Atlanta City
-
అట్లాంటాలో యాత్ర 2 రిలీజ్ సంబరాలు
-
అట్లాంటాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జూలై 11న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ హయాంలో జరిగిన సంక్షేమ పథకాల అమలు, ప్రజలు పొందిన లబ్ధి.. నేడు జగనన్న పాలనలో జరుగుతున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి చర్చించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదివి, అట్లాంటాలో ఉంటున్న కొంతమంది ఆయనను స్మరించుకుంటూ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. (మేరీ ల్యాండ్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు) మరికొంత మంది వైఎస్సార్‌తో తమకున్న సాన్నిహిత్యాన్ని, ఆయన హయాంలో చేకూరిన లబ్ధి, ప్రజాసంక్షేమ ఫలాల గురించి ప్రసంగించారు. కాగా నేడు వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో తండ్రి బాటలోనే పయనిస్తూ రాజన్న పాలనను గుర్తు చేస్తోందన్నారు. ఇటువంటి కష్టకాలంలో కూడా సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందిస్తూ సంక్షేమ రాజ్యం దిశగా దూసుకుపోతోందని ప్రశంసించారు. కార్యక్రమంలో శ్రీని కొట్లూరి, వెంకటరామి రెడ్డి, గోపీనాథ్ రెడ్డి నంద, భూపాల్ రెడ్డి, కృష్ణ కొనకొండ్ల, మహతి, లక్ష్మీనారాయణ, వెంకట్ మీసాల, బాల, సంతోష్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు. (వాషింగ్టన్ డి.సిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు) -
అట్లాంటాలో వైఎస్సార్ జయంతి వేడుకలు
జార్జియా: అట్లాంటాలో స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బిరియానీ పాట్ రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ వేడుకలు జరిగాయి. సుమారు వందమందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ చిరకాల మిత్రులు ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్తో తన అనుభవాలను కొన్నింటిని అక్కడి ప్రవాసాంధ్రులతో పంచుకున్నారు. వంద రోజుల పాటు తాను రాజకీయాలు మాట్లాడకూడదని నిశ్చయించుకున్నందున, వాటి గురించి ప్రస్తావించకుండా వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా వారితో తన అనుబంధాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడతానంటూ ప్రసంగాన్ని ప్రారంభిచారు. వైఎస్ఆర్తో తనకున్న అనుబంధం ఒక పార్టీ అధినేతకు, కార్యకర్తకు ఉన్న సంబంధం మాత్రమేనని అయితే ఆయనకు నాలో కొన్ని అంశాలు నచ్చటం వలన తనను అభిమానించి ఎంపీని చేశారన్నారు. పార్టీలకతీతంగా అందరి హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ఆర్ అని తెలిపారు. ఆయన మరణవార్తను విని తట్టుకోలేక గుండె ఆగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, అలా ప్రాణాలు కోల్పోయిన ఒక కుటుంబం గురించి సవివరంగా చెప్పారు. ఆయన ప్రసంగం విన్నవారందరికీ ఒక్కమారు కన్ను చెమర్చిన మాట వాస్తవం. చివరగా అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ఒకమాట చెప్పమని అడిగారు. దీనికి ఉండవల్లి స్పందిస్తూ జగన్ కేవలం మంచి పరిపాలన అందిస్తే సరిపోదు. తన తండ్రి ఇచ్చినటువంటి అద్భుతమైన పాలనను మరిపించగలిగేలా, గొప్పగా పాలన అందించాలి. అది అతని ముందున్న సవాలు. ప్రస్తుత ప్రభుత్వం వేసే అడుగులు ఆ దిశగానే ఉన్నాయి. తన ప్రయత్నంలో సఫలీకృతుడవుతాడనే భావిస్తున్నాను. ఎప్పుడూ ఏ సభలకు హాజరవ్వని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకసారి వైఎస్ఆర్ ఆహ్వానం మేరకు విశాఖపట్నం సభకు రావడం, ఆ సభలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలుపరుస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఇటువంటి నేతల వల్ల దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందంటూ అభినందించడాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ అందరి మనసుల్లో ఉన్నారంటే అందుకు ఆయన చేసిన మంచి పనులే కారణమని కొనిడియారారు. విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ అభిమాలు మాతృదేశ అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అట్లాంటా వైఎస్ఆర్సీపీ విభాగాన్ని, వైఎస్ఆర్ అభిమానుల్ని ప్రత్యేకంగా అభినందించారు. -
"చరిత్రకే ఒక్కడు" పుస్తక ముఖ చిత్ర ఆవిష్కరణ
"చరిత్రకే ఒక్కడు" పుస్తక ముఖ చిత్రాన్ని, అట్లాంటా మహానగరంలో, ప్రవాసాంధ్ర పాత్రికేయుడు వేణుగోపాల ఉడుముల ఆధ్వర్యములో, ప్రముఖ తెలుగు సామాజిక నాయకులు డాక్టర్ ప్రేమ రెడ్డి , డాక్టర్ మల్లా రెడ్డి, డాక్టర్ సంజీవ రెడ్డి, డాక్టర్ హరనాథ్ పొలిచర్ల ఆవిష్కరించారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర "చరిత్రకే ఒక్కడు" ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనే పట్టుదలతో, రచయత చెరుకు కరణ్ రెడ్డి మరియు ప్రవాసాంధ్ర పాత్రికేయుడు, వేణుగోపాల ఉడుముల సహకారముతో, డిసెంబర్ 30వ తేది, ఈ అద్బుతమైన పుస్తకాన్ని ప్రపంచ వ్యాప్తంగా, హైదరాబాద్ లో మరియు తెలుగు వాళ్ళున్న దేశాల్లో విడుదల చేస్తున్నారు.