తెలంగాణకు ‘అసోచామ్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ‘అసోచామ్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో మూడున్నర లక్షల మం దికి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఏడు లక్షల మందికి శిక్షణ ఇవ్వడంతో ఈ అవార్డుకు ఎంపికైంది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ చేతులమీదుగా కార్మిక శాఖ కార్యదర్శి అవార్డు అందుకోనున్నారు.