామి--మిరాజ్-దౌండ్ మార్గంలో కాకుండా రోహా-కల్యాణ్-నాసిక్ రోడ్ మార్గంలో మళ్లించారని పేర్కొన్నారు. అందుకే మన్మాడ్ స్టేషన్కి సమయానికి ముందే వచ్చేసిందని వెల్లడించారు. మన్మాడ్ స్టేషన్లో స్టాప్ లేకున్నా గీతాంజలి ఎక్స్ప్రెస్ను నిలిపి ప్రయాణికులను తరలించారు. అక్కడి నుంచి జల్గాన్లో వరకు ప్రయాణికులను తీసుకువెళ్లారు. బాధిత ప్రయాణికుల కోసం జల్గాన్లో గోవా ఎక్స్ప్రెస్ను నిలిపి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
కిడ్నాపర్ల చెరలో నరకం అనుభవించా
-
పోటెత్తిన వికలాంగులు
సంగారెడ్డి క్రైం: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రభు త్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహిం చిన సదరం శిబిరానికి వికలాంగులు పోటెత్తారు. జిల్లాలోని నలుమూలల నుంచి వికలాంగులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. వికలాంగుల ధ్రువీకరణ పత్రం కోసం డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతినెలా రెండు రోజులు ఈ శిబిరం నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఉదయం 6 గంటలకే ఆసుపత్రికి వచ్చిన వికలాంగులు సాయంత్రం వరకు బారులు తీరారు. వందల సంఖ్యలో వచ్చిన వారికి టెంట్లు, మంచినీటి వసతి కల్పించకపోవడంతో మండుటెండలోనే నిలబడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లల అవస్థలు వర్ణణాతీతం. డాక్టర్లు సర్టిఫై చేయడానికి కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. ఒకే ఒక్క ద్వారం గుండా వికలాంగులను ఆసుపత్రిలోకి అనుమతించడంతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. పోలీసుల బందోబస్తు మధ్య ఈ శిబిరం కొనసాగించాల్సి వచ్చింది.