ఏటీఎం ధ్వంసం చేసిన దుండగులు
కూకట్పల్లి: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లో యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఆదివారం రాత్రి ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు మెషీన్ను ధ్వంసం చేశారు. బ్యాంకు ఏటీఎం క్లీనింగ్ సిబ్బంది శుభ్రం చేయడానికి రాగా మిషన్ ధ్వంసం అయి కనిపించింది. దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించారు. దీని పక్కనే మరో రెండు ఏటీఎంలు ఉన్నాయి. దొంగలను పట్టుకునేందుకు క్లూస్ టీం రంగంలోకి దిగింది.