assosiation
-
పేపర్ సంక్షోభం! ఇక 'పుస్తకాలు' ఉండవేమో!
No textbooks for students: పాకిస్తాన్లో లోపభూయిష్టమైన విధానాలు, ద్రవ్యోల్బణం తదితర కారణాల రీత్యా తీవ్రమైన పేపర్ సంక్షోభం తలెత్తింది. దీని ఫలితంగా వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ అధికారులు చెబుతున్నారు. అదువల్ల స్కూళ్లు ఆలస్యంగా ఆగస్టులో ప్రారంభమవుతాయని పాకిస్థాన్ పేపర్ మర్చంట్ అసోసియేషన్, పాకిస్థాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రింటింగ్ గ్రాఫిక్ ఆర్ట్ ఇండస్ట్రీ, పేపర్ పరిశ్రమకు సంబంధించిన ఇతర సంస్థలు తెలిపాయి. పేపర్ ధర పెరగడం వల్ల ప్రచురణకర్తలు ధరను నిర్ణయించలేకుపోతున్నారని పాకిస్తాన్‌కి చెందిన స్థానికి మీడియా పేర్కొంది. అందువల్లే సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంక్వా వంటి పాఠ్యపుస్తకాల బోర్డులు ఇక ముద్రించలేమని స్పష్టం చేశాయి. దీంతో పాకిస్తాన్ కాలమిస్ట్ అయాజ్ అమీర్ దేశంలోని అసమర్థలైన పాలకుల పై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు పాకిస్తాన్ గత రుణాలను చెల్లించేందుకు అప్పుల తీసుకునే విషవలయంలో చిక్కుకుపోయిందంటూ ఆవేదన చెందారు. ప్రస్తుతం ఏ దేశాలు పాకిస్తాన్‌కి రుణ సాయం చేయడానికి ఇష్టపడని దుస్థితలో ఉందని చెప్పారు. దీన్ని చైనా క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. ఆ దిశగానే రుణాలు, పెట్టుబడుల చెల్లింపుల విషయమై ఈ తరుణంలోనే పాకిస్తాన్‌తో గట్టి బేరం కుదుర్చుకుని పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు యత్నిస్తోందన్నారు. ఈ మేరకు పాకిస్తాన్ 2021-22 ఆర్థిక సంవత్సారానికి గానూన సుమారు రూ. 30 వేల కోట్ల చైనా ట్రేడ్స్ ఫైనాన్స్ ఉపయోగించినందుకు సుమారు రూ. వెయ్యి కోట్లు పైనే వడ్డిని చెల్లించిందని నివేదిక పేర్కొంది. (చదవండి: యుద్ధం క్లైమాక్స్‌కి చేరుకుంటున్న వేళ...రష్యాకి ఊహించని ఝలక్!) -
ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది: ఏపీ జేఎంసీ
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 23కు ఏపీ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ మద్దతు పలికింది. తొమ్మిది సెక్షన్లతో పాటు సెక్షన్‌కు 40 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతి ఇవ్వడంపై ఏపీ జేఎంసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు గుండా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, తదితరులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామకృష్ణను కలిశారు. అనంతరం ఆన్లైన్ అడ్మిషన్లు కొనసాగించాలని వినతి చేశారు. ఈ సందర్భంగా గుండా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 23కు రాష్డ్ర వ్యాప్తంగా నాన్ కార్పోరేట్ జూనియర్ కళాశాలల తరపున మద్దతు పలుకుతున్నామన్నారు. జీఓ 23ను యధావిధిగా ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. చదవండి: ఆన్ లైన్‌తో ‘ప్రయివేట్’ అక్రమాలకు అడ్డుకట్ట ‘జీఓ నెంబర్ 23 అమలుచేయాలని హైకోర్టులో ఇంప్లీడ్ అవుతున్నాం. కొన్ని కార్పోరేట్ కళాశాలలు జీఓ23నుని అడ్డుకోవడానికి కుట్రలతో కోర్టుని ఆశ్రయించాయి. ఇంటర్ విద్యలో కార్పోరేట్ ఆధిపత్యం తొలగిపోవాలి. విద్యార్థుల తల్లితండ్రులు కార్పొరేట్ కళాశాలల మాయమాటలు నుంచి బయటపడాలి. జీ+3 జూనియర్ కళాశాలల భవనాలకి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కోసం 60 రోజుల సమయమివ్వడానికి కమిషనర్ ఒప్పుకున్నారు. ఇదే సమయంలో ఆయా కళాశాలలు అడ్మిషన్లు నిర్వహించుకోవడానికి ఇంటర్ మీడియట్ బోర్డు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఇంటర్ ఫీజు 3119 రూపాయిలు మాత్రమే ఉంది. ఈ ఫీజుని సవరించాలని కోరాం. కనీసం 25 వేల నుంచి 40 వేల వరకు పెంచాలని కోరాం. ఆన్లైన్ అడ్మిషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్ విద్యలో సమూల మార్పులకి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది. అని పేర్కొన్నారు. చదవండి: అమరావతి ఉద్యమం కథ,స్క్రీన్‌ప్లే బాబుదే -
సినీ మహిళల కోసం అసోసియేషన్
పెరంబూరు: సినీ మహిళా సంరక్షణ కోసం ఒక అసోసియేషన్ ప్రారంభం కానుంది. సౌత్ ఇండియన్ ఫిలిం ఉమెన్స్ అసోసియేషన్ పేరుతో మే ఒకటవ తేదీన ప్రారంభించనున్నట్లు వైశాలి సుబ్రమణియన్ గురువారం వెల్లడించారు. దీని గురించి ఆమె తెలుపుతూ సినీరంగంలో మహిళల సంక్షేమం కోసం ఈ అసోసియేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అసోసియేషన్‌కు తాను అధ్యక్షురాలిగానూ, వీపీ.ఈశ్వరి కార్యదర్శకురాలుగానూ, ఎస్.మీనా మరుదాసి ఉపకార్యదర్శిగానూ, ఎం.గీత కోశాధికారిగానూ, ఎంజల్ సామ్రాజ్ ఉపాధ్యక్షురాలిగానూ బాధ్యతలు నిర్వమించనున్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణికి తెలియజేయగా మంచి ప్రయత్నం అమలు ప్రారంభించండి అని ప్రోత్సహించారని చెప్పారు. అదే విధంగా దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, ఛాయాగ్రాహకుల సంఘం అధ్యక్షుడు పీసీ.శ్రీరామ్ తమ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారని తెలిపారు. మే ఒకటవ తేదీన జరగనున్న ఈ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకకు చిత్రపరిశ్రమకు చెందిన 24 శాఖలకు చెందిన ప్రముఖులతో పాటు పీసీ.శ్రీరామ్, నటుడు సత్యరాజ్, నటి రోహిణి, రేవతి, సచ్చు, పుష్కర్గాయత్రి విశ్చేయనున్నారని తెలిపారు. అదేవిధంగా తమ సౌత్ ఇండియన్ ఫిలిం ఉమెన్స్ అసోసియేషన్‌లో సినీపరిశ్రమకు చెందిన మహిళలందరూ సభ్యులుగా చేరాలని వైశాలి సుబ్రమణియన్ తెలిపారు. -
ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు
కరీంనగర్ సిటీ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కరీంనగర్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఆంజనేయరావు అధ్యక్షతన మంగళవారం ఆర్ఐవో కార్యాలయంలో జరిగింది. ఇప్పటివరకు అధ్యక్షురాలుగా ఉన్న సుహాసిని డీవీఈవోగా పదోన్నతి పొందడంతో ఖాళీ అయిన అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేశారు. ఉపాధ్యక్షుడిగా ఎస్.హన్మాండ్లు, సలహాదారుడిగా కె.జితేందర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బదలీలు జరగలేదని, కొత్త జిల్లాలు ఏర్పడుతున్న తరుణంలో బదిలీలు చేపట్టాలని కోరారు. నూతన అధ్యక్షుడిని డీవీఈవో సుహాసిని, ఆర్ఐవో అబ్దుల్ ఖాలీక్ అభినందించారు. సమావేశంలో సంఘం సంయుక్త కార్యదర్శి డి.మధుమోహన్రావు, మహిళా కార్యదర్శి డి.కల్పన, ప్రతినిధులు డి.మనోహర్, కె.రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
హైర్ బస్సు అసోసియేషన్ కార్యవరం ఎన్నిక
కావలిఅర్బన్ : కావలి ఆర్టీసీ డిపో హైర్‌బస్సు అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని వైట్‌హౌస్ హోటల్లో గురువారం అసోసియేషన్ సమావేశం జరిగింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు వెంకటస్వామి, పోలవరపు శ్రీమన్నారాయణ, కోశాధికారి జాగర్లమూడి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు ఎంవెంకట్రావులు హాజరయ్యారు. కావలి డిపో నూతన అధ్యక్షుడిగా ఎం.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శిగా కె.రఘుబాబు, కోశాధికారిగా దయాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రామ్మోహన్‌రెడ్డి, కె.జనార్దన్‌రెడ్డి, సభ్యులుగా గోపాల్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, శీనయ్య, ఖాదర్వలీలను ఎన్నుకున్నారు. అనంతరం పలు సమస్యలపై చర్చించారు.