Assembly election date
-
PM Narendra Modi: బీజేడీ సర్కార్.. జూన్ 4తో సమాప్తం
బరంపూర్/నబారంగ్పూర్: ఒడిశా శాస నసభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన రాష్ట్రంలో బిజూజనతాదళ్ (బీజేడీ) ప్రభుత్వం అంతర్థానమవుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలయ్యాక మొదటి సారిగా ప్రధాని మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. దేశంలోనే అగ్రరాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దే సదవకాశాన్ని బీజేపీకి ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. ఒరియా భాష, సంస్కృతులను అర్థంచేసుకునే ముఖ్యమంత్రే రాష్ట్రానికి అవసరమని బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్‌పై మోదీ విమ ర్శలు గుప్పించారు. పట్నాయక్‌కు ఒరియా భాషపై పట్టులేదని ఓ అపవాదు ఉంది. గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండే నబా రంగ్‌పూర్, బరంపూర్లలో సోమవారం ఎన్నికల ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. ఎన్నికలయ్యాక డబుల్ ఇంజన్ సర్కార్‘‘మోదీ నాయకత్వంలో పదేళ్ల అభివృద్ధిని మీరు కళ్లారాచూశారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే మోదీ ప్రభుత్వం గిరిజనులకు కేటాయింపులను ఐదు రెట్లు పెంచింది. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను 400కు పెంచాం. ఒక్క నా మంత్రిత్వశాఖలోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగులు 7 శాతం దాకా ఉన్నారు. బీజేడీ సర్కార్ కేంద్ర ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయని కారణంగా ఇక్కడి ప్రజలు ఆ పథక ప్రయోజనాలకు దూరమయ్యారు. జల్‌జీవన్ మిషన్ కింద ఒడిశాకు రూ.10,000 కోట్లు ఇచ్చాం. కానీ పట్నాయక్ సర్కార్ వాటిని సద్వినియోగం చేయలేదు’’ అని ఆరోపించారు.మాకు ఐదేళ్లు ఇవ్వండి‘‘ రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని మీరు కాంగ్రెస్‌కు 50 ఏళ్లు ఇచ్చారు. బీజేడీకి 25 సంవత్సరాలు ఇచ్చారు. బీజేపీకి కేవలం ఐదు సంవత్సరాలు ఇచ్చి చూడండి. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్ది చూపిస్తాం’’ అని అన్నారు. -
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
న్యూఢిల్లీ: 2023లో తొలి భాగంలో.. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయా, త్రిపురలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఒకే దఫాలో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం మధ్యాహ్నం పాత్రికేయ సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించారు సీఈసీ రాజీవ్ కుమార్. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నాగాలాండ్‌కు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13,09, 651 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. అందులో 59 స్థానాలు ఎస్టీ కేటాయింపు కాగా, జనరల్ కేటగిరీ ఒక్క స్థానానికే ఉంది. ఇక 12 జిల్లాలతో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 21,61,129 ఓటర్లు ఉన్నారు అక్కడ. 55 స్థానాలు ఎస్టీ, జనరల్ కోటాలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎనిమిది జిల్లాలు.. 60 స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 28,13,478 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. ఇక్కడ 30 జనరల్, ఎస్సీ 10, ఎస్టీ 20 స్థానాలు ఉన్నాయి. Voting for Assembly elections in Tripura to be held on February 16 & in Nagaland & Meghalaya on February 27; results to be declared on March 2.#AssemblyElections2023 https://t.co/V8eOZvhc5g pic.twitter.com/rRNKWeNjUq — ANI (@ANI) January 18, 2023 మొత్తం 180 స్థానాలకు జరగబోయే ఎన్నికల కోసం 9,125 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. త్రిపుర (Tripura)లో మాణిక్ సాహా నేతృత్వంలోని ప్రభుత్వం, మేఘాలయా, నాగాలాండ్సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది బీజేపీ. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల ఐదు సంవత్సరాల పదవీకాలం వరుసగా మార్చి 12, మార్చి 15, మార్చి 22వతేదీల్లో ముగియనుంది. మార్చి నెలాఖరులోగా మూడు ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త అసెంబ్లీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. గత వారం.. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ పార్టీలు, రాష్ట్ర, కేంద్ర భద్రత, పౌర అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించింది. రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది. ఈ మేరకు పక్కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. There are more than 62.8 lakh electors combined in Nagaland, Meghalaya & Tripura including - 31.47 lakh female electors, 97,000 80+ voters, and 31,700 PwD voters. Over 1.76 lakh first-time voters to participate in the elections in 3 states: CEC Rajiv Kumar pic.twitter.com/xnDne8TjQ1 — ANI (@ANI) January 18, 2023 -
అసెంబ్లీ ఎన్నికలెప్పుడు...?
ఇంటర్నెట్లో పోరును ఉధృతం చేసిన ఆప్ న్యూఢిల్లీ: డిసెంబర్ నెల దాదాపు ముగింపుకు వస్తుండగా, ఇంతవరకు అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించకపోవడంతో, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న తన డిమాండ్‌ను సామాజిక వెబ్సైట్లలో మరింత ఉధృతం చేసింది. అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్ నెల వరకూ వాయిదా వేయనున్నారని తమకు అనధికార వర్గాల ద్వారా తెలిసిందని పార్టీ ప్రతినిధి ఆతిషి మర్లీనా చెప్పారు. జమ్మూ- కశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలలో ఫలితాలు బీజేపీకి ఆశాజనకంగా లేకపోతే ఢిల్లీ ఎన్నికల తేదీని ఏప్రిల్ వరకూ వాయిదా వేసే అవకాశం ఉందని ఆప్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫిబ్రవరి మాసంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తి కానుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో కూడా జరగవచ్చని భావిస్తోంది. నవంబర్ చివరి వారంలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ అసెంబ్లీ రద్దు కావడంతో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ రద్దయి కూడా నెల రోజులు గడుస్తోందని, కానీ ఎన్నికల తేదీని మాత్రం ప్రకటించడం లేదని ఆప్ నాయకుడొకరు విమర్శించారు. బీజేపీ కుయుక్తులు పన్ని ఏదో ఒక నెపంతో ఎన్నికలను వాయిదా వేసేందుకే ప్రయత్నిస్తోందన్న భావన తమకు కలుగుతోందని మరో నాయకుడు అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికల తేదీని ప్రకటించాలన్న తమ డిమాండ్‌పై చర్చను ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘ఢిల్లీ ఎన్నికలు ఏప్రిల్‌కు వాయిదా వేశారా? (ఎందుకు), బీజేపీ అంతగా భయపడుతోందా?’’ అని ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ గురువారం ట్వీటేశారు. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నుంచి వైదొలగిన నాటి నుంచే తాజా ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది.