కరుణానిధికి సెలవు మంజూరు
చెన్నై: డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి తమిళనాడు అసెంబ్లీ సెలవు మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న కురువృద్ధ నేత సభకు హాజరు కాలేనందున సెలవు ఇవ్వాలని ఆయన తనయుడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ మంగళవారం శాసనసభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించిన సభ.. సభకు హాజరు కానవసరం లేదంటూ ఏకగ్రీవ అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి వర్షాకాల సమావేశాలకు మాత్రమే వర్తిస్తుంది. గత 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి తిరువరూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గత ఏడాది నుంచి ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు.