Ashok Chopra
-
సినిమాలతో బిజీ.. కుటుంబాన్నే పట్టించుకోలేదు: స్టార్ హీరోయిన్
సెలబ్రిటీ స్టేటస్ అంత ఈజీగా వచ్చేది కాదు. దానికోసం తారలు ఎంతో కష్టపడతారు. పగలూ రాత్రి తేడా లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటారు. కొన్నిసార్లు ఇంటికి కూడా వెళ్లకుండా సెట్స్‌లోనే ఉండిపోతారు. మరికొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఎక్కడో షూటింగ్‌కు వెళ్లాల్సి వస్తుంది. వరుసపెట్టి ప్రాజెక్టులకు సైన్ చేసినవారైతే గడియారంతో పోటీ పడుతూ మరీ పని చేస్తుంటారు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి మనసారా మాట్లాడే సమయాన్ని కోల్పోతారు. ఎన్ని మిస్సయ్యానో నాకే గుర్తులేదు తాను కూడా ఒకానొక సమయంలో సినిమాల గురించే ఆలోచిస్తూ ఫ్యామిలీని పట్టించుకోవడమే మానేశానంటోంది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'మా అమ్మ పుట్టినరోజులు నేను ఎన్ని మిస్సయ్యానో నాకే గుర్తులేదు. ఎన్నిసార్లు తనకు ఫోన్ చేయకుండా ఊరుకున్నానో లెక్కే లేదు. ఎన్నిసార్లు దీపావళి పండగను మిస్సయ్యానో నాకే తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను విదేశాల్లో షూటింగ్లో ఉండేదాన్ని. ఎప్పుడూ సినిమా సినిమా అంటూ వీటన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయాను. జీవితం చాలా చిన్నది కానీ మా నాన్న చనిపోయాక నాకు అన్నీ అర్థమయ్యాయి. తనతో కలిసి ఎన్నటికీ దీపావళి పండుగ జరుపుకోలేనని బాధపడ్డాను. నాన్న అనారోగ్యానికి గురైనప్పుడే నాలో చలనం మొదలైంది. జీవితం చాలా చిన్నది.. మనం పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టి చిన్నచిన్నవాటి కోసం ఎక్కువ ఆలోచిస్తుంటాం, కంగారుపడుతుంటాం. మనకు నిజంగా ఏది ముఖ్యమో వాటి గురించి ఆలోచిస్తే జీవితం ఎంతో బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది. కాగా ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా క్యాన్సర్‌తో పోరాడుతూ 2013లో ప్రాణాలు విడిచారు. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్ -
బిగుతు దుస్తులు వద్దన్నారు: ప్రియాంక
"అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు నా తండ్రి అశోక్ చోప్రా నా అవతారం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అప్పుడు నాకు పదహారేళ్లు. నేను బిగుతైన దుస్తులు ధరించి ఉన్నాను. దీంతో అలాంటి బట్టలు వేసుకున్నావేంటంటూ ఒంటికాలిపై లేచారు. అలా మా ఇద్దరికీ చాలా సేపు ఘర్షణ జరిగింది" అంటూ.. తన తండ్రితో జరిగిన గొడవను గుర్తు చేసుకుందీ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. అయితే ఇలాంటి గొడవలు ఎన్ని జరిగినా తామిద్దరం బెస్ట్‌ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. ఈమేరకు ఓ పత్రికతో మాట్లాడుతూ.. "నేను చేసింది తప్పా, ఒప్పా?, మంచా, చెడా? అనేది పక్కనపెట్టి ఏ విషయాన్నైనా సరే ముందుగా తనతో చెప్పాలనేవాడు. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపిస్తాననేవారు. అంతేకానీ వెంటనే తప్పంతా నాదేనని నిందించేవాడు కాదు. అలా ఎప్పుడూ నాతోపాటు, నా జట్టులో ఉంటానని మాటిచ్చాడు." అని తెలిపింది. (ఏడడుగులేస్తారా?) కాగా ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా 2013లో కాలేయ క్యాన్సర్ వల్ల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఈ భామ చిన్నతనంలో విద్యను అభ్యసించడానికి అమెరికానే ఎందుకు ఎంచుకుందో చెప్పుకొచ్చింది. అక్కడి హైస్కూల్స్‌లో చదవాలని తనకెప్పటి నుంచో కోరికగా ఉండేదని పేర్కొంది. పైగా అక్కడ విద్యార్థులకు యూనిఫామ్ ధరించాలనే నియమ నిబంధనలు కూడా లేవంది. అంతేకాక ఎంచక్కా అమ్మాయిలు తమకు నచ్చినట్లుగా మేకప్ మేకప్ వేసుకుని మరీ వెళ్లొచ్చని తెలిపింది. అలా ఎనిమిదో తరగతిలోనే ఈ వేషాలన్నీ వేశానంది. కాగా ప్రస్తుతం ఈ భామ తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి లాస్ ఏంజెలెస్‌లో ఉంటోంది. చుట్టపు చూపుగా అప్పుడప్పుడు భారత్‌కు వస్తూ ఉంటుంది. కరోనా ప్రబలుతున్న వేళ ఈ గ్లోబల్ జంట భారత్‌కు తన వంతు విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. (రండి కలిసి పోరాడుదాం: ప్రియాంక) -
ఆ పాట వింటే నా వెంటే!
‘డాడీస్ లిల్ గర్ల్’... ఇది ప్రియాంకా చోప్రా చేతి మీద ఉన్న టాటూ. తండ్రి అంటే ఆమెకు పిచ్చి ప్రేమ. అందుకే ఇలా పచ్చ బొట్టు పొడిపించుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా చనిపోయారు. భౌతికంగా మాత్రమే ఆయన దూరమయ్యారని ఆమె అంటున్నారు. అప్పట్లో అశోక్ చోప్రా ఓ పాట పాడారు. ఆ పాటను రిలీజ్ చేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురి కావడం, చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్లడం జరిగిపోయాయి. ఇప్పుడా పాటను తాను నిర్మించి న తాజా పంజాబీ చిత్రం ‘శర్వాణ్’లో వాడారు ప్రియాంక. ‘‘మా నాన్నంటే చాలా ఇష్టం. ఆయనే నాకు రోల్ మోడల్. నాన్న పాడిన పాట వింటున్నపుడు ఆయన నాతో ఉన్నారన్న భావన కలుగుతుంది. మా నాన్న మీద ఉన్న ప్రేమతోనే ‘శర్వాణ్’ నిర్మించా. ఆయన పాడిన పాటను ఈ సినిమాలో ఉపయోగించడం ఆనందంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ నెల 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
తండ్రి పేరుతో ముంబాయిలో వీధి
-
ఆ వేడుక కోసం నాలుగు రోజులు సెలవు!
ప్రియాంకా చోప్రా ఒకరకమైన ఉద్వేగంతో ఉన్నారు. జీవితంలో ఇప్పటివరకూ ఎప్పుడూ కలగని ఓ కొత్త అనుభూతికి గురయ్యారు ఈ బ్యూటీ. కారణం అలాంటిది మరి.. ప్రియాంకా చోప్రా తండ్రి అశోక్ చోప్రా గత ఏడాది చనిపోయారు. దాదాపు 27 ఏళ్లు సైనిక దళంలో సేవలందించిన ఘనత ఆశోక్ చోప్రాది. ఆయన జ్ఞాపకార్థం ముంబయ్‌లోని అంధేరీలో గల ఓ రోడ్‌కి ‘లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ చోప్రా మార్గ్’ అని పేరు పెట్టారు. ఈ రహదారి ఆవిష్కరణ నేడు జరగనుంది. తండ్రికి దక్కిన గౌరవాన్ని కళ్లారా వీక్షించాలనుకున్న ప్రియాంకా చోప్రా యూరప్ నుంచి ముంబయ్ చేరుకున్నారు. ‘దిల్ దడఖ్నే దో’ చిత్రం షూటింగ్ నిమిత్తం అక్కడ ఉన్నారామె. దర్శక, నిర్మాతలకు విషయం చెప్పి, ఓ నాలుగు రోజులు అనుమతి కోరారట ప్రియాంక. ఇది అరుదైన వేడుక కాబట్టి, ప్రియాంక కోరికను మన్నించి ఆమెకు నాలుగు రోజులు సెలవిచ్చేశారు. ముంబయ్ చేరుకున్న ప్రియాంక మాట్లాడుతూ -‘‘ఈ గౌరవానికి మా నాన్నగారు పూర్తి అర్హత ఉన్న వ్యక్తి. ఆపదలో ఉన్నవారికి సేవ చేయడానికి నాన్నగారెప్పుడూ వెనకాడలేదు. ఆ సేవలకు తగిన గుర్తింపు లభించింది. నాన్నగారికి ముంబయ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ మహానగరంలో రహదారి ఉండటం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.