సంగారెడ్డి క్రైం: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రభు త్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహిం చిన సదరం శిబిరానికి వికలాంగులు పోటెత్తారు. జిల్లాలోని నలుమూలల నుంచి వికలాంగులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. వికలాంగుల ధ్రువీకరణ పత్రం కోసం డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతినెలా రెండు రోజులు ఈ శిబిరం నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు.
ఉదయం 6 గంటలకే ఆసుపత్రికి వచ్చిన వికలాంగులు సాయంత్రం వరకు బారులు తీరారు. వందల సంఖ్యలో వచ్చిన వారికి టెంట్లు, మంచినీటి వసతి కల్పించకపోవడంతో మండుటెండలోనే నిలబడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లల అవస్థలు వర్ణణాతీతం. డాక్టర్లు సర్టిఫై చేయడానికి కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. ఒకే ఒక్క ద్వారం గుండా వికలాంగులను ఆసుపత్రిలోకి అనుమతించడంతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. పోలీసుల బందోబస్తు మధ్య ఈ శిబిరం కొనసాగించాల్సి వచ్చింది.
పోటెత్తిన వికలాంగులు
Published Wed, Mar 18 2015 7:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM
Advertisement
Advertisement