Asiatic lions
-
‘మృగరాజు రక్షణకు వెయ్యికోట్లు ఇవ్వండి’
అహ్మదాబాద్ : అంతుచిక్కని వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్న గుజరాత్ గిర్ మృగరాజుల రక్షణకు తక్షణమే వెయ్యి కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్‌నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అలాగే వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ, పర్యవేక్షణ లోపంతోనే సింహాలు మృతి చెందాయని ఆరోపించారు. గిర్ అటవీ సమీపంలోని అక్రమ రిసార్ట్స్‌లను వెంటనే తొలిగించాలని, గుజరాత్ సింహాల రక్షణ కోసం వెయ్యికోట్ల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గుజరాత్ సింహాలకు పులులకిచ్చే ప్రాధాన్యతనే ఇస్తూ.. టైగర్ ప్రాజెక్ట్‌లా.. లయన్స్ ప్రాజెక్ట్ చేపట్టాలని సూచించారు. (చదవండి: మృగరాజుకు వైరస్ సోకిందా?) మోదీకి ఓ గుజరాతీగా.. గిర్ సింహాలు గుజరాత్ ఆత్మగౌరవమనే విషయం తెలుసన్నారు. వాటి రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్‌ను తెప్పించాలని, సింహాల కోసం వెటర్నరీ డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతుపట్టని రోగాలు, ప్రాణాంతక వైరస్‌తో దాదాపు 15 రోజుల్లోనే 23 సింహాలు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అడవులకు దగ్గరగా జనావాసాలు విస్తరించడంతో అంతుచిక్కని వ్యాధులతో పాటు గొర్రెలు, మేకలు ఇతర పెంపుడు జంతువుల నుంచి సింహాలకు సోకుతున్న వైరస్ ఈ మరణాలకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. (చదవండి: వైరస్‌తోనే గిర్ సింహాల మృతి) చదవండి: మృగరాజుకు ఎంత కష్టం! -
మృగరాజుకు వైరస్ సోకిందా?
అహ్మదాబాద్ : గత 20 రోజుల్లో 21 సింహాలు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మృతిచెందిన 20 సింహాలు గుజరాత్, అమ్రేలి జిల్లా పరిధిలోని గిర్ అడువిలోనివే కావడం చర్చనీయాంశమైంది. ఇక అధికారులు మాత్రం వైరల్ ఇన్ఫెక్షన్తో సింహాలు మృత్యువాత పడ్డాయని చెబుతున్నారు. అటవిశాఖ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12 నుంచి 19 మధ్య మొత్తం 11 సింహాలు మృతి చెందాయన్నారు. ఇందులో 7 అడవిలోనే మృతి చెందగా.. మరో నాలుగు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాయని తెలిపారు. 20 నుంచి 30 మంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సింహాలకు ట్రీట్మెంట్ అందజేశామన్నారు. చికిత్స సమయంలోనే మరో 10 సింహాలు మృత్యువాత పడ్డాయని, ఇది గిరి అడవుల్లోనే తీవ్ర విషాదం నింపిందన్నారు. వైరస్ వల్లనే సింహాలు మృతి చెందాయని, అది ఏం వైరసో ఇంకా నిర్దారణ కాలేదన్నారు. కేవలం ఈ ప్రాంతంలోనే సింహాలు మృతి చెందాయని స్పష్టం చేశారు. వీటిలో ఆరు సింహాలు మాత్రం ప్రొటోజోవా అనే వైరస్‌తో మృతి చెందినట్లు గుర్తించామని తెలిపారు. మృతి చెందిన సింహాల నుంచి సాంపుల్స్ తీసుకున్నామని, వాటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) పుణె పరిశీలిస్తుందన్నారు. ‘సింహాల మరణాల సంఖ్య 21కు చేరింది. ఏడు సింహాలు చికిత్స పొందుతూ మృతి చెందాయి. వైరస్ వల్ల మృతి చెందాయని గుర్తించాం. ఏ వైరసో కనుక్కోవడానికి కొంత సమయం పడుతోంది.’ అని జునగాద్ విల్డ్‌లైఫ్ సర్కిల్ ఛీఫ్ డీటీ వసవాడ మీడియాకుతెలిపారు. ఇక సింహాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాటికి సంబంధించిన ప్రత్యేకమైన మెడిసిన్స్, వ్యాక్సిన్స్‌ను అమెరికా నుంచి తీసుకురావాలని కూడా నిర్ణయించింది. 2015 లెక్కల ప్రకారం 523 సింహాలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 600కు పెరిగందని అటవీ శాఖ పేర్కొంది. చదవండి: 11 సింహాలు మృత్యువాత -
'సింహాలను తరలిస్తాం, ఏడు కోట్లు ఇవ్వండి'
ఆసియా ఖండానికి చెందిన జాతి సింహాలను తరలించేందుకు ఏడు కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కోరింది. గుజరాత్ నుంచి మధ్య ప్రదేశ్ లో గ్వాలియర్ డివిజన్ లోని షియోపూర్ జిల్లాలోని పాల్పర్ కునో వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఏప్రిల్ 15 తేదిన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. జాతి సింహాలు అంతరించే ప్రమాదం ఉందనే భయాందోళనలు తలెత్తడంతో వేరే ప్రాంతానికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ కు సింహాలను తరలించాలని సుప్రీం కోర్టు తీసుకున్న తుది నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర పర్యావరణ, అడవుల శాఖ ఆదేశాల్ని జారీ చేసింది. సింహాల తరలింపుకు సుప్రీం ఆరునెలల గడువు విధించిందని, అయితే ఈ కార్యక్రమం చాలా రిస్క్ తో కూడిన పని అని.. ఆరునెలల గడువు చాలా తక్కువ అని..గడువు పొడిగించాలని పర్యావరణ శాఖను అధికారులు కోరారు. ఇప్పటికే నాలుగు నెలల కాలం ముగిసిందని.. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. సింహాల సంరక్షణతోపాటు మౌళిక సదుపాయాలు, ఇతర పనుల కోసం ఏడు కోట్ల 37 లక్షల రూపాయలను కేంద్రాన్ని కోరామని అధికారులు తెలిపారు. సింహాల తరలింపు కార్యక్రమం కోసం సంబంధింత కేంద్ర మంత్రిత్వ శాఖకు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాయనున్నట్టు అధికారి తెలిపారు. పులుల సంరక్షణ కేంద్రంలో టూరిజంను ఆపివేయాలని పర్యావరణ కార్యకర్త ఒకరు ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.